Thursday, August 28, 2008

నా ప్రపంచం కు 10,000 పాఠకులు

symbol_of_usa

నా ప్రపంచం కు మీరు చూపుతున్న ఆదరణ దిన దిన ప్రవర్ధమానమవుతుంది. ప్రజలలో ఉన్న అంధ, మూఢ విశ్వాసాలు తొలగించటానికి, నా ప్రపంచం తన వంతు కృషి చేస్తున్నది. దీనికి వ్యాఖ్యల రూపంలో మీరిస్తున్న సహకారం ప్రోత్సాహకరంగా ఉంది. కొందరు వ్యక్తులు, అడపా దడపా, అనామకంగా, అనౌచిత భాషలో, ఉత్తరాలు రాసి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఉత్తరాలు సభ్యంగా రాయమని, అలాంటి వారికి వినతి.

మీ ఆదరణతో నా ప్రపంచం 10000 పాఠకుల సంఖ్య దాటినదని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. 10000 వ పాఠకుడి వివరాలివిగో.

Visit Detail Visit 10,000

Domain Name: gsu.edu? (Educational)

IP Address: 131.96.64. (Georgia State University)

ISP Georgia State University

Location Continent North America

Country United States (Facts)

State: Georgia

City Duluth

Lat/Long 34.0099, -84.158 (Map)

Time of Visit Aug 25 2008 10:15:35 pm

Referring URL http://koodali.org/

Visit Entry Page http://naprapamcham....08/blog-post_25.html

Visitor's Time Aug 25 2008 1:15:35 pm

Visit Number 10,000

ఈ పాఠకుడిని తన contact particulars తెలుపవలసినదిగా కోరుతాను. ఈ పాఠకుడు, ఈ సందేశం ఎదైనా కారణం వలన చూడలేకపోవచ్చు. అట్లాంటా (Georgia) పాఠకులకు విజ్ఞప్తి. మీ తెలుగు సంఘ సమావేశాల ద్వారా, మీకు ఈ సందర్శకుడు తెలిసిఉన్న పక్షంలో, వారి contact particulars మాకు తెలియ చేయ కోరుతాము. October 3 నుంచి 12 వ తేదీ దాకా నేను అట్లాంటా లో ఉంటాను. ఈ పాఠకుడిని ఆ రోజులలో కలుస్తాను. ఇన్నయ్య గారు కూడా అదే సమయంలో అమెరికాలో ఉంటారు. ఈ పాఠకుడి ఆచూకి దొరికినదానిని బట్టి, ఎలా చేస్తే బాగుంటుందో నిర్ణయిస్తాము. అదృష్ట పాఠకుడూ, మీ వివరాలు తెలుపగలరు.

అమెరికా కు నిత్యం ఎంతో మంది వెళ్లివస్తున్నారు. అమెరికా లో ఎంత కాలం ఉన్నా అది ఒక పట్టాన అర్థం కాదు. అతి పెద్ద భౌగోళిక స్వరూపం, విభిన్న ఆచారాలు, వాతావరణాలు, భాషలు, సంస్కృతి, అమెరికా అంటే ఏవిటో, అర్థం కాకపోవటానికి కారణాలవుతాయి. అమెరికాను మీకు దగ్గర చెయ్యటానికి, "మీకు తెలియని అమెరికా" అనే కొత్త శీర్షిక ఇన్నయ్య గారు ప్రారంభించబోతున్నారు. “అమెరికా కబుర్లు” నా నుంచి ఉండగలవు. అమెరికా లో ఉండే తెలుగు బ్లాగరులను, పాఠకులను, మీరు ఎక్కడున్నా (ఏ రాష్ట్రమైనా), కలవటానికి గట్టి ప్రయత్నం చేస్తాము. కెనడా, ఉత్తర అమెరికా, కాస్టా రికా దేశ వాసులు మాత్రమే సంప్రదించండి. కలుస్తాము. Jan 2009 చివరి దాకా నేను అమెరికా లో ఉంటాను. ఆసక్తి ఉన్నవారు, మీ వివరాలు పంపండి. అమెరికాలోని తెలుగు బ్లాగర్ల విషయాలు, విశేషాలు కూడా అమెరికా కబుర్లలో ఉండగలవు.

-cbrao

cbraoin at gmail.com

6 comments:

Anonymous said...

Congratulations to Naa Prapamcham team. It is one of the best blogs in Telugu. I came to know neutral views on many people like Lenin, Stalin and Sigmund Freud etc.,
After reading your articles I stopped purchasing books. In that way you saved lot of my money, time and effort ( You provided details about world's famous people in your blog. Previously I used to read minimum three books to get an idea about these famous people personality). Once again I thank you so much for your effort.

శరత్ చంద్ర said...

మీ బ్లాగు చాలా చాలా బావుందండి. ఇప్పటికి నా అభిమతానికి అనుగునంగా ఉండే ఒక బ్లాగు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా వుంది. మన రాష్ట్రం లో ఈ దొంగబాబా వ్యవహారం ఒక లాభసాటి వ్యాపారంగా మారిపొయింది. మీరు ఈ విషయాలనే కాకుండా మల్టీ లెవెల్ మోసాల గురించి కుడా మీ పాఠకులకి వివరించగలరని ఆసిస్తున్నాను.

వీలుంటే నా బ్లాగు చదివి మీ విలువైన అభిప్రాయాలు చెప్పగలరు.

శరత్ కాలమ్ said...

చక్కటి విషయం. అభినందనలు. నేనూ చిన్నప్పటి నుండీ హేతువాద ఆలోచనా ధోరణి తో పెరిగాను. ఇన్నయ్య గారి గురించి ఎప్పుడూ వింటూ వుంటాను. మీరు షికాగో కానీ దగ్గరి ప్రాంతానికి కానీ వస్తున్నట్లయితే తప్పకుండా కలవడానికి ప్రయత్నిస్తాను. మీరు మా ఇంటికి అతిధిగా రాగలిగితే ఇంకా సంతోషం.

Naga said...

నేను ఉండేది కూడా షికాగోకు దగ్గరే. ఇటువైపు వచ్చే విషయం నాక్కూడా తెలియజెయ్యండి. మీ ఫోన్ నెంబరును నాకు ఈ మెయిల్‌లో పంపించగలరు.

cbrao said...

@శరత్, నాగన్న: మీ ఆత్మీయ ఆహ్వానానికి ధన్యవాదాలు. October 12 నుంచు 22 దాకా కొలంబస్ (ఒహయో) లో ఉంటాను. ఆ సమయం లో చికాగో మిత్రులను కలుస్తాను. మీ చిరునామాలు, టెలిఫోన్ నంబర్లు నాకు e - mail చెయ్యగలరా? కెనడా నుంచి డెట్రాయిట్ వచ్చేదాక నాకు సెల్ఫోన్ ఉండదు. డెట్రాయిట్ వచ్చాక నా సెల్ నంబర్ మీకు e-mail చేస్తాను.

Jagadeesh Reddy said...

మంచి బ్లాగులు ఎప్పుడూ వర్ధిల్లుతూనే ఉండాలి... Best of Luck