Sunday, August 3, 2008

మంత్రతంత్రాలు, మహత్తులు

సంసార స్త్రీలు తమ ఇళ్ళలో యిబ్బందుల్ని బాబాలకు, మాతలకు, సోది చెప్పేవారికి విన్నవించుకుంటారు. స్త్రీల చేతనే అన్నీ ఏదో విధంగా రాబడతారు. పరిష్కారం చెప్పినట్టు నటిస్తారు. ఈలోగా దక్షిణలు, కానుకలు, ఎన్నో స్వాములకు చేరిపోతాయి, కొన్ని సందర్భాలలో స్త్రీలను భయకంపితుల్ని చేసి, వారి నుండి లబ్ధి పొందే స్వాములూ వున్నారు. స్త్రీలలో నమ్మకాలు క్రమంగా వారి సంతానానికి సంక్రమిస్తాయి. గుడికి పోవడం, మొక్కుబడులు, తాయెత్తులు, ఒకటేమిటి? అన్ని లక్షణాలు చిన్నప్పటినుండే వస్తాయి. అవి పెద్ద అయినా పోవు.
హేతువాది ప్రేమానంద్ కు బొంబాయిలో యిలాంటి ఘట్టం ఒకటి తటస్తపడింది. ఒక బాబాచే బాధితురాలైన స్త్రీని వియోచన చేయమని ఆమె కుమారుడే వచ్చి కోరాడు. బాబా చేసిన కొన్ని మంత్రతంత్రాలు, మహత్తులు ప్రేమానంద్ చేసి చూపగా, ఆమెకు మబ్బు విడిపోయి, యధాస్థితికి వచ్చింది.
మట్టితెచ్చి, పొట్టంలో చుట్టి నోటి దగ్గరగా తీసుకెళ్ళి ప్రేమానంద్, ఏవో మంత్రాలు చదివాడు. అలా మంత్రాలు చదువుతూనే మట్టి పొట్లాన్ని చేతివేళ్ళ మధ్యదాచి, అంతకు ముందా వేళ్ళ మధ్య దాచిన పసుపు పొట్లం అరచేతిలోకి తెచ్చాడు. చుట్టూ గుమిగూడినవారు మట్టికాస్తా పసుపుగా మారడం పట్ల ఆశ్చర్యపోతుండగా ప్రేమానంద్ తన జేబులో చేయి పెట్టి అంతకు ముందే పెట్టిన నిమ్మబద్దను చూపుడువేలితో రాశాడు. తరువాత చూపుడువేలును పసుపుతో రాస్తాడు. అది కాస్తా ఎర్ర కుంకుమ రంగులోకి మారుతుంది. మట్టి ముందుగా పసుపుగా మారి తరువాత కుంకుమగా ఎలా మారిందీ ప్రేమానంద్ వివరించేసరికి, భక్తులకు మాయ కాస్తా పొర తొలగినట్లు తొలగింది.

3 comments:

krishna rao jallipalli said...

చదువులేని స్త్రీలు నమ్మడం లో ఒక అర్థం ఉంది... కాని.. చదువుకొన్న వారు కూడా మోసపోవడం కించిత్ బాధ గానే ఉంటుంది మరి.

Naga said...

"..ఆమెకు మబ్బు విడిపోయి, యధాస్థితికి వచ్చింది" అన్నారు, తరువాత "భక్తులకు మాయ కాస్తా పొర తొలగినట్లు తొలగింది" అది చూసి ఆమె తిరిగి పూర్వ స్థితికి వెళ్ళిందా లేదా?

ఈ హేతువాదులు, కాగితపు పురుషులు తప్ప ఆధ్యాత్మికంగా గొప్ప వారు ఎవరైనా మీకు తటస్థపడటం సంభవించిందా?

SR said...

mee krushi prasamshaneeyam