
founder of the center for inquiry ( now 82 years)

అంతర్జాతీయ శాస్త్రీయ పరిశీలనాకేంద్రం
1992లో మొదటసారిగా బఫెలో నగరం శివార్లలో ఉన్న అంరెస్ట్ ప్రాంతానికి వెళ్లాను. అక్కడ అమెరికా హూమనిస్టు కేంద్రంలో ఒకపూట గడిపి ప్రెడ్ ఎడ్వర్డ్స్ తో చర్చలు చేశాను. ఆయన కేంద్రం చేస్తున్న పనులు వివరించి వారి ప్రచురణలు కొన్ని బహూకరించారు. అక్కడకి సమీపంలోనే శాస్త్రీయ పరిశీలనాకేంద్రం ఉన్నది.
పాల్ కజ్ అమెరికాలో సుప్రసిద్ధ మానవవాధి, సెక్యులరిస్టు. అమెరికా హూమనిస్టు సంఘ అధ్యక్షులుగా, అంతర్జాతీయ హూమనిస్టు సంఘ ఉపాద్యక్షులుగా, బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక శాస్త్రీయ రచనలు చేశారు. ఖగోళ శాస్త్ర సంఘం వారు ఆయన సేవలను గుర్తించి, ఒక Asteroidకు ఆయన పేరు పెట్టారు. ప్రమీతియస్ ప్రచురణలు పెట్టి అనేక హేతుబద్ధమైన శాస్త్రీయమైన రచనలు ప్రచురిస్తున్నారు. అమెరికాలో రెడియో, టెలివిజన్ కార్యక్రమాలద్వారా, సెక్యులర్, మానవవాద ఉద్యమాన్ని బహుళవ్యాప్తి చెందించారు. ఆయన ఆహ్వానంపై కొత్తగా నెలకొల్పిన శాస్త్రీయ పరిశీలనాకేంద్రానికి వెళ్ళాను. చాలా విషయాలు చర్చించాము. చేపట్టదలచిన కార్యక్రమాలు ఆలోచించాము. అనేక మంది నిష్నాతులైన మేధావులను నాకు పరిచయం చేశారు. 1992 నుండి ఇప్పటివరకు ప్రతిసంవత్సరం ఆ సెంటర్ కు వెళ్ళి వస్తున్నాను. దీనివలన సంతరించుకున్న అనుభవం నాకు అనేక కొత్తమార్గాలను రీతులను, చూపింది. పాల్ కజ్ నా పట్ల ప్రత్యేక ప్రేమాభిమానాలతో ఉన్నారు.
ఆయన ప్రోత్సాహంతో భారతదేశంలో శాస్త్రీయ పరిశీలనాకేంద్రం స్థాపించి, కొన్నేళ్ళుగా పనిచేసున్నాను. అంతర్జాతీయ కేంద్రంలో పనిచేస్తున్న నా సన్నిహిత మిత్రులు : టిం. మాడిగన్ (ప్రస్తుతం – రాచస్టర్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు; కోప్సెల్ (ప్రస్తుతం వేరే యూనివర్శిటీలో పనిచేస్తున్నారు).
టామ్ ఫ్లిన్ – ఎడిటర్, ఫ్రీ ఇన్ క్వయిరీ. ఇతను న్యూ ఎన్ సైక్లోపీడియా అన్ బిలీఫ్ కు ఎడిటర్. ఆ గ్రంధంలో భారతదేశాన్ని పిలిచి నా చేత ఆరు వ్యాసాలు రాయించారు.
డి.జె. గ్రోతే : (ప్రస్తుతం సెయింట్ లూయీస్ లో పనిచేస్తున్నారు.
జో నికిల్ : ఇతను మజీషియన్. హేతుబద్దంగా శాస్త్రీయంగా వివరించి మోసాలు చేసే బాబాలను, క్రైస్తవ ప్రచారకులను, బట్టబయలు చేస్తుంటారు.
మాట్ షేరీ : ప్రస్తుతం న్యూయార్క్ లో మానవ వాద సంఘ వెబ్ సైట్ నడుపుతున్నారు.
నా పుస్తకాలు ఎమ్.ఎన్. రాయ్ పిలాసఫీ, చిన్న పిల్లల పట్ల మతాల దుర్వినియోగం గురించి ప్రమితియస్ వారు ప్రచురించేటట్లు పాల్ కజ్ తోడ్పడ్డారు. ఆ విధంగా ఈ కేంద్రం శాస్త్రీయ పరిశీలనకు అన్నివిధాలా సహకరిస్తున్నది.
please visit to see details including Indian chapters:
http://www.centerforinquiry.net/
1 comment:
nice information. thanks
Post a Comment