Tuesday, September 30, 2008

తెలుగు సభలు -Memoirs in USA


Siromani award in ATA New York 1992










ఆటా సభలు

1992లో ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్) ప్రధమ సభలు న్యూయార్క్ నగరంలో జరిగాయి. డా. చిట్టి రామచంద్రమూర్తి నన్ను ఆహ్వానించగా వెళ్ళి పాల్లొన్నాను. నాతోపాటు నా భార్య కోమల, కుమార్తె డా.నవీన, అల్లుడు హేమంత్ ఉన్నారు. నాకు ఆ సభలలో మానవవాది, జర్నలిస్ట్ పురస్కారం ఇచ్చి(Siromani) సన్మానించారు. 1992 జులైలో జరిగిన ఆ సన్మానానికి సుప్రసిద్ధ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం వేదికపై నన్ను పరిచయం చేశారు. నాతోపాటు నండూరి రామమోహనరావు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ పురస్కారం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో పరిశ్రమల మంత్రి పి. రామచంద్రారెడ్డి పురస్కారాలు అందించారు. అమెరికా న్యూయార్క్ నగరంలో ఫార్మసీ నడిపిస్తున్న మానవవాద మిత్రులు ఆరమళ్ళ పూర్ణచంద్ర వీడియో తీశారు. ఆటావారు అప్పుడు ప్రచురించిన ప్రత్యేక సంచికలో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ పరిణామాలపై 100 పేజీల నా వ్యాసాన్ని ప్రచురించారు.

తానా సభలు

1997లో లాస్ఏంజిలస్ శివార్లలో డిస్నీలాండ్ వద్ద జరిగిన తానా సభలకు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ అమెరికా) నన్ను ఆహ్వానించి విశిష్ఠపురస్కారాన్ని(journalist) అందించారు. సుప్రసిద్ధ సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు వాటిని అందజేశారు. నా కుమార్తె నవీన, భార్య కోమల, మానవ వాద మిత్రులు, డా.నిర్మల్ మిశ్రా పాల్గొని ఫోటోలు తీశారు.

మరొక సంవత్సరం సిన్సినాటిలో జరిగిన తాన్ సభలకు వెళ్లాను. అక్కడ మెడికల్ సమావేశంలో నా కుమార్తె నవీన ప్రసంగించింది. అది రికార్డు చేశాము. డా. జంపాల చౌదరి (తానాపత్రిక ఎడిటర్) ఆహ్వానంపై ఇది జరిగింది.

తానా సభలు, ఆటా సభలు కొన్నాళ్లు పోటీపడి నిర్వహించిన తరువాత రాజీపడి సభలు పెట్టుకుంటున్నారు. అయితే జాతరలు, కొలుపులు తలపించే రీతిలో ఇవి జరుగుతున్నాయి. అంతకుమించి ఆట్టే నిర్మాణాత్మకమైన ప్రయోజనం కనిపించడం లేదు. కొందరు బాబాలు ఈ సభలను అడ్డం పెట్టుకుని భక్తులతో పిలిపించుకుని ఆధ్యాత్మక వ్యాపారం చేసుకుంటున్నారు. చాలామంది తెలుగువారు ఒకచోట కలుసుకోవటం పేర్కొనదగిన అంశం.

న్యూయార్క్ తెలుగు సభలు

ఒకసారి 1999-2000 ప్రాంతాలలో న్యూయార్క్ లో జరిగిన తెలుగు మహాసభలకు నన్ను మాట్లాడవలసిందిగా ఆహ్వానించారు. డా. దొడ్డపనేని బాబూరావు, జానకి నిర్వహించిన ఆ సభలలో పాల్గొని ప్రసంగించాను.

గ్రేటర్ ఫిలడల్ఫియా తెలుగు అసోసియేషన్

1999-99 ప్రాంతాలలో ఫిలడల్ఫియాలో జరిగిన తెలుగు అసోసియేషన్ కు నన్ను ఆహ్వానించి సన్మానించారు. సినీనటుడు కాకరాల సత్యనారాయణ పురస్కారాలు అందజేశారు. డెలవర్ రాష్ట్ర రాజధాని డోవర్ లో ఉంటున్న మిత్రులు వెలివోలు శ్యామ్ బాబు ఈ ఏర్పాట్లు చేశారు. ఆ సందర్భంగా రాచకొండ విశ్వనాథ శాస్త్రి అన్నను అక్కడ కలిశాను. రాచకొండ రచనలు కొన్ని ఇంగ్లీషులోకి అనువదిస్తున్నట్లు చెబితే సంతోషించాను. ఆయన డాక్టరుగా రిటైర్ అయ్యి విశాఖపట్టణం వెళ్లిపోయారు.

10 comments:

Anonymous said...

What? You did not take Mr. Hetuwadi premanandam with you to expose all the babas? Also were you very happy that TANA paid for your ticket? What else did you bring from AMERIKA? Digital camera? DVD player? Tape Recorder?

pani lEni maMgali, if you have nothing to post, please DON'T. Why shave the cat?

Anonymous said...

evadandi yee innaiah...yeviti veedi somta dabba...
'journalist' anedi satkaram ata..
veedi sraadham..
veedi pindaakoodau...

Anonymous said...

ayya..first anonymous garu...
innaiah gadini..mangali to polchi mangali paruvu teeyakandi..

veediki journalist puraskaaram ata..naavvu aagaledu...

కొత్త పాళీ said...

Anonymous folks .. please watch your language. You may not like what he writes .. but you can be civil about it.

Anonymous said...

కొత్తపాళి గారు
ఇన్నయ్యగారు (ఏజ్ చూసి గారు అనవలసి వస్తోంది అంతే) నోటికొచ్చినట్టు రాయొచ్చా? ఎవరో విభూది పంచారుట. అంచేత ఏ బాబా అయినా,సివనందగారైనా అంతే అని ఒక్క ముక్కలో తేల్చేసాడు ఈయన. అసలు రిషీకేష్ లో నలభై ఏళ్ళు నివశించిన శివానంద గారి గురించి నోరు విప్పాలంటే అర్హత అనేది ఉండాలి.

రోజూ బిచ్చం ఎత్తుకుని జీవించిన షిర్డీ బాబా గురించి ఏమీ తెలియకుండానే అందరూ ఇంతే అని ఆయన అనొచ్చా? ఆయన రాసేవి ఎంతవరకూ సివిల్ గా ఉన్నాయి? ఎప్పుడైనా ఇలాగే జరుగుతుంది. మీరు అవతలవాళ్ళమీద దుమ్ము పోస్తే వెనక్కు వచ్చేది దుమ్మే. వెనక్కి పన్నీరు ఆశించకండి.

అదీగాక ప్రతీదానికి హేతువాదం దానికో వెధవ ప్రేమానందం కధ ఒకటి. మతం అనేది, భక్తి అనే వాటిలో ఎవరి స్వతంత్రం వారికుంటుంది. అమెరికాకి వలస వచ్చినవాళ్ళు ఎందుకొచ్చారో సిటిజెన్ షిప్ టెస్ట్ లో చూసి ఉంటారు కదా మీరు. For what freedom did the pilgrims migrate to America?

నోటికొచ్చినట్టు ఈయన వ్రాసుకుంటూ పోతే చేతులు కట్టుకుని కూర్చునేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు.

If he wrote about his experiences with patrikeyulu, great, about his life, great but about religion that he does not follow? About someone he does not know? About someone he did not even see (Shirdi baba for example).

Why cannot he just SHUT UP?

Anonymous said...

అమ్మయ్య నాకు తృప్తిగా ఉంది.బ్లాగ్ మిత్రులు ఇన్నిగాడిని కసితీరా తిట్టినందుకు. ఈ ఆనందం పట్టలేక పోతున్నా బాబోయ్. ఈ చీడపురుగు జీవితం మీద ఆ దేవుడికి ఎప్పుడు విరక్తి కలుగుతుందో?

చిన్నమయ్య said...

ఎనానిమస్సు గారూ, మీ వ్యాఖ్యలు చూసి రాయకుండా వుండలేకపోతున్నాను. నేనూ, ఇన్నయ్యగారితో ఏకీభవించను. ఆయన ఒక గీత గీసినప్పుడేకదా, మీరు చదివే "గీత" పొడుగో, పొట్టో తెలిసేది. వీరి రాతల వల్ల, మీ నమ్మకం సడలిపోతుందేమోనన్న బెంగే కారణమయితే, ముందు మీ నమ్మకాన్ని పరిపుష్టం చేసుకోండి. ఆయన బహిరంగంగా నోరు జారుతున్నారని, ఆక్షేపిస్తూ, మీరూ అదే పని ముసుగేసుకుని చేస్తున్నారు. విభేదించండి. కానీ ధైర్యంగా, ముందుకొచ్చి చెయ్యండి. చాటుమాటుగా నుంచుని రాళ్లెయ్యడమెందుకు? వారికి తగిలిందని భ్రమపడి గెంతులెందుకు?

Anonymous said...

cinnamayya
See the following The Great Innammayya posted..
------------
తానా సభలు, ఆటా సభలు కొన్నాళ్లు పోటీపడి నిర్వహించిన తరువాత రాజీపడి సభలు పెట్టుకుంటున్నారు. అయితే జాతరలు, కొలుపులు తలపించే రీతిలో ఇవి జరుగుతున్నాయి. అంతకుమించి ఆట్టే నిర్మాణాత్మకమైన ప్రయోజనం కనిపించడం లేదు.
--------------
At least for inviting him to USA he does not acknowledge thanks. Rather he says the above. A stray dog that eats out of your hand always shows gratitude but this innamayya is worse.

TANA and ATA guys spend thousands of dollars and man power and time to do these meetings and this stupid fellow comes from India at THE EXPENSE of TANA/ATA and says that these meetings are useless!

Did anyone ask him the purpose of these meetings? What a moron! Age did not make him any wise, it seems. All these NRIs with MD, Ph.D degrees have no brains? So this idiot makes such a comment after eating out of their hands! What nincompoop $#@!%#

Anonymous said...

Anonymous garu,
Mr. Innaiah has every right to express his view on any organization. He didn't use any words like the way you used. It seems you are very well educated and how can you use words like fellow, moron etc., From this I understood that whereever you go and how much educated you are people core behavior will not change.
If some of these NRIs with MD, Ph.D degrees have brains what is happening right now in TANA will be prevented begining itself.

Naga said...

అనానిమస్సులు(లు?)

సొంత పేరు, బ్లాగు పెట్టుకొని రాసుంటే అప్పుడు ఒప్పుకోవచ్చు, లేకపోతే మీ వ్యాఖ్యలు దోమ కాటు కంటే గొప్ప గౌరవాన్ని పొందలేవు.