
pleasure to visit-Union station

Treasure of human knowledge

unique news museum in the world
వాషింగ్టన్ లో సందర్శకులు తిరిగి చూడటం చాలా సులభం. రైళ్ళు బస్సులు ఆ విధంగా అందుబాటులో ఉన్నాయి. ప్రతి స్థానిక రైలు రాజధాని మీదుగానే మేరీలాండ్, వర్జీనియాకు తిరుగుతుంటాయి. బస్సులు అంతే. అవిగాక టూరిస్టు బస్సులు రాత్రింబవళ్లు ఉన్నాయి. ఫెడరల్ ప్రభుత్వము అడుగుతున్న మ్యూజియంలు గనుక, స్మిత్ సానియన్ మ్యూజియమ్ లన్నీ ఉచితంగా చూడవచ్చు. అందరూ చూచే మ్యూజయమ్ లు ఎయిర్ అండ్ స్పేస్, చారిత్రక మ్యూజియమ్ లు. అయితే శిల్ప సంపద కళాఖండాలు ఉన్న మ్యూజియమ్, బొటానిక్ గార్డెన్ నల్లజాతి వారి మ్యూజియమ్ విశిష్టమైనవి.
యూనియన్ స్టేషన్
యూనియన్ స్టేషన్ కేవలం రైల్వే స్టేషన్ మాత్రమే కాదు. ఫోటోలు తీసుకోకుండా బయటకు రాలేనంత ఆకర్షణీయంగా డోమ్ పై, గోడలపై చెక్కిన శిల్పాలు, మ్యూజియమ్ చూస్తున్నామా అనిపించేటట్లుంటాయి. అక్కడినుండే అన్ని రైళ్లు బయట ప్రాంతాలకు పోతాయి. సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. వివిధ దేశాలకు చెందిన ఫలహార శాలలు ప్రత్యేక ఆకర్షణ కాగా, అప్పడాలు, దోసెలు లభించే ఇండియన్ రెస్టరెంట్లు ఉన్నాయి. విక్టోరియా సీక్రెట్ తో సహా వివిధ షాపింగ్ సెంటర్లు పుస్తకాల షాపు పోస్టాఫీసు రోజంతా గడపడానికి వీలుగా ఉంటుంది.
స్టేషన్ కు ముందు నిలబడి చూస్తే, కేపిటల్ హిల్ (పార్లమెంట్ హౌస్), ఒక ప్రక్కన పురాతన పోస్టాఫీసు కనిపిస్తాయి. పాత స్టాంపులు, పోస్టల్ చరిత్ర సందర్ళకులకు చక్కని విద్యగా పనికొస్తుంది. స్టషన్ నుండి నడచి వెళ్ళి పార్లమెంటు, సుప్రీమ్ కోర్టు, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, పార్లమెంట్ సభ్యుల ఆఫీసు భవనాలు, మాల్, మాన్యుమెంట్లు చూడవచ్చు. అన్నట్లు ఏప్రిల్ లో వెళ్లేవారికి మాన్యుమెంట్ల దగ్గర సరస్సు దాని చుట్టూ విరబూసిన తెల్లని చెర్రీ బ్లాసమ్స్ కనుల విందు చేస్తాయి. జపాను వారిచ్చిన వాటిని జాగర్తగా పోషిస్తూ మాన్యుమెంటు దగ్గర ఏడాదికోసారి ఉత్సవం జరుపుతారు. తరచు మాల్ లో ప్రదర్శనలు జరుగుతుంటాయి. అందులో నిరసనలు కూడా చూస్తాం. సుప్రీంకోర్టు చూసేవారు లోనకు ప్రవేశించగానే కనిపించే లా మేకర్స్ విగ్రహాలు గోడలపై నిలువెత్తున చెక్కి ఉండడాన్ని చూస్తారు. సాధారణంగా ఎక్కడా కనిపించని ప్రవక్త మహమ్మదు విగ్రహం ఆశ్చర్యపరుస్తుంది. ఇస్లాం చట్టాన్ని అందించిన దృష్ట్యా ఆ విగ్రహం పెట్టారు.
లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్
ఇది మూడు భవనాల సముదాయం. జఫర్సన్, మాడిసన్, యాడమ్స్ అనే ముగ్గురు అమెరికా అధ్యక్షుల పేరుతో ఉన్నాయి. మూటిని కలుపుతూ స్వరంగ మార్గాలున్నాయి. ఈ భవనాల పై ఉన్న తాత్వికుల కళాకారుల, కవుల, చరిత్రకారుల విగ్రహాలు, శిల్పాలు, చిత్రాలు, వారి వచనాలు ఎవరినైనా ఆకట్టుకొనక మానవు. సందర్శకులకు పైపైన చూబెడతారు. సభ్యత్వం ఉన్నవారు లోన సౌకర్యాలు వినియోగించుకోవచ్చు. పుస్తకాలు ఇంటికి ఇవ్వరు. అక్కడ చదువుకొని కావాలంటే కాపీ చేసుకోవచ్చు. అలాగే పత్రికలు, డాక్యుమెంట్లు, సినిమాలు కూడా కాపీ చేసుకోవచ్చు. నిత్య నూతనంగా సేకరణ చేస్తున్న ఈ గ్రంథాలయంలో 13 కోట్ల పుస్తకాలు తదితరాలు ఉన్నయి. ఏషియా, ఆఫ్రికా విభాగాలపై బాగా దృష్టి పెట్టారు. సభ్యులకు వేరోచోట నుండి పుస్తకాలు, సమాచారం తెప్పించి పెడతారు. పార్లమెంటు సభ్యులకు లైబ్రరీ సహాయం ఇంతా అంతా కాదు. ఎప్పుడూ చిన్న సమావేశాలు, చర్చలు, ప్రదర్శనలు జరుపుతుంటారు. ఫ్రాయిడ్ పై జరిపిన ఒక ప్రదర్శనను నేను చూడగలిగాను. పుస్తక సేకరణకు ప్రపంచ వ్యాప్తంగా కేంద్రాలు నెలకొల్పారు. అన్ని భాషలకు సంబంధించినవి సేకరిస్తున్నారు. అనువాదాలు తీసుకోరు. నేను కేటలాగ్ పరిశీలించినప్పుడు తెలుగువారి రచనలెన్నో ఉండటం గమనించాను. నా రచనలన్నీ ఉన్నాయి. చోటు కోసం మైక్రో ఫిల్మ్ చేస్తూ పోతున్నాను.
వాషింగ్టన్ లో జార్జి టౌన్ కు వెళితే చారిత్రక కట్టడాలు వివిధ దేశాల రెస్టరెంట్లు, వివిధ దేశాల సినిమాలు ప్రదర్శించే చోట్లు కనిపిస్తాయి. కెనడి, ఫోర్డ్ థియేటర్లు పేర్కొనదగినవి. పొటామిక్ నది రాజధానిలో ప్రవహిస్తుండగా దాని చుట్టూ ఎన్నో చూడవలసిన విశేషాలు ఉన్నాయి. రాను రాను అధ్యక్ష భవనం (వైట్ హౌస్) సందర్శన రక్షణ కట్టుబాట్ల దృష్ట్యా పరిమితం చేశారు. మ్యూజియం అనేది ప్రపంచంలో పత్రికల, మీడియాకు చెందిన ఒక ప్రత్యేక ప్రదర్శన స్థలం వార్తా సేకరణలో చనిపోయిన విలేఖర్ల జ్ఞాపకార్థం ఫ్రీడం పార్టు ఏర్పాటు చేశారు. మీడియా వారు దీనిని చూడకుండా రాకూడదు.
2 comments:
>> "ఫెడరల్ ప్రభుత్వము అడుగుతున్న మ్యూజియంలు గనుక"
'నడుపుతున్న' అని మీ భావం కాబోలు.
Yes You are correct. Thanks for pointing out.
Post a Comment