Wednesday, July 8, 2009

జోరుగా రుద్రాక్షల దొంగ వ్యాపారం


రుద్రాక్షలు
ధరిస్తే ఆరోగ్యం, సంపద సమకూడుతుందని ప్రచారం చేసి లైసెన్స్ లేని పన్నులు లే ని అబద్దపు వ్యాపారం చేస్తున్నారు.కులరీత్యా ఎవరు ఏ రంగు రుద్రాక్ష ధరించాలో చెబుతున్నారు .ఇదంతా డ్రగ్స్ అండ్ మాజికల్ రెమిడీస్ చట్టం క్రింద శిక్షకు అర్హం . రుద్రాక్షలు చెట్టు కాయలు.హిమాలయ ప్రాంతాలలో, నేపాల్ లో ,ఇండొనీషియా ,హవాయి, జావా, ఆస్త్రేలియ లలో వుంటుంది. నీలి రంగులో ప్రారంభమై ,ఎండుతున్నప్పుడు గొధుమ,ఎరుపు ,నలుపు గా మారుతుంది .పండుతూ ఎండుతూ పోతుంటే చారలు ఏర్పడి ,ముడుచుకపోతూ ముఖాలు ఆకారాలు వస్తాయి .దీనికి పురాణ గాధలు అల్లి, నమ్మే జనంపై మత వ్యాపారం చేస్తున్నారు .21 ముఖ ఆకారాలకు కధలు అల్లారు. జ్యొతిష్యాన్ని ,వాస్తును జోడించారు .టో కుగా ,చిల్లరగా ప్రచారం చేస్తున్న అసత్యాలు అన్నీ శిక్ష కు గురి చేయాలి .ఫ్రభుత్వము నిద్రాణంలో వున్నది .



9 comments:

oremuna said...

ప్రభుత్వం ఎన్ని పనులని చేస్తుంది ?

oremuna said...

ఇంకా మాట్లాడితే ప్రభుత్వమే రుద్రాక్షల చెట్లు పెంచి అమ్మి సొమ్ము చేసుకోని ఆ డబ్బును ప్రజోపయోగ కార్యక్రమాలకు వాడాలి. తాగుడు సొమ్ము కంటే పాపపు సొమ్ము కాదు కదా.
ఆ మాటకొస్తే బంగారం మాత్రం ఎందుకు కొని వేసుకోవాలి?
చాణుక్యుడు అర్థ శాస్త్రంలో దేవుని బొమ్మలతో కూడా రాజు సంపాదించాలని చెప్పాడంట!
కాదేదీ కాసులకనర్హం.
మిధ్యా ప్రపంచంలో బతుకుతూ, మిధ్యా ఉద్యోగాలు చేస్తూ, మిధ్యా దేవుళ్లను ఆరాధిస్తూ, మిథ్యా సొమ్ము సంపాదిస్తూ, మిధ్యా జ్ఞానం చదువుతూ ....

విరించి said...

లోకజాగరణ కాక,ఇంకా మీ productive achivements ఏంటో?

Nadendla said...

రుద్రాక్షలేమి ఖర్మ, మన పాలకులు తాయెత్తులు వ్యాపారం చేసి కూడా సంపాదించవచ్చు.

Anonymous said...

మంచి నీళ్లు తాగి చనిపోతున్న సంఘటనలనే నివారించలేకపోతున్న మన ప్రభుత్వం, ఈ రుద్రాక్షల విషయంలో ఏమైనా చేస్తుందని మీరు అనుకుంటున్నారా?!

Unknown said...

స్వస్తత సభలు అని పెట్టి అన్ని రోగాలని నయం చేస్తాము అని పబ్లిక్ గా వాల్ పోస్టర్లు అంటించి, పాంప్లెట్లు పంచిపెట్టే వాళ్ళ గురించి మీరేమంటారు? అది జనాలని మోసం చేయడం కాదా? దేవుడు పరలోకం నుంచి మీకోసం త్వరలో వచ్చేస్తున్నాడని 2000 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న వరి గురించి మీరేమి మాట్లాడరెందుకు? ప్రతీ వాళ్ళకీ హిందూ మతాన్ని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయింది....

Unknown said...

Well said Chandra sekhar. There might be people who must be exploiting people like this. But andarinee oke gaadina katteyyakandi

Praveen Mandangi said...

>>>>>
మంచి నీళ్లు తాగి చనిపోతున్న సంఘటనలనే నివారించలేకపోతున్న మన ప్రభుత్వం, ఈ రుద్రాక్షల విషయంలో ఏమైనా చేస్తుందని మీరు అనుకుంటున్నారా?!
>>>>>

వోట్లు ప్రధానం అనుకునే వాళ్ళు వోటర్ల వ్యక్తిగత నమ్మకాలని చూసి చూడనట్టు వదిలేస్తారు. ఇలాగైనా ప్రభుత్వం పట్టించుకోదు. మన కళ్ళ ముందే జనాన్ని అమాయకుల్ని చేసి పంగనామాలు పెడుతుంటే జాలేస్తోంది.

Praveen Mandangi said...

నదులు లేని చోట
వంతెనలు కట్టేవాడు
రాజకీయ నాయకుడు అన్నాడు ఒక ప్రముఖుడు.

నెత్తిన శఠగోపం,
నుదుటి మీద పంగనామం,
చెవిలో పువ్వు,
ఇవి జనానికి పెట్టేవాడే రాజకీయ నాయకుడు.