Sunday, September 7, 2008

ఆక్యుపంక్చర్ కథాకమామిషు


unverified belief points in china









Points for needles







Acupuncture in China













చైనాలో అనాదిగా వస్తున్న సూదుల వైద్యాన్ని ఆక్యుపంక్చర్ అంటారు. శరీరంలో జీవశక్తి ప్రవహిస్తుంటుందని, దీనిని చి, కి అని అంటారని ఈ వద్యంలో మూల సూత్రంగా చెప్పారు. శరీరంలో జీవశక్తి ప్రవహించే మార్గాలను మెరిడియన్ అని పిలిచారు. ఇవి నిలువుగానూ, అడ్డంగానూ పయనిస్తుంటాయని, శరీరం పై భాగంలో ఇవి కలిసే చోట్లు 365 ఉన్నాయని నమ్మారు. ఆక్యుపంక్చర్ వైద్యంలో రోగ నిర్ణయానికి నాడి చూడడం ఒక పద్దతిగా వస్తున్నది. పురుష శక్తిని యంగ్ అంటార.



. మెరిడియన్ గుర్తించిన చోట్లు రెండు వేల వరకూ పెరిగాయి. శరీరంలో ఈ శక్తులు ఉన్నాయనీ. స్త్రీ శక్తిని ఇన్ అంటారనీ, పురుష శక్తిని యంగ్ అంటారనీ నమ్మారు. శరీరంలో ఈ శక్తులు తులనాత్మకంగా ఉండటానికి అనువుగా సూదులు గుచ్చి ప్రకోపింప చేసి సరైన పద్ధతిలో పెట్టవచ్చునని నమ్మారు. రుతువులూ, వాతావరణం రోజులో సమయం, నాడి ఆధారంగా రోగ లక్షణాలను నిర్దారిస్తారు. దేహంలోని అంగాలకు ప్రాతినిధ్యం వహిస్తూ మణికట్టు వద్ద నాడి ఆరు విధాలుగా ఆడుతుందన్నారు. ప్రతినాడీ ప్రకంపనానికి 25 లక్షణాలున్నాయన్నారు. చికిత్స ప్రారంభించేముందు రోగి నాడిని ఆధారంగా 300 నాడీ ప్రకంపనాలను పరిశీలిస్తారు. సూదులను ఆయా శరీర భాగాలలో గుచ్చి ఎంతసేపు ఉంచవలసిందీ రోగి లక్షణాలను బట్టి నిర్ణయిస్తారు. ఈ సూదులు 6 అంగుళాల నుండి 12 అంగుళాల వరకూ ఉంటాయి. ఒక మూలికను ( ) ఆయా శరీర భాగాల మీదగానీ, పుండు పడిన చోట గానీ ఉంచి వేడి చేస్తారు. ఏ రోగానికైనా ఈ సూది మందులు పనిచేస్తాయని నమ్మారు. రోగనిర్ధారణలో నాలుకను కూడా పరిశీలిస్తారు.
ప్రాచీన చైనాలో శరీరాన్ని కోసి చూడటం నిషిద్ధం. కనుక శరీరంలో ఏ
ఆక్యుపంక్చర్ విరోచనాలకు, కంటిజబ్బులకు, ముక్కు దిబ్బడలకు, గొంతు నొప్పికి, ఉబ్బసానికీ, కీళ్ళ వాతానికీ, శరీరంలో పుండ్లకు పనిచేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీనికి శాస్ర్తీయ ఆధారాలు చూపలేకపోయింది. ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులకు, తలనొప్పి, మలబద్ధకం, లైంగిక వ్యాధులూ, అలసట వంటి లక్షణాలకు ఆక్యుపంక్చర్ పనిచేస్తుందని జోసఫ్ హెల్మ్ ప్రకటించారు. ఇందుకు ఆధారాలు శాస్త్రీయంగా చూపమన్నప్పుడు అందుకు నిలబడలేకపోయారు. ప్రస్తుతం ఆక్యుపంక్చర్ పనిచేస్తుందని జోసెఫ్ హెల్మ్ ప్రకటించారు. ఇందుకు ఆధారాలు శాస్త్రీయంగా చూపమన్నప్పుడు అందుకు నిలబడ లేకపోయారు. ప్రస్తుతం ఆక్యుపంక్చర్ అమెరికా, ఇండియా తదితర దేశాలలో ప్రచారంలో ఉన్నది. దీనిని ఆచరించేవారు ఆధునిక వైద్య విధానాలను జోడించటానికి ప్రయత్నిస్తున్నారు. కాని శాస్త్రీయ పరిశోధనలలో ఇంతవరకూ ఆక్యుపంక్చర్ ఏ ఒక్క సిద్ధాంతాన్నీ రుజువుపరచలేకపోయింది.

Acupuncture in United States of America





ఆక్యుపంక్చర్ లో శాస్త్రీయత ఎంత
ఆక్యుపంక్చర్ లో అనేక నమ్మకాలున్నాయి. ఆలోచనకు కేంద్రం స్ప్లిన్ అంటారు. కన్నీళ్ళు రావటానికి కాలేయం కారణం అంటారు. భయానికీ, ఇచ్ఛకూ కేంద్రం మూత్రకోశాలన్నారు. చెవులలో ఉన్న కేంద్రాలు శరీరంలో ప్రతి భాగానికీ ప్రతిబింబిస్తాయని నమ్మారు. ఆక్యుపంక్చర్ ప్లాసిబ్ ప్రభావాన్ని చూపుతున్నది. నొప్పులకు ఉపశమనం కలిగిస్తుందనే నమ్మకం ఈ వైద్యంలో ఉన్నది. మందులు వాడరు గనుక ఈ చికిత్స వలన చెడు ఫలితాలు లేవనీ, ఎలాంటి దోషాలూ రావని ప్రచారం చేశారు. అయితే, సూదుల్ని గుచ్చెటంలో జాగ్రత్త వహించకపోతే నష్టాలు జరిగే ప్రమాదం ఉన్నది. ఎయిడ్స్ వంటి వ్యాధులు ఈ సూదుల వలన వ్యాపించే అవకాశం ఉన్నది. ఒకరికి గుచ్చిన సూదులు ఎంత శుద్ధి చేసినప్పటికీ మరొకరికి ప్రయోగించినప్పుడు సూక్ష్మ జీవులు వ్యాపించే అవకాశం ఉన్నది. ఒకరికి చేసిన సూదులు ఎంత శుద్ధి చేసినప్పటికీ మరొకరికి ప్రయోగించినప్పుడు సూక్ష్మజీవులు వ్యాపించే అవకాశం ఉన్నది. ఇటీవలనే ఎలక్ట్రో ఆక్యుపంక్చర్ అనే విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇది జర్మనీ నుండి వచ్చింది. దీనివల్ల రోగి లక్షణాలను నిర్దుష్టంగా నిర్ణయించి చికత్స చేయవచ్చునని చెప్పారు. రెయినాల్డ్ ఓల్ అనే అతను ఆక్యుపంక్చర్ కు ఆధునిక రీతులు చేర్చి మెరిడియన్ ను కచ్చితంగా నిర్దారించానికి యిది ఉపకరిస్తుందన్నారు. ఇందుకుగాను, సూదివైద్యానికి గాల్వనోమీటర్ చేర్చాడు. శరీరంలో జీవశక్తి ప్రవహించే కేంద్రాలు తెలుసుకోవటానికి ఈ పద్ధతిని ప్రయోగించాడు. అయితే మరే విధమైన పరీక్షలూ చేయటం కానీ, రోగి చరిత్రను తెలుసుకోవటం కానీ ఈ విధానంలో లేదు. మరికొందరు ప్రాచీన ఆక్యుపంక్చర్ విధానాన్ని కొంతవరకు మార్చివేసి కొత్త రీతుల్ని ప్రవేశపెట్టారు. జీవశక్తి ప్రవహించే చోట్లు బాగా తగ్గించారు. సూదులకు విద్యుత్ ప్రవాహం కల్పించి శరీరంలో గుచ్చే రీతుల్ని కూడా వాడుతున్నారు. ప్రాచీన పద్ధతిపై మెరుగులు దిద్దినట్లు వీరు చెప్పుకుంటున్నారు.
ఆక్యుపంక్చర్ లో సూదులు వాడకుండా ప్రవేశపెట్టిన కొత్తపద్ధతిని ఆక్యు ప్రెషర్ అంటున్నారు. ప్రాచీన చైనాలో యిదికూడా ఉండేది. శరీరంలో జీవశక్తి ప్రవహించే చోట్లలో సూదులు గుచ్చకుండా చేతులతో నొక్కడం, మెల్లగా మర్దన చేయటం ఈ విధానంలో ప్రత్యేకత.
ఆక్యుపంక్చర్ శిక్షణ సంవత్సరాల నుండి కేవలం కొన్ని గంటల వరకు పరిమితమైన రీతులు ప్రవేశపెట్టారు.
ఆక్యుపంక్చర్ వైద్యంలో వివిధ ప్రమాదాలను గుర్తించారు. ముఖ్యంగా సూదుల్ని గుచ్చటంలో, కొన్ని సందర్భాలలో నరాలు తెగటం, సున్నితమైన అంగాలు దెబ్బతినటం, ఊపిరితిత్తులలో గుచ్చినపుడు రక్తం చింది ప్రమాదానికి గురికావటం సంభవించింది. కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. ఆక్యుపంక్చర్ విధానంలో ముఖ్యంగా చైనాలో సూదులను స్టెరిలైజ్ చేయటం ఉండేది కాదు. సూక్ష్మ క్రిములు రోగాలను తెస్తాయనే విషయం వారికి తెలియదు. అందువలన ఈ సూదులు అంటురోగాలను వ్యాపింపజేశాయి. చైనాలో సూదులను సారాలో అట్టిపెడతారు. కాని, సారా వైరస్ ను సంహరించలేదని వారు గ్రహించలేకపోయారు. సూదులు గుచ్చినప్పుడు, ఒక్కొక్క సందర్భంలో అవి సన్నగా పలుచగా ఉండి విరిగిపోవటం, శరీరం నుండి వాటిని తొలగించడానికి ఆపరేషన్ అవసరం కావటం కూడా నమోదయ్యింది. విద్యుత్ లో సూదులను ప్రకంపనానికి గురిచేసినప్పుడు వాటి సమయ ప్రభావాన్ని గుర్తించనందున నరాలు శాశ్వతంగా దెబ్బతిన్న సందర్భాలున్నాయి. వెన్నెముకలో సూదులు గుచ్చి చికిత్స చేస్తున్నప్పుడు కొందరు పక్షవాతానికి గురయ్యారు. కాళ్లూ, చేతులకు వెన్నెముక నరాలతో సూటిగా, సంబంధం ఉండటం అలాంటి నరాలపై సూదులు గుచ్చటం యిందుకు కారణం. చెవులపై సూదులు గుచ్చే ప్రక్రియను అరిక్యులో థెరపీ అంటారు. ఈ విషయాన్ని శాస్త్రీయంగా పరిశీలించినప్పుడు ఇందుకు వారు చెప్పే కారణాలు రుజువుకు నిలబడ లేదు.
చైనాలో ఆక్యుపంక్చర్ విధానం ఉంది గనక ఇది కమ్యూనిజానికి సంబంధం ఉన్న వైద్యంగా భారత దేశంలో కొంతమంది భ్రమపడిన సందర్భాలు లేక పోలేదు. చైనా వెళ్లి శిక్షణ పొంది వచ్చి, ప్రాక్టీసు పెట్టినవారూ ఉన్నారు. బహుశ వారు చైనాలో చూసి వచ్చిన తరువాత కమ్యూనిజానికి ఎలాంటి పొత్తూ దానికి లేదని గ్రహించే ఉంటారు. చైనా జనాభాకు కావలసినంత మంది ఆధునిక వైద్యులు లేరు. కమ్యూనిజం అధికారంలోకి వచ్చిన తరువాత శాస్త్రీయ వైద్య విధానాన్ని అనుసరించినప్పటికీ అందరికీ వైద్య సదుపాయాలు అందించలేక విమర్శలు తట్టుకునే నిమిత్తం బేర్ ఫుట్ డాక్టర్ల పద్ధతిని కొనసాగించారు. చైనా అధునాతన వైద్య పత్రికలు పద్ధతులూ గమనించిన వారు, ఆక్యు పంక్చర్ వారి అధికార విధానం కాదని తెలుసుకోగలరు. నిరాధార మైన నమ్మకాలపై కొనసాగుతున్న సూదుల వైద్యం శాస్త్రీయ పద్ధతిని కోరుకునే కమ్యూనిజం ఆమోదించలేదు.

1 comment:

Unknown said...

As always very informative.