Thursday, September 18, 2008

శరీరంలో ఉష్టోగ్రత మహత్తు

వూళ్ళోకి స్వాములు వారు వేంచేశారు. భక్తులు యధాశక్తి కానుకలు అర్పిస్తున్నారు. రోజూ ఆయన చెప్పినట్లు పూజలు చేస్తున్నారు. స్వామి ఆకర్షణీయంగా చెప్పే మాటలకు పారవశ్యం చెందుతున్నారు. కొత్తగా వచ్చిన స్వామి, రోజుకో మహత్తు చూపి భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.
ఆ రోజు స్వామి కోసం భక్తులు ఎదురు చూసి విసిగిపోతున్నారు. ఎంతకూ వేదికపైకి ఆయన రాలేదు. చివరకు శిష్యుడు వచ్చి స్వామి రాకను ప్రకటించారు. స్వామివారు రాగానే, వూళ్ళో డాక్టరును పిలిపించమన్నారు. డాక్టర్ రాగానే థర్మామీటరుతో ఉష్టోగ్రత చూడమన్నారు. మామూలుగా వున్నది. కాసేపువున్న తరువాత మళ్ళీ చూడమన్నారు. ఈసారి 104 డిగ్రీలతో ఒడలు మండిపోతున్నది. అయినా స్వామి చలించలేదు. ఇంతలో ఏం జరిగిందో తెలియని భక్తులు స్వామి మహత్తుకు అబ్బురపడి దండాలు పెట్టి నోరు మూసుకున్నారు.
డాక్టరు వస్తున్నప్పుడే సబ్బు ముక్క చప్పరించి మింగిన స్వామి, కొద్దిగా తేనీరు సేవించారు. ఆ విషయం భక్తులకు తెలియదు. తీర్థం పుచ్చుకుంటున్నాడని భ్రమించారు.
కడుపులో సబ్బునందుగల క్షారం (ఆల్కలీ)తో తేనీటిలోని ఆమ్లం (యాసిడ్) మిళితం కాగా, రసాయనిక మార్పు జరిగి వేడి పుడుతుంది. ఇది కృత్రిమంగా సృష్టించిన ఉష్టోగ్రత, భక్తులు ఆశ్చర్యపడుతుండగా స్వామి ఏమీ పుచ్చుకోకుండా కేవలం చల్లని నీరు తాగుతూ డాక్టరు ఇస్తామన్న మందులు, ఇంజక్షన్ పుచ్చుకోరు. చల్లని నీరు వలన కడుపులో మంట, ఉష్టం తగ్గిపోతుంది. అదంతా దివ్యశక్తిగా భక్తులు భావిస్తారు.

.

5 comments:

Anonymous said...

అయ్యో ప్రేమానందంగారికి ఈ రోజు పనేమీ లేదా? మరి మా ఎన్నారై లందరూ పొగుచేసిన డబ్బులేంచెయ్యాలబ్బా?

ఇన్నయ్యా, సబ్బు ముక్క మింగితే వెంటనే డోకవుతుందని తెల్వదా? ఉత్తి వి.పి పోస్టులు ఎవరి అహంకారం తౄప్తిపర్చుకోవడానికి?

వెనకటికి ఎవర్నో అడిగారుట: అయ్యా నేనేమీ సహాయం ఇతరులకి చెయ్యలేకపోతున్నాను, ప్రపంచానికి నేనేమి చెయ్యగలనూ? ఓ చోట కూచుని ఏమీ చేయకపోవడం కూడా సహాయమే నాయనా అని వచ్చింది ఆన్సరు. ఎందుకంటే కూసే గాడిద మేసే గాడిదని చెడగొట్టడం ఎందుకు?

అర్ధం అయ్యిందా ఇన్నయ్య?

krishna rao jallipalli said...

అబ్భా... అననమిస్ గారూ... ఎందుకు భయం?? అసలు పేరుతోటే comments పంపండి. మీరు దేనికి, ఎవరికి, ఎందుకు భయ పడుతున్నారు?? ధైర్యం గా పంపండి. మిమ్ములను ఎవరు, ఏమి చేయరు, చేయలేరు.

Anonymous said...

@jallipalli
పేరు చెప్పకపోతే నాకు 'భయం' ఎలా ఆపాదించారో కాస్త శెలవిస్తారా సాలీడు గారు?

[సాలీడు - తనచుట్టు అల్లుకున్నదే ప్రపంచం అనుకునే ఒక ప్రాణి. కొండొకచో అంతర్జాల విజిటర్. ఇటువంటి సాలీడ్లు తమ బుర్రలో ఉన్నదే నిఝం అని నమ్ముతారు కాబోలు. బి.టి.డబ్లియు - లాగిన్ చేయడానికి బధ్ధకం నాకు]

krishna rao jallipalli said...

నమస్తే, అననమిస్ గారూ.. నాకు భయం లేదు / login అవ్వడానికి బద్ధకం అని మామూలుగా చెప్పలేరా?? నన్ను సాలీడు అని విమర్శించాలా??
మా ఎన్నారై లందరూ .. అని అన్నారు. అంటే మీరు NRI అన్నమాట. అంటే మీరు ఎంతో చదువుకొంటే గాని విదేశాలకు వెళ్ళరు కదా. మీరు ఎ SOFTWARE ENGINEER OR DOCTOR OR HIGHLY QUALIFIED TECHNICIAN ETC. అయి ఉంటారు. అంతటి విద్యావంతులు అయిన మీరు, నన్ను విమర్శించిన విదానం.. ఓ .. very good. అభినందనలు.

krishna rao jallipalli said...

hello అనానమిస్.. ఎదుటి వారిని దూషించడం, non-veg language వాడటం నీకు ఒక్కడికే వచ్చు అని అనుకొంటున్నావా?? abroad లో ఉండి, ఎంతో ఉన్నత చదువులు చదివిన వాడివి.. నీకే అంత వస్తే .. inter చదివి, గుంటూరులో ఉన్నా నాకు ఎంత రావాలి?? ఒదల మంటావా?? తట్టుకో గలవా??