Saturday, September 6, 2008

తాంత్రికుల అగ్ని పరీక్ష

















తాంత్రిక విద్య వింతగా, భయానకంగా వుంటుంది. తాంత్రిక యోగంలో స్త్రీ వుండాలనేది నిషేధానికి గురైంది. తాంత్రిక విద్య బహుళ ప్రచారం పొందకపోయినా, అక్కడక్కడా ఆచరణలో వుంది, తాంత్రికులు అనేక విచిత్ర చర్యలు చేస్తుంటారు. వారి భీభత్సభక్తికి నిదర్శనగా చాలా ప్రయోగాలు పేర్కొనవచ్చు.
ఒక లోహపాత్రలో రంపపు పొడి వుంచి అందులో సోడియం పెరాక్సైడ్ పొడి కలుపుతారు. భక్తులలో ఒకరిని పిలిచి నీళ్లు తెమ్మంటారు. నీళ్ళు గుక్కెడు తాగి, రంపపు పొట్టుపై వదలుతారు. నీరు తగలగానే సోడియం పెరాక్సైడ్ వలన మంటలు లేస్తాయి. అప్పుడు తాంత్రికుడు ఏవో మంత్రాలు ఉచ్చరిస్తాడు. భక్తులు అదంతా మహిమగా స్వీకరిస్తారు.
పూనకం వచ్చినట్లు నటించే తాంత్రికుడు ఏవో సోది భవిష్యత్తు కబుర్లు చెబుతాడు. పొటాషియం నైట్రేట్ ద్రావకంలో నాలుగు పర్యాయాలు నారను ముంచి ఎండనిస్తారు. ఒకవైపు నారతాడు వెలిగించి మిగిలిన తాడు దూదితో వుండగా చుడతాడు. ఆ వుండను నోటిలో పెట్టుకుంటాడు. నోటితో గాలి వదలుతుంటే మంటలు వస్తుంటాయి. నోటిలో బాగా లాలాజలం వూరిన తర్వాత ఇలా చేస్తాడు. నోటిలో వుండ వున్నంతసేపు గాలి వదలడం తప్ప, పీల్చడు. తరువాత ఒక వస్త్రంతో నోటిలోని వుండ తీస్తాడు. అలా చేసినప్పుడు భక్తులు మంత్రాలు చదువుతుండగా శిష్యులు హావభావాలు చేస్తూ, కానుకలు వసూలు చేసి పెడతారు.

No comments: