Friday, August 22, 2008

ధ్యానంతో మనశ్శాంతి

ఇటీవల ధ్యానం మనశ్యాంతినిస్తుందని భాగా ప్రచారం చేస్తున్నారు. అది ఒక అలవాటుగా సంపన్నులలో, కొంతవరకు మధ్యతరగతిలో వ్యాపించింది. దీనికి బాబాల బలం ఉన్నది. మాతల అండ వున్నది. మతపరమైన భక్తిని చేర్చి జనాన్ని ఆకట్టుకుంటున్నారు.
ధ్యానంలో నిమగ్నమైన వారికి మెదడు నుండి సెరొటోనిన్ (Sertonin) స్రవిస్తుంది. ఇది పరిమితంగా అయితే మంచిదే. ప్రశాంతత లేని వారికి కుదుట బడడానికి యిది కొంతవరకు తోడ్పడుతుంది. కాని సెరొటోనిన్ ఎక్కువగా విడుదల అయితే ఆత్రుత - ఆందోళన విపరీతంగా పెరిగిపోతుంది. ప్రశాంతత బదులు, గందరగోళంతో చికాకుపడతారు. మనోవైకల్యం ఎక్కువ అవుతుంది. ఈ విషయమై జాన్స్ హాప్ కిన్స్ యూనివర్శిటీలో న్యూరోసైన్సెస్ శాఖాధిపతి డా. సాలొమన్ స్నైడర్ పరిశోధనలు చేశారు (Soloman Suyder).
విస్ కాన్సిన్ లో బౌద్ధ కేంద్రానికి చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ డేవిడ్ సన్, ధ్యానం వలన దయార్ద్రత పెరుగుతుందని ఉద్రేకాలు అదుపులోకి వస్తాయన్నాడు. ఆయన పరిశోధనలు సైంటిఫిక్ అధ్యయానికి గురి చేస్తే, ఆయన చెప్పిన ఫలితాలు రాలేదు. న్యూజెర్సీలో రాబర్డ్ వుడ్ జాన్సన్ మెడికల్ స్కూలుకు చెందిన డా. నాన్సి హేస్ (Nancy Hayer) ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. కొన్ని రకాల రోగాలకు, మానసిక ఉద్రేక పరులకు ధ్యానం పనికిరాదని డేవిడ్ సన్ స్వయంగా హెచ్చరించారు.
శరీరంలో కొన్ని అంగాలు వాడకపోతే ఎలా క్రమేణా పనిచేయలేక, నిరుపయోగం అవుతాయో అలాగే మెదడులోని భాగాలు కూడా అవుతాయని ఆర్ధర్ చాపెల్ (Arthen Chappell) హెచ్చరించాడు. ఈయన గురు మహరాజ్ ప్రేమరావత్ కు లోగడ శిష్యుడు కూడా. మనసు మొద్దుబారితే ప్రమాదం అన్నాడు. Atrophy లక్ష్యం వస్తుందన్నాడు. ధ్యానం చేసే వారిలో చిన్న పనులు, లెక్కలు చేయలేకపోవడం దగ్గర వారి పేర్లు సైతం గుర్తుంచుకోపోవడం జరుగుతున్నదన్నారు.
గోయంకా విపాసన కేంద్రంలో (బుద్ధగయలో) క్రిస్టోఫర్ టిట్ మస్ (Christopher Titmless) అనుభవాలను వివరిస్తూ, విపరీత బాధలకు గురైనట్లు పేర్కొన్నాడు. (trile net) విపరీత భ్రమలు, భ్రాంతితో బాధ పడినట్లు వెల్లడించాడు. పెద్దగా అరవడం, పడిపోవడం జరిగింది. చివరకు మానసిక రోగానికి గురై చికిత్స పొందాడు. కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
Igatpuni కేంద్రంలో కొందరికి వెన్నెముక విరగడం, తల పగలడం, యిత్యాదులు జరిగాయి. కొందరు మత్తు పదార్థాలకు అలవాటుపడు తున్నారు. ఇదంతా ధ్యానకేంద్రాలో జరుగుతున్నా వేరే వాటికి ఆపాదిస్తున్నారు.
న్యూజిలండ్ విపాసన కేంద్రంలో ధ్యానం చేసిన ఒక యువకుడు కొద్ది రోజులు బాగుందంటూ, యింటికి వచ్చి మానసిక రోగిగా మారాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కుదుటబడ్డాడు.
గోయంకా విపాసన కేంద్రంలో (Black health, Blue Mecentine, Australia) జెన్ ధ్యానం అధ్యాపకుడు జెఫ్రేడాసన్ (Geobbrey Dawson) చెబుతూ 20 మంది మానసికంగా రోగులైనట్లు రికార్డు వున్నదన్నాడు. ఈ కేంద్రాలలో బాధలకు గురైన వారికి చికిత్స లేదని, ఆ విషయం గమనించాలన్నారు.
ధ్యానం చేయడానికి వచ్చేవారిని ముందుగా పరీక్షించాలని డాలోయిస్ వాండెర్ కూల్ (Dr. Lois Vanderkool) కలరెడో సైకాలజిస్ట్ చెప్పాడు.
Mary Gardner (queensland, Australia, http://www.users.bigpond.com/marygarden/index.htm.)
ఈమె పూనాలో రజనీష్ వద్ద ధ్యానం కోర్సులో 1979లో పాల్గొన్నారు.
ధ్యానం పేరిట దుర్పినియోగం వుందని కె. శ్రీ ధమ్మానంద అన్నారు. (శ్రీలంక 2006లో మరణించాడు. మలేషియాలో తేరవాద బుద్దిస్ట్).
ధ్యానం కేవలం mouk, nuns కే నని, Dr. Lorin Roche ధ్యాన టీచర్ అన్నారు. ధ్యానం చేసేవారు అత్యధికంగా depressionకు గురౌతున్నారన్నాడు. దలైలామా కూడా ధ్యానం పట్ల హెచ్చరికలు చేశాడు.
మేరీగార్డనర్ హరేకృష్ణ ఉద్యమంలోనూ వున్నారు.
ఎక్కువ సేపు కూర్చోవడం, ఒకే మంత్రం పునరుశ్చరణ గావించడం వలన అనేక బాధలకు లోనౌతున్నారు.
ధ్యానం వలన మంచి ఫలితాలు వస్తున్నాయనే ప్రచారం వింటున్నాం. కాని ధ్యాన కేంద్రాలలో ప్రవేసించిన వారు తరువాత ఎలా ఉంటున్నారో రికార్టు లేదు. ఏదైనా జరిగితే బాధ్యత వహించే వారెవరూ లేరు. సర్వే జరగలేదు. కానీ అనుకూల ప్రచారం మాత్రం ధారాళంగా సాగుతున్నది.
మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలని ఆలోచన చంపేసేయాలని క్రమేణా మోక్షానికి ధారితీయాలని ధ్యానం అందుకు నాంది అని యోగం చెబుతుంది.

6 comments:

నాగన్న said...
This comment has been removed by the author.
Anonymous said...

బలే బలే. ఎక్కువ ధ్యానం చేసి నీకు మెంటలొచ్చింది. నీకు కరెంటు పెట్టాల

Sudh said...

intavaruku meeru ichana vivaralu choosanu baagunnai, kaani dyanam gurinchi vadevado cheppadu, eedevado cheppadu kabatti dyanam cheyyakoodadu leka pote testlu cheyyali vagaira vagaira antunnaru daanike koncham navvostondi.

Viswanath said...

ద్యానం గురించి ఎవరికి వారుగా అనుభవించి దానిని గురించి మాట్లాడచ్చు గాని, చదివి, వినీ రాయటం మూర్ఖత్వం. ఏ విషయమైనా అనుభవపూర్వకమైతేనే దానిని గురించి విశ్లేషించగలరు గాని అర్ధం పర్ధం లేకుండా రాయటం అనేది దేనిలోనూ సరియైన అవగాహన లేని వారు మాత్రమే చేయగలరు. మీరు ఏ కోవకు చెందే వ్యక్తో మీకు అర్ధమయిందనుకొంటా.

Mahesh said...

hi friends,
ధ్యానంలో నిమగ్నమైన వారికి మెదడు సంగతి ఏమో గని,
ధ్యానంలో నాగురించి నేను మాత్రం తెలుసుకున్నాను యిది మాత్రం కచితంగా సాద్యం ద్యానంలో.
from
మహేష్, రాజహ్మున్ద్రి
మనోయోగ క్షేత్రం

Mahesh said...

హాయ్,
అనుభవపూర్వకమైతేనే దానిని గురించి విశ్లేషించగలరు, వొకసారి రుచి చూస్తే ఈవ్యాసం యిల రాసి వుండరు. యిస్తాం వచిన్నట్టు ఆలోచించడం వొకరీతి అయితే, ద్యానంలో పద్దతిలో ఆలోచించడం వస్తుంది.
ఎన్నో నేల్లలు నిద్రపోని, కసితో రగిలిపోయే, రక్తం ఉడికి పోయే పరిస్థితినుంచి నిచాలస్థితి ని ప్రసాదిన్చినదే యీద్యనం.
అటువంటి కష్ట తరమైన పరిస్థితిని ఎడుర్కొన్నపుడు, గుండె బరించలేని స్థాయి వచినపుడు క్రమ తప్పకుండా ధ్యానం చేసి చూసి మేలో వచ్చిన మార్పులు మీకు తెలిస్తే అప్పుడు ఎలా వ్రాసివుంతరేమో వొకసారి ఆలోచించండి!
అలంటి పరిశితి వస్తే కచితంగా దయానం చేసి చూసి చూడండి.
మనోయోగ క్షేత్రం, రాజహ్మున్ద్రి
మహేష్.