Wednesday, December 26, 2007

ఎలక్ ట్రాన్ -దేవుడు- Scientific method contd-

ఎలక్ట్రాన్-దేవుడు
ఎలక్ర్టాన్ దేవుడు అనే భావాలు మరొక ఉదాహరణగా స్వీకరించవచ్చు. ఇవి రెండూ సూటిగా చూడడానికి వీలులేదు. ఎలక్ట్రాన్ చలనాన్ని పరిశీలిస్తున్నామని విజ్ఞానవేత్తలు చెప్పారంటే ఆటలో బంతిని గమనించినట్లు ఇది గూడా చూశారని భావించరాదు. గ్యాస్ లో రేణువులు ఒకానొక మార్గంలో ఉన్నప్పుడు, ఎలక్ర్టాన్ నుంచి శక్తిని పొంది, విజ్ఞానం పేర్కొనే నియమాలననుసరించి కాంతి కిరణాలను ప్రసరిస్తాయి. విజ్ఞానవేత్తలు గమనించేది ఈ కాంతి మార్గాన్నే. ఆ మార్గాన ఎలక్ట్రాన్ పయనించినట్లు విజ్ఞాన వేత్త గ్రహిస్తాడు. మనం చూడని ఎడ్లబండి రోడ్డు మీద వెళ్ళిపోయిన తరవాత ఆ దారిన పడిన గుర్తులనుబట్టి ఎడ్లబండిగాక, ఇంకేవీ వెళ్ళలేదని తెలుసుకుంటాం. పైగా ఎంతదూరం అలా వెళ్ళింది గమనించవచ్చు కూడా. ఇదంతా మనం చూడని ఎడ్లబండి వెళ్ళిపోయిన తరవాత చెబుతున్న మాటలే. పైన చెప్పిన ఆవిరిలో ఎలక్ర్టాన్ మార్గం కూడా ఇలాంటిదే. ఎలక్ర్టాన్ పరిమాణం మనం సూటిగా చూడటానికి వీలులేనంత చిన్నది. కాని దాని చలనాన్ని అంచనా వేయవచ్చు. వెలిగిన మార్గానికి మరొక కారణం లేదనికూడా చూపవచ్చు. కనకనే ఆ మార్గాన ఎలక్ట్రాన్ పయనించినట్లు నిర్ధారణగా చెప్పవచ్చు. బంతి పోవడానికీ, ఎడ్లబండి వెళ్ళిపో వడానికీ, తేడా ఉంది. ఎలక్ర్టాన్ వెళ్ళిన తరవాత కాంతి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. గాలిలో రేణువులు ఎలక్ట్రాన్ వల్ల ప్రకంపించి నందువల్ల మనకు వెలుగురావడం లేదు. ఎలక్ర్టాన్ తన శక్తిని వాటికి ఇవ్వడం వల్లనే వెలుగువస్తుంది.
అయినప్పటికీ ఎలక్ట్రాన్ వైజ్ఞానిక భావన అంటున్నాం. మేధస్సుతో అవగాహన చేసుకునే భావన ఇది. ప్రాపంచిక విధానాలకు చెందేతీరు ఇందులో ఉంది. దీనికి కొంత ద్రవ్యరాశి, పరిమాణం చేర్చవచ్చు. దీని ప్రవర్తనకు సంబంధించిన నియమాలను రూపొందించవచ్చు. ఈ కార్యకారణ విధానంలో సాక్షి వంటి పరిశీలకుడు ఎవరూ అవసరం లేదు. ఎలక్ర్టాన్ ప్రాపంచిక అనుభవరీత్యా వాస్తవమైనది. ఎలక్ర్టాన్ ప్రవర్తనను పరిశీలించేవాడు ఎప్పుడు ఎక్కడ ఉన్నాడనే దానితో నిమిత్తం లేకుండా, అది స్వతంత్రంగా కాల ప్రదేశాలలో ఉన్నది.
దైవ భావన విషయంలో ఇదే సూత్రం అన్వయించదు. దేవుడు తప్పనిసరిగా ఉంటాడనుకొంటే, దేవునికి నియమాలను ఏర్పరచడం సాధ్యపడదు. పరిశీలకునితో నిమిత్తం లేకుండా, కాల-ప్రదేశాలలో ప్రాపంచిక అనుభవ విషయంగా చూసేటందుకు వీలులేని విషయమిది. దైవభావన విజ్ఞాన పూరితంకాదు. ప్రాపంచిక వాస్తవానికి చెందని విషయమిది. మానవుడు, ప్రకృతి గురించి విజ్ఞానం చెపుతున్న దాన్నిబట్టి చూస్తే దైవానికి అంటగట్టే లక్షణాలు అనవసరమనీ లేదా, అశాస్త్రీయమని అనిపిస్తున్నది. దైవం విషయంలో లాగే, ఆత్మ భావనలో కూడా ఇటువంటి వాదమే చెల్లుతుంది.

4 comments:

సూర్యుడు said...

I disagree with you ;)

I respect your analysis. I understand your point on electron theory. Think a little bit more on the theology and comment on it. Your post reminded me of one of my classmate during 8th or 9th standard. He used to argue that there is no God and used to challenge us to show one if he does exists. As you just mentioned about the visibility of electrons and we could not even show the God as well. Until the electron theory has come to light, who knows about that, it doesn't mean that it did not exist before its invention. Similarly, if we don't have any proof of existence of God, it doesn't mean its non-existence.

Recently, I read it somewhere which is known to everyone and not a secret:

A Hindu prays one of the Gods in which he believes and gets his desires fulfilled.

A Christian does the same by praying to his God(s)

A Muslim does the same

A Sikh does the same

A Buddhist does the same

All of the above believe they have their own God(s) who helped him/them.

Finally, Sri Sri Sri Sankaracharya says "Aham Brahmasmi". Is it ringing some bells ;)

BTW, recently, I bought a Vemana Satakam and here is an extract of one of the poem that I think relevant here:

తనువులోని యాత్మ తత్వ మెఱుంగక
వేరె కలడటంచు వెదుక డెపుడు
భానుడుండ దివ్వె పట్టుక వెదుకునా?
విశ్వదాభిరామ వినురవేమ

With regards,
sUryuDu

వింజమూరి విజయకుమార్ said...

ఒక మాటనుకుందాం ఇన్నయ్య గారూ. ఆలోచించండి. పదార్థం కన్పిస్తుంది. చైతన్యం కన్పించదు. అంత మాత్రం చేత చైతన్యం లేదంటే మనం ఒప్పకోం. అలాగే ప్రకృతిలో సూక్ష్మజీవులున్నాయి. అవి మనకు కనపడవు. నేను అవి అసలు లేవు అంటాను. దానికి మీరేమంటారు. Microscope దగ్గకరికి రా చూపిస్తానంటారు. నేను రానంటాను. ఇప్పుడు మీరు నాకు సూక్ష్మజీవిని చూపించలేరు. అలాగే నేను మొన్న యోగ సిధ్ధాంతం గురించి చెప్పినట్లు మీరు యోగమో, ధ్యానమో Meditation నో, ఏదో ఒకటి చేయకుండా మీకు దేవుడో మరో మనసుకందని విషయమో లేదనుకోవడం పొరపాటు. ఇక్కడ యోగం అనేది మైక్రోస్కోపు వంటిదనుకుందాం.మనం దాని చెంతకి చేరనంత కాలం నాకు సూక్ష్మజీవి కనిపించనట్టే మీకు భగవత్ స్పర్శ లభించదంటాను. ఇక దేవుడికి మనుషులు ఆపాదించిన లక్షణాలన్నీ మనుషుల లక్షణాలే. కొబ్బరికాయ కొట్టి కోట్లడిగే నైజం మనిషిది. అందుచేత దైవ లక్షణాలు దైవం గురించి తెలీని మనిషికి తెలీవు గనుక. అవన్నీ అసత్యాలు. ఈ మీ టపాలో ఈ ఒక్క ముక్క మాత్రం మీతో ఏకీభవించగలను.

innaiah said...

We are discussing scientific method.Let us note that.
Nature has many things which are not known to humans. Gradually, slowly and firmly certain discoveries, inventions helped to know things.
Nature has a big veil( Burkha !) and humans able to see through with help of Scientific method.
That is how we found infrared rays, radiowaves, xrays, alpha rays, beta rays, magnetic waves, bacteria, virus.
But the list not exhausted. Hence science never said that it has perfected everything. No. It has found certain things in nature, so far. There is vast field yet to be found.
Here is the difference between belief systems and science.
Science is humble, ready to accept failures, get ready for new trials and new inventions. That is where self correction enters.
Belief system asserts on the basis of authority of some person,some holy book and some revelation. Yet not willing to put to crucial test. That is how the concept of god came in different forms. Similarly other beliefs are established without questioning.
Most of the belief systems are made heriditary which comes to the children from parents, and society. God, caste, untouchbility and many other things are automatically taken for granted.
Slavery and hierarchy also are sanctioned by holy books. Inequality is firmly established through religious laws.
Human rights are trying to assert againt them, not with much success.
When beliefs are questioned, the reaction is terrible. The children are taught to believe without raising doubt. Madarasaas, sunday churches are doing that day in day out.
Hence the conflict between scientific method and belief systems is leading to tensions and fightings.
Science is universal and its method is helpful.
Science cuts across nations, regionalism, caste, religion and above all belief systems.
It makes humans human

వింజమూరి విజయకుమార్ said...

I am not going to tell about a BELIEF i.e., so-called god, enlightenment etc., What am I telling is I am seeing, seeking,observing, searching and I am living always in self examination. Who am I, What is this? I question all the natural things besides human values I have been in my 'self-examination' with my self I found some extraordinary power or some thing are there, which is not communicative from one person to another and not knowing by thought and itself. Let us put a name to the newly found power as GOD. Now, I want to know god. Then what can do. I have to go by empty mind to invent, to know (Is Invention & Knowing is correct words here?)the said GOD. But, I am not going to invent yet. I am always busy with my own thoughts and I will not kept my brain empty. Then I can not find GOD or some thing NEW. This is the Problem. All of this process is not comes under purview of the Science there is no necessity of science to the person who wants to know the GOD because Science & God are contradictions. Then the problem became complicated. The Science, which is calling by us as a Major Criteria for human being to know real knowledge of all things in Nature is a part of the GOD. THE GOD, WHO IS THE TOTALITY OF THE UNIVERSE CAN NOT BE SHOWN, CAN NOT BE FOUND BY THE PART OF IT'S. Now, we use science for only for worldly necessities not for Spiritual purpose.