Saturday, August 2, 2008

వింతలు కాని విశేషాలు


ఇది బ్రస్సెల్స్ గుర్తు.



యూరోపియన్ రాజధాని, బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ వెళ్లినప్పుడు గమనించిన కొన్ని సంగతులు.

బెల్జియమ్ లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. గుర్రం మాంసం రుచికరంగా ఉంటుందని రకరకాలుగా చేసుకుని తింటారు. మొసలి, నిప్పు కోడి (ఆస్ట్రిచ్) కూడా డెలికసీస్. శాఖాహారం మాత్రమే ఉండే హోటళ్లు అరుదు. ఇండియన్ రెస్టారెంట్లు ఎక్కడోగాని కనిపించవు. కాబేజీ సూప్ ప్రత్యేకం. చేపలు చాలా రకాలుగా చేసి తింటారు. బీరు ఎన్ని రకాలో చెప్పలేం. అలాగే వైన్. తాగే బాటిల్ నీరు ఖరీదు.
అవినీతిలో ఇటలీ అంత కాదు గానీ, కష్టపడితే ఆ స్థాయికి చేరుకోగలమనేది బెల్జియమ్ జోక్. నిరుద్యోగులకి ప్రభుత్వం డబ్బిస్తుంది. అది తీసుకొని వేరే చోట పని చేసి, డబ్బు తీసుకోవడం ఉంది. చెక్కు రూపేణా కాక, క్యాష్ గా స్వీకరిస్తారు.
పప్పెట్ షోలు కనిపిస్తాయి అక్కడక్కడా. కళాపోషణ ఎక్కువ. మధ్య కాలపు పద్ధతులు, ప్రకృతికి దగ్గరగా ఉండడం యిష్టపడతారు.
దిగంబర క్లబ్బులు యధేచ్ఛగా ఉన్నాయి. బీచ్ లలో ఇసుక విగ్రహాలు చేయడం ముచ్చటగా ఉంటుంది.
రాయల్ మ్యూజియం చూడదగ్గది. నగరంలో సీనియర్ సిటిజన్స్ కు 10 ఏళ్ళలోపు పిల్లలకు ప్రయాణం ఛార్జీలు లేవు. డైమండ్ కటింగ్ వ్యాపారం బాగా ఉంది. సైన్స్ పరిశోధనలో అగ్రగామి.
సగం డచ్ సగం ఫ్రెంచ్. నిరంతరం పోరాడుకుంటున్నారు.

ఇది బ్రస్సెల్స్ గుర్తు.

3 comments:

Anonymous said...

ive done something here to have you a few cents!

Rajendra Devarapalli said...

మరీ మూడుముక్కల్లో అవగొట్టారు!!ఎప్పటిదీ యాత్రావిశేషం??

innaiah said...

బ్రస్సెల్స్ లొ ఓ పెన్ యూనివర్సిటి వారి ఆహ్వానం పై వెళ్లినపుడు నగరంలొ కొన్ని విశేషాలు గమనించాను.ఒక నెల రోజులు వుండి పరిసీలన చేశాను.
My son Raju was there as editor of Wall Street Journal, Europe. That is why I could go round places.