Wednesday, September 17, 2008

సమాధిలో యోగులు

కారేశ్వరి బాబా సజీవ సమాధి అవుతారని ఢిల్లీలో వార్త ప్రాకింది. ఇంకేముంది? భక్తులు ఆఫీసులకు సెలవు పెట్టి వచ్చేశారు. బాబా గుడ్డి, చెవిటి, మూగవాడు. ఆ విషయం తెలిసి ఆయనపై యింకా ఆసక్తి పెరిగింది.
10 అడుగుల లోతు 2.5 అడుగల చతురస్రపు సమాధి తయారు చేశారు. సిమెంటు చేసిన సమాధిలో కారేశ్వరి బాబా ప్రవేశించారు. అది 1980 అక్టోబరు మాసం.
సమాధిలో ప్రవేశించడం కళ్ళారా చూచిన భక్తులు, చుట్టూ చేరి భజనలు చేశారు. 24 గంటల అనంతరం సమాధి తెరిచి చూచారు.
ఆశ్చర్యపోవాల్సిన భక్తులు నోరు నొక్కుకున్నారు. కారేశ్వరి బాబాను పురుగులు తింటున్నాయి. ఆయన చనిపోయాడు.
ఏం జరిగింది? మహత్తు ఏమైంది?
హేతువాది ప్రేమానంద్ భక్తులకు వివరించారు. సిమెంట్ చేయని సమాధి అయితే నేలలోని రంధ్రాల ద్వారా ప్రాణవాయువు వస్తుంటుంది. అందు వలన 24 గంటలు వుండగలరు. సిమెంట్ చేసిన సమాధిలో కారేశ్వరి బాబా నిమిత్తం ప్రత్యేకంగా ఆక్సిజన్ వచ్చేట్లు ఏర్పాటు చేశారు. అయినా ఎందుకు చనిపోయాడు? గాలి బయటకు పోవడానికి ఏర్పాట్లు చేయలేదు. వత్తిడి పెరిగినందున కారేశ్వరి బాబా చనిపోయాడు.
పైలట్ బాబా అనే అతడు కూడా జీవసమాధి అవుతానని చాలాసార్లు ప్రకటించాడు. కాని సాహసించలేకపోయాడు.

2 comments:

Naga said...

మీరు మరీనూ. పురుగులు తినకపోతే దేవతలు తింటాయా ఏమిటి? ఆక్సిజను వెళ్ళేందుకు ఏర్పాటు చేయడం వల్ల లాభం ఏమిటో నాకు అసలు అర్థం కావడం లేదు - తిండి, బాత్రూము వంటివి ఏర్పాటు చేస్తే అప్పుడు నోర్లు, గొంతులు నొక్కుకోవాలి.

కారేశ్వరి బాబా గారి శరీరాన్ని పురుగులు తింటున్నాయి కానీ, బాబా గారిని కాదు! ఈ రెంటికి తేడాను ఏమిటో గమనించగలరు.

Anonymous said...

హేతువాది ప్రేమానంద గారికి జయ హో!
ఆయనకి 'మీ లాంటీ' పెద్దలంతా కల్సి గుడి కట్టించడానికి మా ఎన్నారైలందరూ కోట్ల రూపాయల్తో రడీ గా ఉన్నాము. వెంటనే ఈ డబ్బులు మీకు పంపిస్తాము. బేంక్ అక్కౌంటూ అవి చెప్పండి.

పనిలో పనిగా షిర్డి సాయి నీళ్ళతో దీపాలు ఎలాగ పెట్టారో కౄష్ణుడు ఒకేరాత్రి పదహారువేలమంది గోపికలతో గడిపాడో కాస్త ప్రేమానందంగారు వివరిస్తారా? అప్పట్లో వయాగ్రా ఉండేదా? ఉన్నా ఒకే రాత్రి పదహారువేల టాబ్లెట్లు మింగి కౄష్ణుడు ఎలా నిభాయించుకున్నాడో మీ ప్రేమానందంగారికి బాగా తెల్సి ఉండొచ్చు.

ఎవరర్రా అక్కడా, చెప్పండి అందరూ కల్సి... జయ హో, జయ హో, జయ జయ జయహో ప్రేమానందంగారూ..