Thursday, November 13, 2008

సన్యాసి సత్యం పలికితే!


speaking at Ambedkar open university






అగేహానంద భారతి

1988లో ఎమ్.ఎన్.రాయ్ శతజయంతి ఉత్సవాలను ఇండియాలో జరిపాం. నా ఆహ్వానంపై అగేహానంద భారతి హైదరాబాద్ వచ్చి, పాల్గొని ఉపన్యాసాలు ఇచ్చారు. అందులో ఒకటి ఉస్మానియా యూనివర్శిటీలోనూ, మరొకటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలోనూ ఇచ్చారు. అది వీడియో రికార్టు కూడా చేశాము. హైదరాబాద్ లో ఉండగా ఆయనతో చాలా ఉల్లాసంఘా చర్చలు జరిపాము. ఆయన పరిణమించిన తీరు, ఆసక్తి దాయకమైనది. ఆ విషయాలను Ochre Robe అనే పుస్తకంలో రాశారు. దానిని నేను తెలుగులోకి అనువదించాను. ఆయన గ్రంథాలలో ప్రమాణమైనది ఇంగ్లీషులో Great Tradition & Little Traditions in India అనే పుస్తకాన్ని చౌకంబా ప్రచురణ కర్తలు వెలువరించారు. అదికూడా నేను అనువదించగా, తెలుగు అకాడమీ వారు ప్రచురించారు. అమెరికా వచ్చినప్పుడు కలుసుకుందామని అనుకున్నాం. 1992లో వెళ్ళి కలసుకుందామని ఊవ్విళ్ళూరాను. అయితే అంతకు ముందే ఆయన సిరక్యూస్ యూనివర్శిటీలో పనిచేస్తూ చనిపోయారు. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఆ యూనివర్శిటీకి వెళ్ళాను. న్యూయార్క్ స్టేట్ లో అదొక ప్రాచీనమైన చరిత్రగల యూనివర్శిటీ. అగేహానంద భారతి అక్కడ సాంస్కతిక ఆంత్రోపాలజీ శాఖలో పనిచేశారు. ఆయన రచనలన్నీ వారు భద్రపరచి రికార్టు చేశారు. అక్కడకు వెళ్ళి అది గమనించాను. ఆయనతో గడిపినవారు తమ మధుర స్మృతులను చెప్పారు. అగేహానంద ఒక విచిత్రమైన వ్యక్తి. సన్యాసిగా మారి జర్మనీనుండి భారతదేశం వెళ్ళి ఉత్తరోత్తర భౌద్దం భోదించి అమెరికా చేరుకుని నిశిత పరిశీలకుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఆయనతో చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు.
see full text of Ochre Robe at:http://www.centerforinquiry.net/uploads/attachments/Final%20Sanyasi%20Satyempalikete.doc
సన్యాసి సత్యం పలికితే!















సన్యాసి సత్యం పలికితే!
ochre robe

ఇంగ్లీషు మూలం :

స్వామి అగేహానంద భారతి



















తెలుగు సేత :

నరిశెట్టి ఇన్నయ్య

జర్మనీ నుండి ఇండియా వచ్చి సన్యాసిగా వివిధ జీవితానుభవాలు పొందిన విశిష్ట బ్రహ్మచారి లెపాల్క్ ఫిషర్. పేరు మార్చి వూరుమార్చి ప్రపంచమే తన యిల్లుగా చివరకు అమెరికాలో అస్తమించాడు. ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం వుంది. కేవలం ఉత్తర ప్రత్తుత్తరాలతో పరిమితం గాక, పిలిపించి ప్రసంగాలు చేయించాను. అవన్నీ రికార్డు చేసి భద్రపరిచాము. అగేహానంద భారతిని కలసిన వారు ఆయన్ను మరువలేరు.

ఆయన రచన దిగ్రేట్ ట్రెడిషన్ లిటిల్ ట్రెడిషన్స్ నేను తెలుగులో అనువదించగా తెలుగు అకాడమీ ప్రచురించింది. ఇండియాను దికైజాన్స్ ప్రచురణలు వారు ఆయన మోనో గ్రాఫ్లలను వెలువరించారు.

ఎం.ఎన్. రాయ్ తో ఒక్కసారి డెహ్రడూన్ లో కలసిన భారతి పూర్తిగా మారి పోయినట్లు పేర్కొన్నాడు. మానవ వాదిగా రూపొంది కల్చరల్ యాంత్రొపాలజూ బోధిస్తూ సిరక్యుస్ యూనివర్శిటీలో స్థిరపడ్డాడు.

1987లో భారతిని హైదరాబాద్ కు పిలిపించి, ఉస్మానియా ఓపెన్ యూనివర్శిటీలో ఎం.ఎన్. రాయ్ శతజయంతి సంస్మరణ ఉపన్యాసాలు యిప్పించాను.

ప్రస్తుతం తెనిగించిన ఆకర్ రోబ్ అనే రచన 1967లో వెలువడినప్పుడు భారత ప్రభుత్వం నిషేధించింది. రామకృష్ణ, వివేకానందల గురించి నిజం చెప్పినందుకు, ఆ ఆశ్రమ వత్తిడి కారణంగా అలా చేశారని తెలిసింది. కుష్వంత్ సింగ్ వంటి వారు నిషేదానికి నిరసన తెలిపారు. అయితే భారతి అమెరికా నుండి మరో అధ్యాయం చేర్చి, ఆ కర్ రోబ్ వెలువరించారు. దాని అనువాదమే యిది.

నిశిత పరిశీలకులకు యిది నచ్చుతుంది. వెర్రి ఆవేశంలో గుడ్డి ఆరాధన చేసేవారికి యిది కనువిప్పు చేస్తుంది. అందుకే దీని అవసరం వుందని, అందిస్తున్నాం.

(1991లో భారతి చనిపోయారు)

- ఎన్. ఇన్నయ్య

No comments: