Wednesday, July 18, 2007

మీ ప్రశ్నలు, మా సమాధానాలు -2

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు

కొత్త పాళీ said... June 5, 2007
సార్ మీరు ఎంతో అనుభవజ్ఞులు, పెద్దవారు, ఇలా అంటున్నందుకు మన్నించండి. ఈ తీరుగా రాసిన జ్ఞాపకాల వల్ల ఎవరికీ ఏమీ ప్రయోజనం ఉండదు. ఈ టపా చదివితే చాలా వరకూ ప్రముఖ రాజకీయుల పేర్ల జాబితా (name dropping) గానూ, కొంత స్వోత్కర్షగానూ అనిపించింది.
ఆ కాలపు రాజకీయ వాతావరణం గురించో, పరిస్థితుల గురించో, వ్యక్తుల గురించో ఈ కాలం వాళ్ళు తెలుసుకోదగిన విషయాలు రాస్తే బాగుంటుంది. - కొ.పా

Aswini Kumar. said…..

సార్,
మీరు ఎంతో మందిని కలిసారు, వారితొ interact అయ్యారు. మేము తెలుసుకొవలిసింది, దానిలొ ఎమయిన వుంటే, అప్పటి సాంఘిక, రాజకియ ,ఆర్థిక విషయాల గురించి, తెలిపితె ఉపయొగంగా వుంటుంది.
అ.కు

Cbrao says….

మీరడిగిన రాజకీయ వాతావరణం, పరిస్థితులు , వ్యక్తుల గురించి ఇన్నయ్య గారు, చాలా పుస్తకాలు గతంలోనే వెలువరించి ఉన్నారు. ఇన్నయ్య గారి పుస్తకాలకై ఇక్కడ చూడండి.

1) Library of Congress, Washington, D.C.
http://www.loc.gov/help/contact-general.html
Search for innaiah at Library of Congress Online Catalogue
2) Amazon.com
3) avkf.org
4) Visalandhra Book House, Hyderabad.
Latest Telugu books of Innaiah

Download list of Sri Innaiah’s books available at 1 to 3 of above organizations.

మీరు వెళ్ళడించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, ఆనాటి నుండి ఈనాటి వరకు గల రాజకీయ, సాంఘిక పరిస్తితులను వెల్లడించిన ఇన్నయ్య గారి పుస్తకాన్ని, మీ సౌకర్యం కోసం e-పుస్తకముగా అందిస్తున్నాము.



ఆంధ్ర ప్రదెష్ ఏర్పడటానికి దోహదం చేసిన పరిస్థితులు ఆసక్తికరంగా ఉంటాయి. అందులో, రాజకీయ వాదులతో పాటు, పత్రికలు ప్రముఖ పాత్ర వహించాయి. సమకాలీన సాంఘిక - రాజకీయ స్తితిగతులను బేరీజు వేసి, తెలుసుకోవటం భావితరాలవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తమిళ పాలన నుండి బయట పడిన ఆంధ్రులు, నైజాం నిరంకుశ పెత్తనం నుండి విమోచన పొందిన తెలుగువారు కలిసి విశాలాంధ్ర గా ఏర్పడ్డారు. ఇందుకు భాష, సంస్కృతి, సంస్కరణలు అక్కరకు ఒచ్చాయి.మళ్ళే ఇప్పుడు అదే ప్రజలు చీలిపోయే ధొరణిలో ఉన్నారు. వీటన్నిటి వెనక ఉన్న రాజకీయాలు, సమాజ పరిణామాలు కూలంకషగా వందేళ్ళ పాటు ఎలా మారుతూ వచ్చాయో వీక్షించిన చరిత్ర ఇది.ఏ పార్టీకి చెందకుండా చేసిన నిశిత పరిశీలన.వ్యక్తుల పాత్ర, పార్టీల ధొరణి, సంఘాల పోకడ మిళితం చేసి చూసిన, గ్రంధం ఇది.సమాచారదర్శినిగాను, విధ్యార్ధులకు ఉపకరించే విషయం గా కూడా, ఈ e-పుస్తకము ఉపయుక్తకరంగా ఉండగలదని, మా భావన.

Microsoft Word - A Centure of Politics
Microsoft Word - A...
Hosted by eSnips

No comments: