Saturday, January 31, 2009

డి.వి. నరసరాజుతో

left Gorantla Veeraiah,Innaiah,D.V.Narasaraju, Producer Rajendraprasad



నరసరాజు కొద్ది రోజుల్లో చనిపోతాడనగా హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఆయన ఇంటికి వెళ్ళి చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాం. నరసరాజు గారు రాతలోనే కాక మాటలోనూ హాస్య ప్రియుడు. అటు సినిమాల్లోనూ, ఇటు నాటకాల్లోనూ ఎన్నో విశేషాలు, నేపధ్య రంగంలో జరిగిన వింతలు చెప్పి నవ్వించారు. నాతో పాటు సినిమా ప్రోడ్యూసర్ కోగంటి వీరయ్య చౌదరి ఉన్నారు. ఆయన ఒకప్పుడు ‘గడసరి అత్త-సోగసరి కోడలు’ సినిమా తీశారు. గుంటూరు జిల్లా పరుచూరులో చదువుకున్నారు. అప్పుడు కుల నిర్మూలన సంఘ నాయకుడు డి.జి. రామారావు ఆయనకు కొన్నాళ్ళు టీచర్ గా ఉన్నారు. తరువాత గుంటూరులో భట్టిప్రోలు హనుమంతరావు, ఎలవర్తి రోశయ్య వద్ద అనేక హేతువాద మానవవాద భావాలు సంతరించుకున్నారు. వీరయ్య చౌదరి, అనిశెట్టి రాసిన కులం లేని పిల్ల నాటకంలో పాత్ర వహించారు. ఆ డైలాగ్ లు ఇప్పటికి కంఠత చెపుతారు. ఎమ్.ఎన్. రాయ్, అంబేద్కర్ బావాల ప్రభావితుడు. మాతో పాటు వచ్చిన మరొక సినీ నిర్మాత రాజేంద్ర ప్రసాద్. ఆయన రామానాయుడుతో కలసి సినిమాలు తీశారు. ఆ రంగంలో విశేష అనుభవం కలవారు. నరసరాజు గారు ఆ నాడు పాత అనుభవాలను నెమరు వేస్తూ ఎన్నో ఆసక్తి కరమైన సంగతులు చెప్పారు.
నరసరాజు గారిని నేను, ఆలపాటి రవీంద్రనాథ్ ఎన్నోసార్లు ఉషాకిరణ్ (రామోజీరావు సినీ ఆఫీసు) లో కలిసేవాళ్ళం. మేం ముగ్గురం ఎమ్.ఎన్. రాయ్ ప్రభావితులం కావటం వల్ల అనేక పాత సంగతులు ముచ్చటించుకునే వాళ్ళం. రామోజీరావు ఎంత బలవంతం చేసినా చివరి రోజుల్లో నరసరాజు అక్షింతలు శీర్షిక ఈనాడులో మానేశారు. వృద్ధాప్యం వలన పాఠకులను బోరు కొట్టరాదని ఆయన నిర్ణయించుకుని అలాచేశారు. నరసరాజు గారిని సుప్రసిద్ధ హేతువాది వెంకటాద్రికి పరిచయం చేశాను.

No comments: