Saturday, August 9, 2008

జ్వాలా ముఖి మహత్తు

ఉత్తరాదిలో గోరక్ నాథ్ దిబ్బ జ్వాలాముఖి గుడిలో వుంది. భక్తులు యీ గుడిని సందర్శించినప్పుడు బుడగలతో వుడికిపోతున్న నూనె కనిపిస్తుంది. భక్తులు ఆ దృశ్యం తిలకించి, కానుకలు సమర్పిస్తారు. అద్భుత దృశ్యంగా చూచి మహత్తుగా భావిస్తారు. భక్తుల తలలపై మండే నూనెను పురోహితుడు చల్లినప్పుడు, అది మంచువలె చల్లగా మారుతుంది. కొందరు శాస్త్రజ్ఞులు సైతం ఈ దృశ్యం చూచి, తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు.
జ్వాలాముఖి గుడి నూనె బావిలో బుడగలు వస్తున్నమాట వాస్తవం. పురోహితుడు ఒక కాగితాన్ని వెలిగించి, నూనెపై వుంచితే గాస్ తగులబడుతుంది. అలాంటి నూనె పురోహితుడు భక్తులపై చల్లితే మంచు నీరుగా ఎలా మారుతుంది? హేతువాది ప్రేమానంద్ ఈ గుడి సందర్శించి, జరుగుతున్నదంతా గమనించాడు. సహజవాయువు బయటకు వచ్చేచోట జ్వాలాముఖి గుడిని నిర్మించారు. ఒక గొట్టం ద్వారా వచ్చే గాస్ నిరంతరం వెలుగునిస్తుంటుంది. గాస్ బావి ప్రక్కగా ప్రవహించే నీటి బుడగల్ని చూచి, గాస్ ప్రవాహం వలన అవి ఏర్పడుతున్నాయని భక్తులు భావిస్తున్నారు, నీటి బుడగలు సహజవాయువుతో కలిసినప్పుడు తుకతుక వుడుకుతున్న నూనె వలె కన్పిస్తున్నది. నీటిలో గాస్ కలుస్తున్నందున, అది కలుషితమై క్రూడ్ ఆయిల్ వలె మడ్డిగా వుంటున్నది. అందులో చేయి పెడితే చల్లగా వుంటుంది. అదే పురోహితుడు చేసే మహత్తు.

9 comments:

రాదిక బుజ్జి said...

ఇన్నయ గారు,
నమస్కారం.
నేను మీ బ్లాగ్ అభిమానిని మీ ప్రతి పోస్ట్ ని ఎంతొ అసక్తి తొ చదువుతాను.
నాకు ఒక్క సందేహం తప్పక తిరుస్తారు అని నా నమ్మకం.
దేవుడు లేడు,మతం వ్యర్ధం అని అన్నారు.
మరి ఎవరు లేనప్పుడు ఈ సృష్టి ఎలా జరుగుతుంది.
అకాశం,భూమి,,వర్షం,ఎండ.సముద్రం,ఎలా వచ్చాయి.
ఈ విశ్వం దానంతట అదే నడుస్తూందా,
పాపం పుణ్యం స్వర్గం నరకం ఉన్నాయా.
అసలు దేవుడు గురించి ఏది నిజం?
దయచేసి వివరణ ఇవ్వగలరు

innaiah said...

దెవుడిని మానవులే చిరకాలం గా ఎక్కడి వారక్కడ వూ హించుకున్నారు. అందుకే ఇందరు దేవుళ్ళు వుండగా, ఇంకా కొత్త వారిని తయారు చేస్తూనే వున్నారు.
మనకు తెలియనిది దేవుడికి అంటగట్టి చే తులు దులుపు కుంటున్నారు.
సై న్సు క్రమే ణా తెలు సు కుంటూ పయనిస్తున్నది. ఈ అన్వేషణ అనంతం .
ఒకరు విశ్వాన్ని పుట్టించారంటే, వారిని ఎవరు పుట్టించారు అనే ప్రశ్న సహజం . కాని నమ్మకస్తులు ఆ ప్రశ్న వద్దంటారు.
అనంతం గా తెలుసు కోవడమే గాక , తనను తాను దిద్దు కుంటూ పొవడమే శాస్త్రం .అది నమ్మకంలో రాదు

రాదిక బుజ్జి said...

ఇన్నయ గారు,
"కాని నమ్మకస్తులు ఆ ప్రశ్న వద్దంటారు"
అంటె ఇంతవరకు దేవుడిని ఎవరు చుడలేదు,అలాగే ఎవరు దేవుడు లేరని చేప్పలేదు కదా.
ప్ర్తతి దానికి అది ఉన్నటే అంతము ఉంటుంది కదా.
ఉదా:- మనిషి పుడతాడు అలాగే మరణిస్తాడు.
మనిషి పుటుకను మరణాని శాసిస్తున్నది ఎవరు?
మనవుడా.
ఇన్నయ గారు
ఎ మతము దేవుడిని సరిగ్గా అర్ధం చేసుకొలేదు అని నా నమ్మకం.
కాని ఈ సృష్టి కి మూలం ఎదొ శక్తి నడిపిస్తుంది అని సైన్స్ చేబుతుంది.
అ శక్తి దేవుడు అని నా విశ్వసం.

innaiah said...

సైన్స్ ఎక్కడా శక్తి అన్నిటికి మూలం అని చెప్పలే దు. నమ్మకం అన్న తరువాత శాస్త్రీయత పోతుంది.
ప్రతి దానికి పుట్టుక అంతం వుంటే అది దేవుడికి వర్తించదా?
సైన్స్ ప్రకారం ఆది అంతం లేదు. తెలు సు కుంటూ పయనం సా గించడమే జరు గు తు న్నది .

రాదిక బుజ్జి said...

ఇన్నయ గారు,
తేలుసుకుంటు పోవడమే మనిషి జీవితం అన్నారు మరి అన్ని తేలుసుకున్న మనిషి ఉన్నాడా

దేవుడు లేడని మీరు ఎందుకు నమ్ముతున్నారు ,దేవుడికి ఏ శాస్త్రియా అధారము లెదు కాబటి మీరు చూడలేదు కాబటి.
మరి అకలి మనకు కనిపిస్తుందా, కనిపించని అకలి కి భొజనం చేయడం దేనికి.
అకలి కనిపించలేదు కాబట్టి అది కుడా లేదంటారా?....

మనిషి ఏది కనుగొన్న మంచి కంటే చేడే ఎక్కువ జరుగుతుంది అది సైన్స్ కాని మరి ఎదైన కాన్నివ్వండి.
పక్షి కి ఎగిరేగుణం, నీటికి పారే గుణం, మంచు కి కరిగే గుణం, మనిషి కి అలొచించే గుణం ఇచ్చింది ఎవరు?

మనిషి ఇంకా తేలుసుకుంటున్నాడు అంటే తెలుసున్నవాటిని సృష్టించింది ఎవరు?
ఇన్నయ గారు నమ్మకం ఉండకూడదు అంటున్నారు మరి ఆ నమ్మకమే లేక పోతే మనిషి ఇన్ని కనుగొనెవాడా?

తప్పు గా రాసి ఉంటే క్షమించగలరు

innaiah said...

మనిషి కనుగొన్నది ప్రశ్నతో, నమ్మకం తో కాదు.
జరుగుతున్నది పరిణామం. తనను తాను దిద్దుకుంటూ పయెదే సైన్స్.దాని పలితాలను మతం దుర్వినియోగం చేస్తున్నది.

రాదిక బుజ్జి said...

ప్రశ్న ఉంది అంటే జవాబు ఉంటుంది
జవాబు ఉంటుంది అనే నమ్మకంతొనే కదా ప్రశ్న మెదలవుతుంది.
మరి నమ్మకం లేదంటారు

రాదిక బుజ్జి said...

దేవుడు లేడని మిరు అంత ఖచ్చితంగా ఎలా నమ్ముతున్నారు

innaiah said...

దేవుడు లేడు అని సై న్స్ చెప్పలేదు.వున్నాడని నమ్మకస్తులు చెప్పి, గ్రంధాలు రాసి ,అదంతా దేవుదు వెల్లడించాడని అబద్దాలు ప్రచారము చేశారు.వారు చెబుతున్న
దేవుడు రుజువు కాలేదని, కనుక లేడని సైన్స్ ఖ చ్హితంగా చెబుతున్నది.
సైన్స్ రుజువులకు నిలబడుతుంది .
శాస్త్రీయ పద్ధతి వివరంగా ఎ బి షా రాసింది ఇదే బ్లాగ్ లో చదవండి.
ప్రతిపాదన చేసిన నమ్మకస్తులే రుజువు కూదా చేయాలి. లేకుంటే నమ్మకమే పెట్టుబడి !