Wednesday, August 6, 2008

బాణామతి, చేతబడి


బట్టలు తగులబడుతున్నాయ్!

మన గ్రామాలలో బాణామతి, చేతబడి, దయ్యాలు, భూతాలు, పిశాచాలు, హస్తలాఘవాలు ఇంకా ఎన్నో జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటి ఆధారంగా ప్రజలను ఏడిపించే మంత్రగాళ్ళు, భూతవైద్యులు, గ్రామవైద్యులు ఉండనేవున్నారు. అలాంటి వారికి విపరీతమైన గౌరవం యిస్తూ, వారంటే భయపడుతూ వుండడంతో, వారు యింకా వ్యాపారం చేస్తున్నారు.
ఉన్నట్లుండి యింట్లో బట్టలనుండి నిప్పు వస్తుంది. ఆరుబయట ఆరవేసిన వస్త్రాలు అంటుకొని నిప్పు రాజుతుంది. ఇంకేముంది? ఆ సంఘటన చుట్టూ కథలు అల్లుతారు. శాంతి చేయించమంటారు. కొన్నాళ్ళు యిల్లు పాడుబెట్టమంటారు. ఎవరో చేతబడి చేయించారంటారు. దోషం పోవడానికి ఏమేమి చెయ్యాలో చెబుతారు.

ఇంటి బయట బట్టలు ఆరేయండి. పచ్చ ఫాస్ఫరస్ ఒక పాలు, కార్బన్ డైసల్ఫైడు ఆరు పాళ్లు కలపండి. కొద్దిగా బట్టలపై చల్లండి అలా చల్లింది ఆరగానే కాసేపట్లో నిప్పు అంటుకొంటుంది. ఇంట్లో అలమరలో పెట్టిన దుస్తులలోనూ యీ ద్రావకం చల్లవచ్చు. యింటిలోని వారిని ఏడిపించడానికి ఇలాంటి పనులు రహస్యంగా చేస్తుంటారు. జాగ్రత్తగా కనిపెడితే ఎవరు చేస్తున్నదీ అర్థమవుతుంది.
సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, మూలకారణం పరిశీలించకుండా, మతపరమైన మూఢనమ్మకాల వలన భూతవైద్యుల్ని, సోది చెప్పేవారిని పిలుస్తుంటారు.

5 comments:

నాగన్న said...

మీరు ఫార్ములతో సహా ఇలా జనాల్ని 'ఏడ్యుకేట్' చెయ్యడం అనే పద్ధతి నాకు బాగా నచ్చింది. అలాగే బాబాలు బాంబులు ఎలా తయారు చేస్తారో చెప్పగలరు!

కత్తి మహేష్ కుమార్ said...

మంచి సమాచారం. హేతువాదాన్ని పెంపొందించే మీ ప్రయత్నం ఆభినందనీయం,ఆచరణీయంకూడా.
ఈ క్రింది లంకెను చూడగలరు.
http://parnashaala.blogspot.com/2008/08/blog-post_06.html

రాదిక బుజ్జి said...

చాలామంచి విశయాలను చేప్తున్నారు
ధన్యవాదాలు

Srinivas said...

>అలాగే బాబాలు బాంబులు ఎలా తయారు చేస్తారో చెప్పగలరు
మీరే ఎన్నుకోండి ఒక సమాధానం -
1. చాలా తేలికగా.
2. మధ్యలో ఒక సున్నా పెట్టి రెండో "బా" లో దీర్ఘం తీసి కొమ్ము పెట్టడం ద్వారా.
3. ఎవరికీ కనపడకుండా, పేలినా వినపడకుండా, దెబ్బలు పైకి తెలియకుండా

krishna rao jallipalli said...

BLOG READERS ని ఇటువంటి విషయాలలో EDUCATE చేస్తున్నందుకు ధన్యవాదాలు. చాలా మంచి ప్రయత్నం. కొంత మంది అంటున్నారు వరుణ యాగం చేయబట్టే ఈ మద్య వర్షాలు కురుస్తున్నాయని .. అదీనూ పద్దతి ప్రకారం గా చేస్తే.. నేనూ అంటున్నాను.. ఆ మద్య ఎవరో ఓకరు ఇక్కడ గుంటూరులో 'అగ్ని యాగం' చేయబట్టే (అదీనూ మే మాసం లో) ఆసియా లో కెల్లా పెద్ద డయిన MARKET YARD మాడి మసి అయిందని(కొంచం మోతాదు ఎక్కువ అయ్యింది లెండి). అలాగే మొన్న కేసముద్రం దగ్గిర ఇటువంటి యాగం చేయబట్టే 'గౌతమీ' కాలిందని. (మోతాదు కొంచం తగ్గింది అందుకనే కొన్ని భోగీలు మాత్రమె కాలాయి). ఇది నా VERSION. ఒప్పుకోవాలి మరి.