Thursday, August 28, 2008
క్రీస్తుమహిమలు
సువార్త కూటములు జరుగుతాయనే ప్రచారం విపరీతంగా సాగింది. మారుమూల గ్రామాల నుండి క్రైస్తవులు సందేశం వినడానికి చేరుకున్నారు.
అమెరికా నుండి చాలా గొప్ప క్రైస్తవ ప్రచార బోధకుడు వచ్చాడట. ఆయన క్రీస్తు మహిమలు వివరిస్తాడట. అందువలన సువార్త కూటములకు ప్రత్యేకత సంతరిల్లింది.
ప్రార్థనలు చేసిన అనంతరం ఇంగ్లీషులో ఉపన్యాసం సాగింది. తెలుగులో అనువదించి ఒక పాస్టర్ చెబుతున్నాడు. బైబిల్ చేతుల్లో పట్టుకొని మోకాళ్ళపై కూర్చున్న భక్తులు శ్రద్ధతో ఆలకిస్తున్నారు.
ఏసుక్రీస్తు ఒక పెళ్ళి సందర్భంగా వచ్చిన వారందరికీ చాలినంత ద్రాక్ష సారాయి (వైన్)ని నీళ్ళద్వారా అందించాడట. నీరు కాస్తా ద్రాక్ష సారాయిగా మార్చడానికి ఆరు రాతి కూజాలను వాడారట. అలాగే మరో సందర్భంలో 5 రొట్టెముక్కల్ని వేలాది మందికి క్రీస్తు పంచి అద్భుతాన్ని చూపాడట. బైబిల్ ఆధారంగా యీ విషయాల్ని ఆయన వివరించాడు.
అమెరికా మాంత్రికుడు జేమ్స్ రాండి యీ విషయాలను లోగడ వివరించాడు. హేతువాది ప్రేమానంద్ సువార్త కూటాల వద్దకు రాగా, భక్తులు కొందరు ఆటంకపరచారు. బయట సభ పెట్టి క్రీస్తు మహిమల రహస్యాన్ని ఆయన వివరించాడు.
ఒక బాబాలో నీటిని ద్రాక్ష సారాయిగా మార్చవచ్చుగదా. అలాగాక, కేవలం రాతి కూజాలు అమర్చి వాటిలో నీళ్ళు పోయించి ద్రాక్షసారాయిగా ఎందుకు మార్చినట్లు? అదే రహస్యం. క్రీస్తుకు బావిలో నీటిని మార్చగల శక్తి లేదు. ఆయన తాను నేర్చిన మాంత్రికవిద్యతో ట్రిక్కు ప్రదర్శించి, ఆకర్షించాడు. ఎలాగ?
పెద్ద రాతి కూజాలలో చిన్న రాతి కూజాలు అమర్చాడు. చిన్న కూడా అంచు పెద్ద కూజా పైకి వుండేటట్లు ఏర్పరుస్తారు. చిన్న కూడా జనానికి కనిపించదు. పెద్ద కూజాలో ద్రాక్షసారాయి పోస్తారు. తరువాత చిన్న కూజా లోనపెట్టి, తలక్రిందులు చేస్తే చిన్న కూజా పెద్ద కూజాలో అతుక్కు పోతుంది. తరువాత చిన్నకూజాపై మూత పెట్టి పెద్ద కూజా మూత తీసి, అందులో ముందుగానే పోసిన ద్రాక్షరసాన్ని పంచుతారు. ఈ ట్రిక్కు తెలియక, భక్తులు అద్భుతంగా దాన్ని భావిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
జీసస్ ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసే వ్యక్తి అని నేననుకోను. బైబిల్‌లో క్రీస్తు చేశాడని చెప్పబడుతున్న మహిమలన్నీ ఆయనకి దైవత్వం ఆపాదించటానికి ఆయన అనంతరం శిష్యులు, అనుచరులు చేసిన పని అయ్యుండొచ్చు. దేవుడి పేరు చెబితేకానీ ఏ విషయాన్నీ నమ్మని నాటి (నేటి కూడా) పిచ్చి జనాన్ని నమ్మించటానికే ఈ మహిమల కధలు సృష్టించబడుండొచ్చు.
చచ్చింది గొర్రె...
మరి హిందూ మతంలో వున్న అపోహలన్నీ ఇలా ఆపాదించ బడినవి (సదరు మనుషుల చేత).. నమ్మరేందుకు సుమీ....
@చంద్రమౌళి
ఎందుకు నమ్మరు? ఏ మతమైనా అంతే కదా. మన్రాలకి మాత్రమే చింతకాయలు రాల్తాయని నమ్మే జనాలున్నంత కాలం ఎంత మంచి ఉద్దేశంతో మొదలైన మతమైనా ఇలా పక్కదారి పట్టటం ఖాయం.
మహాత్ములైన వారెవరైనా ఇటువంటి cheeep tricksతో, చిల్లర మహిమలతో ఆకట్టుకుంటారని అనిపించదు. ఇవన్నీ వారి భక్తులు ప్రచారం చేసినవే అయి ఉంటాయి. ఇప్పట్లో ఉన్న 'బాబా 'లు చిల్లర మహిమలు చేసేందుకే పుట్టామనుకుంటారు.
Post a Comment