ఇటీవల చదువుకున్న వారినీ, సామాన్య అమాయకుల్నీ అవరించిన వైద్యం ఆయిల్ పుల్లింగ్. నూనె నోట్లో పోసుకొని కొంచెం సేపు పుక్కిలించి తరువాత వూసేయడం యిందులో ప్రధానం. మస్టర్డ్, సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. ఆయిల్ రంగు మొదట్లో ఎలా వున్నా నోట్లో పోసుకుని కాసేపు పుక్కిలించేసరికి, నోట్లో లాలాజలంతో కలసిపోతుంది. అలా కలవడం వలన నూనె రంగు మారుతుంది. రంగు మారటాన్ని చికిత్సగా భావిస్తున్నారు. అంతేగాక అన్ని రోగాలకు యిది మందు అని ప్రచారం చేస్తున్నారు. ఇలా నూనె పుక్కిలిస్తున్న వారు కొందరు తమకు ఏదో రిలీఫ్ యిచ్చినట్లున్నదని భావిస్తున్నారు. శరీరంలో సహజంగా వున్న రోగనిరోధక శక్తి వలన తగ్గిపోయే లక్షణాలుంటాయని వీరు గమనించడం లేదు.
తాంత్రికులు, మాంత్రికులు లోగడ కామెర్ల (జాన్ డిస్) రోగులకు ఆయిల్ యిచ్చి బాగా పుక్కిలించమనేవారు. కాసేపటికి వూసేస్తే అది లాలాజలంతో కలసినందున పసుపుపచ్చగా మారేది. అది చూపించి, జబ్బు తగ్గిందని, పథ్యం చెప్పేవారు. కాలేయం, లివర్ కు విశ్రాంతి యిస్తే తగ్గే రోగాలకు అలా చెప్పి జనాన్ని భ్రమింపజేయడం చిరకాలంగా వస్తున్నదే.
.
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
ఈ మధ్య అంటే ఈ వ్యాసం రాసినప్పటికి ఏమో. కనీసం 12-15 ఏళ్ళ మధ్య(నా చిన్నప్పుడు) ఆయిల్ పుల్లింగు గురించి పేపర్ల లో కూడా తెగ రాసేవారు.
అప్పట్లో (పదైదేళ్ల క్రింతం) ఆంధ్రజ్యోతి పత్రికలో అనుకుంటా వారం వారం వచ్చేది. నేను కూడా ఓ నెల రోజులు చేశాను ఈ ఆయిల్ పుల్లింగ్. ఇదంత అశాస్త్రీయం అని ఇప్పుడే తెలిసింది నాకు.
Placebo effect?
Post a Comment