Tuesday, August 12, 2008

ఆధ్యాత్మిక వ్యాపారం

దేవుడి పేరిట జరుగుతున్న ఆధ్యాత్మిక వ్యాపారం నిరంతరం కొనసాగుతున్నది. జనాకర్షణలో యిదొక వింతగా వుంటున్నది. గ్రామాలలో తరచు సాధువులు, యోగులు, బాబాలు, మాతలు ఎక్కడ నుంచో వచ్చి చిన్న ప్రయోగాలు చేస్తారు. అది వింతగా చూచి, అద్భుతంగా భావించి కానుకలు సమర్పిస్తారు. గిట్టుబాటు కాగానే స్వామీజీ మరో గ్రామానికి తరలివెడతాడు. ఇదంతా దైవం పేరిట జరిగే పెట్టుబడిలేని వ్యాపారమే. అలాంటి సంపాదనకు పాల్పడేవాణ్ని-డబ్బు, ఆస్తి ఎలా వచ్చిందని అడిగేవారు లేరు. మతం యొక్క గొప్పతనం అలాంటిది.
ఇంద్రియాతీత శక్తులున్నాయనే యోగి బొటనవేలి గోటిలో సోడియం దాచి, ఒక వేడినీటి పాత్రపై చేయి తిప్పినట్లు చూపి, సోడియం అందులోకి జారవిడుస్తాడు. మంత్రాలు చదువుతుంటాడు. నీటి నుండి మంటలు రావడంతో అది ఒక దైవశక్తిగా జనం భ్రమిస్తారు.
మరొక యోగిపుంగవుడు తన దివ్యమహిమ చూపడానికి నోటి నిండా నీరు నింపి సిపి ఈధర్, పొటాషియం లోహముక్కగల నీటిపాత్రలో పూస్తాడు. పొటాషియం లోహపు ముక్క తగులుకొని ఈధర్ కు అంటుకోగా నీటిపై మంటలు కనిపిస్తాయి. స్వామీజీ నోటి నీటికి అంత శక్తి వున్నదన్నమాట.
ఇంకొక పవిత్ర స్వామీజీ వంటినిండా దైవం పేరు కనిపిస్తుంటుంది. ఆయన యజ్ఞం చేస్తుండగా, యిలా దైవం పేరు కనిపించడం వలన భక్తులు సాష్టాంగపడతారు. ఏదైనా పాలు కారే కొమ్మను విరిచి, దానితో దేహంపై యిష్టదైవం పేరు రాయాలి. దీని బదులు సబ్బువాడొచ్చు, అలా రాసిన తరువాత ఆరనివ్వాలి. యజ్ఞగుండం వద్ద వేడికి స్వామీజీకి చెమట వట్టినప్పుడు స్వామీజీపై భక్తులు విభూది చల్లుతారు. అప్పుడు లోగడ రాసిన దైవనామం కనిపిస్తుంది.
ఇంకా కొందరు యోగులు కుంచెను పొటాషియం ఫెర్రొసైనైడ్ ద్రావణంలో ముంచి చేతిమీద దైవనామం రాసి ఆరబెడతారు. ఐరన్ క్లోరైడ్ ద్రావకంలో దూదిగాని, వస్త్రం గాని ముంచి లోగడ దైవనామం రాసినచోట తుడిస్తే నీలం రంగులో ప్రత్యక్షమై, భక్తుల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి చిత్ర విచిత్రాలతో అమాయకులైన, అజ్ఞానులైన భక్తుల్ని మోసగించి, భ్రమింపజేసి, తాత్కాలికంగా లబ్ధిపొందవచ్చు.

4 comments:

చంద్ర శేఖర్ కాండ్రు said...

ఇన్నయ్య గారూ,

ఇన్ని టపాలు చదివిన తరువాత నేను కామెంటు చేయకుండా ఉండలేకపోతున్నాను.

మూఢనమ్మకాలను రూపుమాపటానికి మీరు చేసున్నకృషి అబినందనీయం. మీరిలానే మీకు తెలిసిన అన్నిటక్కుటమార విద్యలలోని మర్మాన్ని బయటపెడితే, అది ఎందరికో ఉపయోగపడుతుంది.

chandramouli said...

enni cheppuduru gaaka ... aa adyaatmika vyaapaaram Sruti miMchanaMtavaraku adi aamOdayogyamE ..... ippaTikE vigrahaaradhana valla phalitamlEdu anna pakkamata prabhodaalaku loMgipOtunna sagaTu janaaniki kaneesam puraaNa kaalakShEpam chEsE kEMdraalu kEvalam alaaMTi adyaatmika vyaaparaalayaalu maatramE .... maree ee verri ekkuvayipOyi bOTTu baabaalu cheTTukODu puTTakODu puTTukostuMTE kanIsam mIlanTivaari prabhOdaalu vaari nammakaani sarayina daarina peTTukovaDaaniki hEtuvulavutaayi ani aaSistoo ...

chandramouli said...

ఎన్ని చెప్పుదురు గాక ... ఆ అద్యాత్మిక వ్యాపారం శ్రుతి మించనంతవరకు అది ఆమోదయొగ్యమే ..... ఇప్పటికే విగ్రహారధన వల్ల ఫలితంలేదు అన్న పక్కమత ప్రభొదాలకు లొంగిపోతున్న సగటు జనానికి కనీసం పురాణ కాలక్షేపం చేసే కేంద్రాలు కేవలం అలాంటి అద్యాత్మిక వ్యాపరాలయాలు మాత్రమే .... మరీ ఈ వెర్రి ఎక్కువయిపోయి బోట్టు బాబాలు చెట్టుకోడు పుట్టకోడు పుట్టుకొస్తుంటే కనీసం మీలంటివారి ప్రభోదాలు వారి నమ్మకాని సరయిన దారిన పెట్టుకొవడానికి హేతువులవుతాయి అని ఆశిస్తూ ...

innaiah said...

hi