Monday, June 11, 2007
కారల్ మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం
ఆలోచింప చేసే ఈ వ్యాసాలు, నార్ల వెంకటేశ్వర రావు గారు సంపాదకులుగా ఉన్న సమయంలో, ఆంధ్రజ్యోతి దినపత్రిక లో, సంపాదకీయం ఉండే పేజీ లో, 1970 ప్రాంతంలో ప్రచురించారు. ఉపసంపాదకుడు నండూరి రామమోహనరావు, ఈ వ్యాసాలపై స్పందించ వలసినదిగా, కమ్యూనిస్ట్ పార్టీ (మార్కిస్ట్) నాయకులైన, మాకినేని బసవపున్నయ్య గారిని కోరగా, కొత్తగా చెప్పటానికి ఏమి లేదు అని వ్యాఖ్యానించారు. రేపల్లె నుంచి శ్రీ రవిబాబు, సమాధానం పంపారు; కాని,దానిని పాఠకులు పట్టించుకోలేదు.
తరువాత, బందరు నుంచి, కొల్లూరి కోటేశ్వర రావు సంపాదకత్వంలో వెలువడే, తెలుగు విధ్యార్థి మాస పత్రికలో, ధారావాహికంగా ప్రచురించ బడ్డాయి. ఉయ్యూరు హిందీ అధ్యాపకులు, కె.రామారావు గారు, ఇవి చదివి, తానే సొంతంగా ప్రచురించి, పెక్కు మందికి, పుస్తక ప్రతులను , ఉచితంగా పంచారు. ఆ తరువాత, కొంత కాలానికి, చీరాల నుంచి అంచా బాపారావు సంపాదకత్వంలో వెలువడే న్యూ హూమనిస్ట్ మాస పత్రికలో, మరలా ప్రచురించ బడ్డాయి. ఈ వ్యాసాలు, కమ్యూనిస్టుల ఆలోచనా విధాన్ని భిన్నకోణంలో చూపాయి. కమ్యూనిస్ట్ లను సైతం, ఆశ్చర్య పడేలా, చేశాయీ వ్యాసాలు. అరుదైన ఈ వ్యాసాలు, మీ కోసం , త్వరలో.
-cbrao
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
రావు గారు, నా బ్లాగు పేరు మార్చాను. ఇప్పుడది "ఊహా ప్రపంచం"
http://harianth.in/blog
with link
రావు గారు, నా బ్లాగు పేరు మార్చాను. ఇప్పుడది "ఊహా ప్రపంచం"
Post a Comment