Thursday, October 30, 2008

ఇంగర్ సాల్ మ్యూజియం


Fred Edwords Humanist leader now in Washington DC








అమెరికా హ్యూమనిస్ట్ మహాసభ

1997 లో డెట్రాయిట్ నగరంలో జరిగిన అమెరికా మానవవాద సభలలో పాల్గొని ప్రసంగించాను. నాతో పాటు విజయవాడ నుండి నాస్తిక నాయకుడు లవణం, ఒరిస్సా నుండి పత్రి పాల్గొన్నారు. సుప్రసిద్ధ హ్యూమనిస్ట్ కవి ఫిలిప్ యాపిల్ బిను అక్కడే కలిశాను. సభలో ఆయన కవితలు చదివి వినిపించి ప్రత్యేకంగా ఆకర్షించారు. హ్యూమనిస్ట్ నాయకుడు ఫ్రెడ్ ఎడ్వర్డ్ ఆహ్వానంపై ఆ సభలలో పాల్గొన్నాను.

ఇంగర్ సాల్ మ్యూజియం


Ingersoll musuem at Dresden



న్యూయార్క్ రాష్ట్రంలో రోచెష్టర్ సమీపాన డ్రెస్డన్ వద్ద ఇంగర్ సాల్ మ్యూజియంను 1996లో తెరిచారు. ఆ ప్రారంభ సమావేశానికి, నేను మిత్రులు ఆరమళ్ళ పూర్ణచంద్ర వెళ్లి పాల్గొన్నాము. కార్యక్రమంలో భాగంగా స్టేట్, చర్చ్ వీధుల మధ్య నిలచి సింబాలిక్ గా ఫొటో తీయించుకున్నాము. ప్రభుత్వాన్ని, మతాన్ని వేరు చేయాలని, మతం వ్యక్తిగతంగా అట్టి పెట్టుకోవాలని, ఆ విధంగా సెక్యులర్ ధోరణిలో పరిపాలన జరగాలని సూచన ప్రాయంగా ఆ పని చేశాం. ఇందులో పాల్గొన్నవారు గార్డెన్ స్టెయిన్ (ఎన్ సక్లోపీడియా ఆఫ్ పేరా నార్మల్ ఎడిటర్) టామ్ ఫ్లిమ్ ( ఎడిటర్, ఫ్రీ ఇంక్వైరీ), టిమ్ మేడిగన్ మెదలైనవారున్నారు. భారత దేశంలు ఇంగర్ సాల్ రచనల ప్రభావం, వెలువడిన అనువాదాలు ఆ సభలో నిర్వహించారు.



Robert Ingersoll famous rationalist and orator

2 comments:

Rajendra Devarapalli said...

మీరు ఇంగర్ సాల్ రచనలేమన్నా అనువదించారా??తెలియజేయగలరు.

innaiah said...

No.I did not translate.