Sunday, January 11, 2009

ఫ్రొఫెసర్ చింతామణి లక్ష్మన్న


Left Prof C Lakshmanna





ఫ్రొఫెసర్ లక్ష్మన్న



ఫ్రొఫెసర్ చింతామణి లక్ష్మన్న నాకు చిరకాల మిత్రులు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో సోషియాలజీ శాఖలో ఆయన ఉండగా నేను ఫిలాసఫీ శాఖలో ఉన్నాను. తరువాత మేమిరువురము కలసి వెనుకబడిన విద్యార్థుల స్థితిగతుల గురించి పరిశోధనా గ్రంథం వెలువరించాము. అనేక హేతువాద మానవవాద సభలలో కలసి పాల్గొన్నాము. లక్ష్మన్న అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందినవారు. సత్యసాయిబాబా తనకు ప్రాథమిక పాఠశాలలో సీనియర్ అని, అప్పట్లోనే బుద్ధిగా మ్యాజిక్ నేర్చుకుంటుండేవాడని చెప్పారు. ఆయన లక్నో వెళ్ళి ఎమ్.ఎ. చదువుతు మమతను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం. లక్ష్మన్న కొన్నాళ్ళు వ్యవసాయ విశ్వవిద్యాలయంకు చెందిన సోషియాలజీ విభాగంలో పనిచేశారు. తరువాత ఎన్.టీ. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు దేశం పార్టీకి సన్నిహితులయ్యారు. ఆలూరి భుజంగరావు స్నేహం వల్లన దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలసి పార్ఠీలో పనిచేసి రాజ్య సభ సభ్యుడయ్యాడు. చంద్రబాబు నాయుడుకు బాగా దగ్గరవాడయ్యాడు.

ట్రినిడాడ్, టోబాగో లకు భారత రాయభారిగా 5 ఎళ్ళ పాటు పనిచేశాడు. అప్పుడే ఆయన అమెరికా రాగా, అక్కడ మళ్ళీ కలసుకున్నాము. ఆయన పనిచేసిన తిరుపతి విశ్వవిద్యాలయంకి చెందిన తిరుపతి రెడ్డి న్యూయార్క్ లో కలిశారు. మేమంతా పాతకాలపు అనుభవాలు చెప్పుకున్నాం. లక్ష్మన్న మంచి మిత్రుడు. హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. కొన్నాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిథిగా ఢిల్లీలో పనిచేశాడు. ఆయన ఏ స్థాయిలో ఉన్నా మేమిరువురము మిత్రులముగా కొనసాగాము. ప్రస్తుతం రిటైర్ అయి హైదరాబాద్ లో ఉంటున్నారు.

No comments: