Tuesday, September 9, 2008

చిట్కాలతో సంతానం

నీవు బాబా కావచ్చు! (మాతకూడా!)
గిట్టుబాటు వ్యాపారమే
.



పిల్లలు పుట్టనివారికి మానసిక బలహీనత వుంటుంది. ఎలాగైనా సరే సంతానం పొందాలి. ఆ బలహీనతను ఆసరాగా తీసుకొని ఇరుగుపొరుగు వారు సలహాలు చెబుతుంటారు. మొక్కుబడులు చేయిస్తుంటారు. గుడులకు పంపిస్తుంటారు. అంతటితో ఆగక, బాబాలకు, మాతలకు పరిచయం చేస్తుంటారు. సంతానం కలిగిస్తామని చెప్పే బాబాలు అనేక చిట్కాలు చేయిస్తారు. ధనాన్ని వివిధ రూపాలుగా రాబడతారు. కొందరు ఇళ్ళలో తిష్టవేసి ఏవేవో పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, క్రతువులు చేయిస్తారు. ఆ విధంగా ఖర్చుపెట్టి ఆరిపోయిన వారున్నారు. అయితే సంతాన ఆశ వారిచేత ఏ పనైనా చేయిస్తుంది. ఎంతకూ తమ ఖర్మ అనుకుంటారే గాని, చేస్తున్న పనులకూ, సంతాన ప్రాప్తికీ సంబంధం లేదని గ్రహించరు.
ఒక స్వామి సంతానప్రాప్తి పరీక్షగా పాత్రలో బియ్యం పోసి, కత్తి అందులో దింపి, కత్తితో పైకెత్తినప్పుడు పాత్ర పైకిలేస్తే, సంతానప్రాప్తి కలుగుతుందనీ, లేకుంటే లేదనీ చెబుతాడు. హేతువాది ప్రేమానంద్ కొన్ని వేల పర్యాయాలు ఈ చిట్కా వేసి చూపెట్టాడు. దీనికి సంతానానికి ఎలాంటి కార్యకారణ సంబంధం లేదని స్పష్టం చేశాడు.
అడుగుభాగం వెడల్పుగానూ, మూతివద్ద సన్నంగానూ వుండే పాత్ర తీసుకోండి. అందులో బియ్యం నింపి, ఒక నిడువైన కత్తితో పొడుస్తూ వుండండి. బియ్యం పాత్ర అడుగున బాగా బిగుసుకు పోయినప్పుడు కత్తిని అడుగువరకూ దింపి, పిడి పట్టుకొని పైకి ఎత్తితే బియ్యం పాత్ర పైకి లేస్తుంది. బియ్యం బాగా బిగుసుకుపోవడం యిక్కడ ముఖ్యం. అలా జరిగిన తరువాత కత్తిని దింపితే, గట్టిగా పట్టుకుంటుంది. దీనికీ సంతానానికీ ముడి పెట్టడం

.

2 comments:

krishna rao jallipalli said...

చాలా చాలా మంచి విషయాలు రాస్తున్నారు. ఇలాగే continue చేయండి. ఒక్కోసారి అనిపిస్తుంది.. ఇన్నయ్య గారు ఇంత చక్కగా, విడమర్చి రాసినా... ఇంకా.. వరుణ యాగం చేయడం వలెనే వర్షాలు పడుతున్నాయని .. ఆ యాగాలను చేయడం.. సిగ్గు సిగ్గు.

Kathi Mahesh Kumar said...

రావి చెట్టుని కౌగిలించుకుంటే,కొమ్మకు ఉయ్యాలకడితేకూడా పిల్లలు కలిగే అవకాశాలు మెండుగా వున్నాయండీ గురువుగారూ! రాబొయేకాలంలో మగాళ్ళు ఈ తంతుకు అవసరమే లేదు. చిట్కాలతో పనికానించెయ్యొచ్చు.