Saturday, November 1, 2008

గార్డన్ స్టయిన్ Paranormal Encyclopedia editor












1978 లో గార్టన్ స్టయిన్ అమెరికా నుండి నాకు లేఖ రాస్తూ, ENCYCLOPEDIA of Paranormal అనే సంకలన గ్రంధాన్నికి భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాసం రాయమన్నారు. నా పేరును నా సన్నిహిత వృద్యమ మిత్రులు ప్రొఫెసర్ ఎ.బి. షా ఆయనకు చెప్పారు. అమెరికా భాషా ప్రమాణాలు దృష్టిలో పెట్టుకుని వ్యాసం రాయమని కోరారు. ఆ ప్రకారమే రాశాను. అది ప్రచురించారు.

ఆ తరువాత 1992లో అమెరికా వెళ్ళినప్పుడు గార్డన్ స్టయిన్ ను శాస్త్రీయ పరిశీలనా కేంద్రంలో కలిశాను. చాలా చర్చలు జరిపాము. తరువాత మేరిలాండ్ లోని కోలంబియాలో ఒక సేమినార్ లో మళ్ళీ కలసి సంభాషించుకోగలిగాము. ఫోటో కూడా తీయించుకున్నాము.

తరువాత రాచెస్టర్ లో ఇంగర్ సాల్ మ్యూజియమ్ ప్రారంభోత్సవ సందర్భంగా నేను, మిత్రులు ఆరమళ్ళ పూర్ణచంద్ర పాల్గొని, గార్డన్ స్టయిన్ ని కలిశాము. అప్పట్లో ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఇంగర్ సాల్ కు సంబంధించిన వ్యాసాలు, రచనలు, పాత పుస్తకాలు, అనువాదాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. భారతదేశంలో ఇంగర్ సాల్ ప్రభావం గురించి నేను ఆ సభలో చెప్పాను. సేయింట్ లూయిస్ నుండి వెలువడే అమెరికన్ రేషన్ లిస్ట్ పత్రికను కొన్నాళ్ళు గార్టన్ స్టయిన్ ఎడిట్ చేశారు.

కానీ తన పదకాలు పూర్తి కాకముందే గార్డన్ స్టయిన్ కాన్సర్ తో చనిపోయారు. మంచి మేధావిని, ఉద్యమకారుణి ఆ విధంగా కోల్పోయినట్లు భావించారు.

No comments: