Thursday, August 28, 2008

పక్షితీర్థంలో దైవం


visitors are fascinated with daily visit of bird punctually!








తమిళనాడులో చాలాకాలంగా యాత్రికులు సందర్శనం చేసే స్థలం ఒకటి వుంది. తిరుపుర కుండ్రం అనే ఈ స్థలం దగ్గర యాత్రికులు ఆగుతారు. మధ్యాహ్నం సరిగా 12 గంటలకు రెండు గద్దలు వచ్చివాలతాయి. అక్కడ పురోహితుడు యిచ్చే ప్రసాదం స్వీకరించడానికి పక్షిరూపంలో సాక్షాత్తు గరుడపక్షులు వస్తాయని కథ ప్రచారంలో వుంది. విష్ణు వాహనంగా గరుడపక్షి వుండడం పురాణకథనం కాగా, ఆ దేవాలయం విష్ణు దేవాలయం కావడం ఒక కారణంగా పేర్కొంటారు. ఏమైనా రెండు పక్షులు వేళ తప్పకుండా నిత్యమూ రావడం వాస్తవం.

ఏమిటీ విచిత్రం? హేతువాది ప్రేమానంద్ ను భక్తులు అడిగారు. హేతువాదులు కార్యకారణ అన్వేషణ సాగించారు. ప్రేమానంద్ నిశిత పరిశీలనలో తేలిన అంశం. రెండు గద్దలను పట్టుకొని వాటికి యిచ్చే ఆహారంలో నల్లమందు కలిపారు. అలా నల్లమందుకు (ఓపియం) అలవాటు పడిన రెండు పక్షులు రోజూ రావడం ఆరంభించి, అలవాటు చేసుకున్నాయి. అలవాటు అయిన తరువాత పక్షుల్ని వదిలేసినా తప్పనిసరిగా వస్తున్నాయి.

3 comments:

Kathi Mahesh Kumar said...

ఓహో అందుకేనా, "మతం మందికి నల్లమందు" (Religion is the Opium of the masses) అంటారు !!

Viswanadh. BK said...

చిన్న అనుమానం? అవే గ్రద్దలు ఇన్ని సంవత్సరాలుగా (అంతే పూర్వం నుండీ) వస్తున్నాయా లేక అవి చచ్చాక వేరు వేరు గ్రద్దలను తీసుకొస్తున్నారా నల్ల మందుకోసం

Anonymous said...

From last 10 years those two eagles are not coming to Tirukkeri kundram(110 kms from chennai).
Before those two are coming daily. This is used in one of old chiranjeevi movie.(i think (Gudachari No. 1)

-kranthi