Wednesday, August 27, 2008

సంతాన ప్రాప్త -


dark inside of temple abused by priest



kaala bhairava temple sanctum sanctorium





గొడ్రాలు అంటే పాపిష్టి దానిగా చూచే సమాజం కనుక, పెళ్ళి అయిన ప్రతి స్త్రీ సంతానం కోరుకుంటుంది. ఎన్నాళ్ళకూ సంతానం కలుగకపోతే వైద్య పరీక్షలు చేయించుకొనే బదులు బాబాల దగ్గరకు పోతారు. మూఢనమ్మకాలకు ఇదొక పెద్ద నిదర్శనం బాబా చెప్పినట్లు చేస్తారు, లింగాలకు మొక్కుతారు.

కాలభైరవ రాయికి మొక్కితే పిల్లలు పుడతారని ఆంధ్రలో నమ్మకం వుంది. ఇలాంటివి ఇతర రాష్ట్రాల్లో వున్నాయి కూడా. చాలా మంది ఇది నిజం అని నమ్ముతారు. కొంత కాలంగా సంతానం లేని వారికి గర్భగుడిలో అర్థరాత్రి పూజలు చేస్తే పిల్లలు పుట్టినట్లు చెబుతారు.
ఒక పూజారి కాలభైరవ గుడిని అంటి పెట్టుకొని, సంతాన ప్రాప్తి కలిగిస్తున్నాడనే వార్త విని హేతువాది ప్రేమానంద్ వెళ్ళాడు. డబ్బు సమర్పించుకొని, తనకు సంతాన ప్రాప్తి కలిగించమని వేడుకున్నాడు. వెంట స్నేహితుడి భార్యను తీసుకెళ్ళాడు. వీరు చెప్పినదంతా విన్న అనంతరం పూజారి పంచలోహపాత్రలో బియ్యం పోసి, కత్తి మధ్యలో పెట్టి, మంత్ర పఠనం చేసి, పాత్రను కత్తితో పైకిలేపాడు. అంతకు ముందు ప్రాయశ్చిత్త క్రతువు చేశాడు. తరువాత గర్భగుడిలో ఆమెను లింగపూజ చేయమని అందరినీ వెళ్ళిపొమ్మన్నాడు. చీకట్లో ఏదో మెదులుతుండగా ఆమె ఒక పీటతో గట్టిగా మోదింది. పూజారి తల పగిలింది. లింగం కూడా పగిలింది. తలుపు కొట్టగా బయట వేచివున్న ఆమె భర్త, హేతువాది ప్రేమానంద్ తలుపు తెరిచాడు. లోగడ స్త్రీలకు సంతానప్రాప్తి ఎలా కలిగిందో దీని వలన అర్థమైంది.

మహారాష్ట్రలోని సతారాలో యిలాంటి బాబాను ఆంధశ్రద్ధ నిర్మూలన సమితి బట్టబయలు చేసింది.

9 comments:

Kathi Mahesh Kumar said...

పాయసం తాగితే, చెమట మింగితే పిల్లలు కలిగే మన పురాణ కథలముందు ఇదొక లెక్కా! మొత్తానికి సంతానం "ఇలాగే ప్రాప్తిస్తుందని" ఆ పూజారికీ తెలుసు అంతే.

సుజాత వేల్పూరి said...

మహేష్ గారు,
భలే నవ్వొచ్చింది మీ కామెంట్ చూసి! ఏమిటో ఏ పురాణాన్ని చదవాలన్నా, నమ్మాలన్నా ఇలాంటి ప్రశ్నలు తలలో లేచి ఇహ చదవబుద్ధి కాదు.

కొన్ని గుళ్లలో చెట్లకు ఉయ్యాలలు, ముడుపులు వేలాడదీస్తారు. ఏమి చేస్తాం? పిల్లలు లేని వారు పిల్లలు కలగాలనే ఆత్రుతలో, ఆర్తితో ఎవరేం చేయమంటే అది చేస్తారేమో!

Anonymous said...

బాబూ తుప్పు పట్టిన కత్తీ ఎందుకు నేనున్నానంటూ ఎందుకు అర్థం పర్థం లేకుండా రాస్తారు కామెంట్లు మన పురాణాలు ఏం చేశాయయ్యా నిన్ను :-)) హతవిధి నాకు పరసనల్ మేయిల్ తప్ప బ్లాగు మెయిల్ అంటూ లేదయ్యా, వస్తున్నా నుండూ త్వరలో ////

Anonymous said...

మహేష్, ఒంటె ఉచ్చ తాగితే జబ్బులు నయమవుతాయని మహమ్మదు ప్రవక్త చెప్పాడని ఆ మధ్య నాసిర్ చెప్పాడు. మీరు అది మర్చిపోయి, పురాణ కథలొక్కటే గుర్తుపెట్టుకున్నట్టున్నారు.

Unknown said...
This comment has been removed by the author.
Unknown said...

@మహేష్
కొన్ని నిజాలుంటాయి కొన్ని గుడ్డినమ్మాకాలుంటాయి,
తాయత్తుల సంగతేమిటీ ఏ మసీదు సెంటర్ దగ్గరకు వెళ్ళినా మా బెజవాడలో అయితే హిందూవుకూ మహద్దీయునకూ కూడా తేడా లేకుండా కట్టించుకుంటారు, ప్రజలేమి పిచ్చోళ్ళూ కాదూ, ఏదో ఫలితం ఉందనే కట్టీంచుకుంటూన్నారు. పాయసం సంగతి విన్నాను మరి చమట సంగతేమిటో ??? మీరు పురాణాలు నమ్మి ఉండకపోవచ్చు// నమ్మకపోవచ్చునూ.. అవన్నీ కధలే అనుకుందాం ఆ కధలల్లిన పద్దతికైనా మనం గౌరమివ్వాలని నా అభిప్రాయం.

Anonymous said...

మహేష్ నువ్వు పాపులారిటీ కోసం రాస్తున్నావో, మరెందుకో ఏమో కానీ ... చూస్తున్నాను పెద్దవాళ్ళందరినీ విసికిస్తున్నావు, VHP వాళ్ళకు చెప్పి నానా గోల చెయ్యిస్తా, ఇలా పిచ్చ పిచ్చ మాటలు రాస్తే... అంత నమ్మని వాడిని ఆ పేరేమిటి మహేష్ కుమార్ అని పూర్తిగా ఆ పురాణాల లోని ఆ భగవంతుడి పేరు,

నాకిప్పుడిప్ప్పుడే అర్థమవుతుంది నువ్వు కేవలం నీ బ్లాగుకు అందరినీ ఎట్రాక్ట్ చెయ్యటానికే ఇలా రాస్తున్నావని. ఈ పిచ్చి రాతలు బదులు నాలుగు బూతు నొమ్మలు పెట్టూకో అందరూ వస్తారు.

RG said...

మహేష్‍గారు, Logic ends where faith starts అన్న సామెత మీరు వినే ఉంటారు. మనం లాజిక్ లేదో అని మొత్తుకున్నా వీళ్ళేం వినరుగానీ, వదిలేయండి.

Kathi Mahesh Kumar said...

ఓ అనామకుడా!ప్రస్తుతానికి పేరుకూడా (లేని)చెప్పుకోలేని నీ ఆవేశాలకు బెదిరిపోయేవారు ఎవరూ లేరిక్కడ.పర్సనల్ మెయిల్ బ్లాగుమెయిల్ అంటూ ఏమీవుండవు. మీకు gmail అడ్రస్ వుంటే చాలు.

నాకు మహ్మదు ఏంచెప్పాడో తెలీదు. పురాణాలు బాగానే తెలుసు. మరివాటి ఉదాహరణలుకాక ఇంకేమిమ్మంటారు? ఒకవేళ మహ్మదు ఇలా చెప్పుంటే నావైఖరి వారిపట్లా ఇలాగేవుండేది. పెద్ద మార్పేమీవుండేది కాదు.

నువ్వు విసిగిపోతే బ్లాగులు చదవడం మానెయ్యి. నా బ్లాగువైపు అసలు రాకు.ఇలా వెర్రి కామెంట్లూ, VHP బెదిరింపులూ చెయ్యకు.

నా పేరు మా తల్లిదండ్రులు పెట్టింది. దాన్ని మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. మరో విషయం నేను ఏ మతానికీ వ్యతిరేకినికాను. కానీ ఎక్కడ మూఢత్వంవున్నా దానికి వ్యతిరేకిని.

@అశ్విన్: అస్ఖలిత బ్రహ్మచారైన ఆంజనేయుడి చెమట బిందువును సేవించి ఒక మత్స్యకన్య గర్భవతి అవుతుంది.అదొక పురాణకథ.

నేను వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచలేదే? వాటిని నిజమని నమ్మే ప్రజలపైన జాలిపడ్డానంతే.

@falling angle: మీతో అంగీకరిస్తున్నాను. ధన్యవాదాలు.