Monday, November 24, 2008
సైంటిస్ట్ రిచర్డ్ డాకిన్స్ ను కలుసుకోవటం
With Richard Dawkins ( in the middle) at New Enlightenment conference, Buffalo, USA 2005 oct
presenting telugu translation of God Delusion to Richard Dawkins
)first from left Dawkins) in Washington DC 2007 sep 29
ప్రపంచ ప్రసిద్ధ పరిణామ వాద సైంటిస్ట్ రిచర్డ్ డాకిన్స్ ను కలుసుకోవటం గొప్ప అనుభవం. 2005లో బఫెలో నగరంలో శాస్త్రియ పరిశీలనాకేంద్రంవారు 5 రోజుల మహాసభలు జరిపారు. అప్పుడే రిచర్డ్ డాకిన్స్ ను కలసి మాట్లాడాను. ఫోటో తీయించుకున్నాను. భారతదేశానికి రావలసిందిగా ఆహ్వానించాను. ఆయన ప్రసంగాలు అక్కడ ఆనందించాను. పరిణామాన్ని గురించి వివరించటం. సృష్టివాదాన్ని ఖండించటం చాలా శాస్త్రీయంగా చెప్పారు. అదే సమావేశాలలో తాను కొత్త పుస్తకం రాయబోతున్నటు ప్రకటించారు. నేను అప్పటికే ఆయన రచనలు కొన్ని పరిణామ సిద్ధాంతానికి సంబంధించినవి చదివాను. డాకిన్స్ చాలా ఆకర్షణీయంగా శక్తివంతంగా రాస్తాడు.
2006లో ఆయన వెల్లడించిన కొత్త రచన మార్కెట్ లోకి వచ్చింది. అది గాడ్ డెల్యూజన్. యూరోప్ లోనూ అమెరికాలోనూ అది అత్యుత్తమ సర్కులేషన్ లోకి వెళ్ళింది. మేము ఆ గ్రంథం చదివి వెంటనే తెలుగులోకి అనువదించాను. ఈ లోగా రిచర్డ్ డాకిన్స్ కు ఉత్తరం రాసి నా అనువాదాన్ని అనుమతిస్తూ ప్రచురించటానికి వీలు కలిపించమని కోరాను. ఆయన ఉదారంగా సమాధానం ఇస్తూ, తనకు అంగీకారమేనని తన లిటరరీ ఏజెంట్ మాక్స్ బ్రాక్ మన్ ను న్యూయార్క్ లో అడగమని చెప్పారు. వారితో ఉత్తర ప్రత్యత్తరాలు జరిపి తెలుగు, తమిళం, హిందీ అనువాదాలకు అనుమతి తీసుకున్నాను. శాస్త్రీయ పరిశీలనా కేంద్ర పక్షాన వాటిని ప్రచురించ దలచాము. నేను చేసిన తెలుగు అనువాదాన్ని విజయవాడలోని అలక్ నందా ప్రచురణల వారు వెలువరించారు. ఆ ప్రతిని 2007 సెప్టెంబరు 28న వాషింగ్ టన్ లో జరిగిన అమెరికన్ ఎథి యిస్ట్ అలయన్స్ మహాసభలలో వెదికపై సమర్పించారు. నాతో పాటు నా మనుమడు రోహిత్ కూడా ఉన్నాడు. సభలో ఉండి నా కుమార్తె డా. నవీన ఫోటోలు తీసింది. ఇదంతా మార్గరెట్ డౌని (నాస్తిక సంఘ అధ్యక్షురాలు) ఏర్పాటు చేసింది. హిందీ అనువాదం ఎప్పుడు వస్తుంది అని డాకిన్స్ ఆత్రుతగా అడిగారు.
భారతదేశం రావాలని, హైదరాబాద్ లో సైంటిస్టుల సభలో మాట్లాడమని, రానుపోనూ విమాన ఖర్చులు భరించే సంఘాలున్నాయని డాకిన్స్ ను కోరాను. కానీ ఆయన ప్రయాణం చేయలేనని, రీసెర్చ్ పై దృష్టి సారించదల చానని చెప్పారు. నిరుత్సాహ పడ్డాను. అయితే డాకిన్స్ వెబ్ సైట్ నిరంతరం పరిశీలిస్తున్నాను. అందులో నేను రాసిన వ్యాసాన్ని కూడా పెట్టారు. ఫ్రీ ఇన్ క్వయిరీ పత్రికలో పిల్లల పట్ల మతాలు చేస్తున్న ద్రోహాన్ని గురించి, వారిని కాపాడాల్సిన అవసరాన్ని గురించి రాశాను. అది డాకిన్స్ వెబ్ సైట్లో ఉంచటం నాకు గర్వకారణం. 2008లో ఆయన పుస్తకం మళయాళ భాషలో అనువదించటానికి అనుమతి కోరాను. అందుకు కూడా ఆయన అంగీకరించారు. సుప్రసిద్ధ హేతువాది సనాల్ ఎడమరుకు దీనిని అనువదిస్తామన్నారు. ఆయన ఢిల్లీలో ఉంటూ హేతువాద ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఆ విధంగా గాడ్ డెల్యూజన్ భారతీయ భాషలలోకి తీసుకురాగలిగాము.
WITHOUT FAIL PLEASE SEE THE WEBSITE: http://richarddawkins.net
You will enjoy.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఆ ప్రతిని 1907 సెప్టెంబరు 28న వాషింగ్ టన్ లో జరిగిన అమెరికన్ ఎథి యిస్ట్ అలయన్స్ మహాసభలలో వెదికపై సమర్పించారు.
innaya gaaru adi 1907 ani raasaaru. adi 2007 anukunta. number correct cheyamani korutunna.
Thanks for the point. I will correct.
Post a Comment