Thursday, July 31, 2008
ఏసుక్రీస్తు మహిమలు
మహత్తుల పేరిట జనాన్ని ఆకర్షించడం హిందువుల సొత్తు మాత్రమే కాదు. అన్ని మతాల్లోనూ యివి కొద్దో గొప్పో వున్నాయి. క్రైస్తవులలో కొన్ని శాఖలు మహిమలను ఖండిస్తాయి. మరికొన్ని తటస్థ వైఖరితో వున్నాయి. కేథలిక్ లు, ఎవాంజలిక్ లు, మరికొందరు మహత్తులున్నాయంటారు. బైబిల్లో మహిమల ప్రస్తావన వుంది.
ప్రపంచంలో క్రైస్తవ మహిమలు జరగడం, వాటిని పోప్ గుర్తించడం ఒక చరిత్రగా కొన్ని వందల సంవత్సరాల నుండీ జరుగుతున్నది. మేరీమాత విగ్రహం కన్నీళ్ళు పెట్టడం, క్రీస్తు సమాధిపై కప్పిన బట్టపై క్రీస్తు ముద్ర పడిందనడం, ఆఫ్రికాలో ఎడారి ఇసుకలో క్రీస్తు పాదాల ఆనవాళ్లు వున్నాయనడం వింతగా చెబుతారు.
క్రైస్తవ మఠాధిపతులు, ఫాదరీలు అప్పుడప్పుడు కొన్ని మహిమలు చేసి ప్రచారంలోకి తెస్తుంటారు. హేతువాదులు జేమ్స్ రాండి, ప్రేమానంద్ యిలాంటివి బయటపెట్టారు. క్రైస్తవమత ప్రచారకులు అత్యంత అధునాతన టి.వి. రేడియో మొదలైన ప్రసార సాధనాలు వాడుతున్నారు.
దేవాలయంలో కొవ్వొత్తిని ఫాస్ఫరస్ ద్రావణంలో ముంచి నిలబెడతారు. ద్రావకం తడి వున్నంత సేపూ ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత తడి ఆరగానే కొవ్వొత్తి అంటుకుంటుంది. అదొక గొప్ప క్రీస్తు మహిమగా చూపుతారు.
మరో కొవ్వొత్తి స్టాండులో కొవ్వొత్తి క్రోమిక్ యాసిడ్ స్ఫటికాలు వేయాలి. ఇంకో కొవ్వొత్తిని ఆల్కహాలులో ముంచాలి. ఆల్కహాలులో ముంచిన కొవ్వొత్తిలో క్రొమిక్ యాసిడ్ స్ఫటికాలున్న కొవ్వొత్తిని తాకిస్తే రెండూ వెలుగుతాయి.
అప్పుడు కూడా ప్రార్థనలు చేసి ఏసు మహిమగా చెబితే పరీక్ష చేయకుండా నమ్మే భక్తులు నమ్ముతారు.
మదర్ తెరీసా పేరిట మోసపూరిత అద్బుతాలు చూపి ఆమెను సెయింటు చేసి మత వ్యాపారం చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
Sir,
Could you please explain about Catholics, protestants and Evangelists ?
Thanks
మహిమలు చూపితేనే మతాన్ని నమ్మే భక్తుల కోసం ఈ తంతుజరపడం ప్రతి మతానికీ సాధారణం. బాబా గాలిలోంచీ భూడిదని,పండ్లనీ,లింగాల్నీ ఇవ్వడం మనకందరికీ తెలిసిందే.అక్కడ మ్యాజిక్కైతే ఇక్కడ సైన్సన్నమాట రెంటికీ పెద్ద తేడాలేదు.
ఇన్నయ్యగారు,
తన పేరిట మహిమలు జరిగినా జరగకపోయినా మదర్ తెరెసా గొప్పదనానికేమీ ఢోకా లేదు. సంప్రదాయకంగా వాటికన్ వారు ఆమెకి సెయింట్‌హుడ్ ప్రదానం చేయటానికి మహిమల అవసరం ఉన్నందున వాటిని 'సృష్టించే' ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది నిజం. ఆమెవంటి వ్యక్తులు నేటి స్వార్ధపూరిత సమాజానికి ఎంతో అవసరం. ఆమె గొప్పదనానికి పునీత పట్టా ద్వారా మరింత ప్రాచుర్యం లభిస్తుందంటే, ఆ పట్టా సాధన కోసం మీవంటి హేతువాదులకి అంతుపట్టని విధానాలు అవలంబించినా నష్టం లేదని నా అభిప్రాయం. అసలు మదర్ తెరెసానే ఒక అద్భుతం. కుష్టువారి పుండ్లలో చేతులు పెట్టి కడిగేంత కరుణ మనలో ఎందరికుంది? అటువంటి వారిని గౌరవించే ఏ ప్రయత్నాన్నయినా హేతువాదం పేరుతో విమర్శించటం తగదు.
మహిమల వంటివాటిని నేనూ నమ్మను. అయినంత మాత్రాన వాటిని నమ్మేవారందరూ వెధవలనుకోవటం మన మూర్ఖత్వమే.
నాకు వీటి గురించి వివరించాలని వున్నా
ఎటు మొదలుపెట్టి ఎలా చెప్పాలో తెలియక వదిలేస్తున్నా, చెప్పటానికి ఇప్పటినుండి ప్రయత్నం మొదలుపెడతా
జాన్ హైడ్ కనుమూరి గారు,
బాగా చెప్పారు!
మదర్ తెరీ సా గురించి నా ప్రపంచం లొ రాసిన వాస్తవాలు గమనించండి. తప్పులు రాస్తే విమర్శ చేయండి.వాస్తవాలపై ఎలా స్పందిస్తారో మీ కు వదిలేస్తున్నాను.
innah sir,
intresting
అబ్రకదబ్ర,
మదర్ తెరెసా మీద ఇన్నయ్య గారు రాసిన టపా చదివారా?
మనం ఈ భూమ్మీద నడవటం, నేనిక్కడ రాసింది మీరు చదవటం అన్నవి చాలా పెద్ద అద్భుతాలు.
ఏసు తన పెళ్ళిలో నీళ్ళను వైనుగా మార్చడం వంటివి వీటితో పోలిస్తే చిన్న అద్భుతాలు...
మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నా మెదడుకు ఎక్కడం లేదు!
Post a Comment