Tuesday, November 18, 2008

7 నెలల ముఖ్య మంత్రి భవనం తో


Bhavanam Venkatram 1932-2002






Bhavanam at our residence in Hyderabad




భవనం వెంకట్రం మా కుటుంబ మిత్రుదు. 1978 లో విద్యా మంత్రి గా వున్నప్పుడు పరిచయం మొదలై చివరివరకు సాగింది.ముఖ్య మంత్రిగా 7 నెలలు మాత్రమే 1982 లొ కొనసాగాడు. తరచు మా ఇంటికి రావదం ఆప్యాయం గా మాటలు చెప్పదం ,సంత్రుప్తిగా భోజనం చేయదం ఆయన అలవాటు. కళా ప్రియుడు. సో ష లిస్త్ భావాలతొ రాజకీయాలలొ ప్రవెసించారు .ఆయన రెడ్డి . కమ్మ ను పెళ్ళి చేసుకున్నారు . తన పేరులో రెద్ది తొలగించుకున్నాడు. చక్కని ప్రసంగాలు చేసే వారు. కాంగ్రెస్ రాజకేయాలలో ఇమడ లేక ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. కళలు సాహిత్యం ఇష్తం.
కొన్ని పర్యాయాలు కలసి ప్రయాణం చే సినప్పుదు అనేక అనుభవాలు నాతో పంచుకునేవారు .
మా ఇంటెల్ల పాదీ ఆయన అంటే అభిమానించేవారు పడేవారు.
ఆయన రాజకీయాలతో నిమిత్తం లేకుందా స్నేహం సాగించాను .
భవనం ముక్యమంత్రిగా వుందగా సుప్రసిద్ద హింది గాయకురాలు లత మంగెష్కర్ ఆయన ఇంటికి వచ్చింది .ఆమెను ఆహ్వనించదానికి నేను ఒక్కడినే వున్నాను. కనీసం ఫొటో తీసుకోదానికి కెమేరా లేదు! కూర్చొబెట్టి కబుర్లు చెబుతునంటే భవనం వచ్చారు . తన తంద్రి పేరిట స్తలం అడిగింది. నేటి ముఖ్య మంత్రులతే పోల్చితే ఇప్పుదు ఆశ్చర్యం వేస్తుంది .

సుప్రసిద్ద నాట్య దంపతులు రాధ-రాజారెడ్డి లను నాకు పరిచయం చేసారు.ఇప్పటికీ వారి డాన్స్ గొప్పగా వుంటుంది .
మా అమ్మాయి కొత్తగా సీత అనసూయ ల వద్ద జానపద గేయాలు నేర్చు కోగా అవి పాడమని , విని ఆనందించేవాడు .
రాజకీయాలథో నిమిత్తం లేకుండా స్నెహితులుగానే మేము వున్నాము.
విద్యామంత్రిగా వుండగా ఆయనతో కలసి వేములవాడ వెళ్ళాను. అక్కడ రాజ రాజెశ్వరి గుడి వద్ద చెన్నమనేని రాజెస్వరరావు స్వాగతం పలికితే నేను ఆశ్చర్య పోయాను .అప్పటికి ఆయన అసెంబ్లీలో కమూనిస్త్ నాయకుడు. గుడికి ఆయన ట్రస్తీ .తరువాత తెలుగు దేశం పార్తీలో చేరాడు.
మరో సారి ముఖ్య మంత్రిగా భవనం సైంటిస్త్ ల సభను ప్రారంభిచవలసి వున్నది. చాలా ఆందోళన పడ్డారు . నన్ను అడిగితే ఉపన్యాసం రాసి పెట్టాను .సాస్త్రియ పధతి గురించి నాకు సుపరిచిత విషయం గనుక రాసాను. అది బాగా చదివి చూడకుందా చెబితే సభానంతరం సైంటిస్తులు ఆయన్ను బాగా మెచుకొని రాజకీయ పదవులలో వున్న వ్యక్తి ఇలా సైన్స్ గురించి చెప్పగలగదం విశేషం అన్నారు. నాపరువు కాపాడావి అని భవనం అన్నారు.

7 comments:

Rajendra Devarapalli said...

ఇన్నయ్య గారు,భవనం మీ కాలేజీ క్లాస్ మేటా??ఆయన యన్.టి.ఆర్ బ్యాచ్ కదా??

Anil Dasari said...
This comment has been removed by the author.
Anil Dasari said...

టపా శీర్షిక '7 నెలల ముఖ్యమంత్రి భవనం' అనుంటే వైఎస్ ఈమధ్య కొత్తగా ఇల్లేమన్నా కట్టించుకున్నాడేమో, మీరు దాన్ని గురించి రాశారు కాబోలనుకుని వచ్చా :-)

durgeswara said...

bhavanam garu maataatagaariki sisyunilaamtivaaru.aayana tarachu maataatagaariniaadhyaatmika salahaladugutoo vumdevaaru.aayan mukhymamtri avutaarani chebite nammaleka ela jarugutumdani anumaanapadi taruvaata nijam kaavatam to tatagaari patla chaalaa gouravamto vumdevaaru.

Aditya said...

ఆయన చివరి స్టేజి లొ వున్నప్పుడు ఆయన వ్యక్తిగత సేవకుడికి ఏ ఏ మందులు ఎప్పుడెప్పుడు వెయ్యాలొ చెప్పడానికి అయన్ని చాలాసార్లు కలుసుకొనె అవకాశం వచ్చింది.వారి పిల్లలు నిర్వహిస్తున్న సంస్థల్లొ నేను ఒక చిరు వుద్యొగిని.కాని అయన ఎదుటి మనిషి మీద చూపిన సంస్కారం మరువలేనిది. మీ పొస్టు ద్వారా ఆయన్ని గుర్తు చేసినందుకు మీకు నా ధన్యవాదాలు.

Koduri

innaiah said...

BHAVANAM IS JUNIOR TO NTR IN COLLEGE. I AM NOT HIS CLASSMATE. I CAME INTO CONTACT ONLY 1978 WHEN HE WAS EDUCATION MINISTER IN CHENNAREDDI CABINET

Ananth Mallavarapu said...

ఇన్నయ్య గారు,

భవనం గారి గురించి మీ అనుభవాలు పంచుకున్నందుకు కౄతగ్నతలు.వారి బావమరిది శ్రీ ఎ.వి.కోటి రెడ్డి గారు మాకు ప్రిన్సిపాల్ గా వుండేవారు.నేను మీ చిన్ననాటి మిత్రుడు మల్లవరపు ఇన్నయ్య గారి అబ్బాయిని.

మేము డల్లస్ లో "నెల నెలా తెలుగు వెన్నెల" అనే కార్యక్రమాన్ని గత 16 నెలలు గా తెలుగు సాహిత్య వేదిక ద్వారా నిర్వహిస్తున్నాము.

మీరు అమెరికాలో వున్నప్పుడు , ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా రావలసిందిగా ప్రార్ధన.

ఇట్లు,
అనంత్ మల్లవరపు
817-800-6021