Wednesday, September 17, 2008

నాడి కొట్టుకోకుండా ఆపగలరా?








బ్రతికినంత కాలం నాడి కొట్టుకుంటుంది. నాడి ఆగడం అంటే చనిపోవడమే. కాని సిద్ధులు తమ తపస్సు వలన, శక్తిని సాధించి, నాడి సైతం ఆపగలరని ప్రచారంలో వుంది. భక్తులు యిది కళ్ళారా చూచినపుడు నమ్మక చేసేదేముంటుంది.
వూళ్ళోకి వచ్చిన స్వాములవారు ఇంకోరోజు డాక్టరును పిలుచుక రమ్మన్నారు. ఆ వేళ ఏమి అద్భుతం జరుగుతుందోనని భక్తులు ఎదురుచూస్తుండగా, నాడి చూడమని స్వామివారు చెయ్యి చాచారు. డాక్టరు పరీక్షించి, సాధారణంగా, నాడి ఆడుతున్నట్లు ప్రకటించారు.
స్వామీజీ యిలోగా ఏవో మంత్రాలు చదివారు. సంస్కృతంలో వున్న ఆ మంత్రాలకు అర్థం తెలియక భక్తులు దండాలు పెట్టుకుంటున్నారు. మళ్ళీ నాడి చూడమని డాక్టర్ కు సైగ చేశారు. ఈసారి చూచిన డాక్టర్ నాడికొట్టుకోవడం లేదని చెప్పాడు. మళ్ళీ చూచారు. సెతస్కోప్ కు నాడీ శబ్దం అందలేదు.
భక్తులు సాష్టాంగపడ్డారు. ఇంకా కొందరు విరాళాలు గుప్పించారు.
హేతువాది ప్రేమానంద్ వచ్చి తానూ నాడి చూస్తానన్నారు. స్వామీజీ చేయి అందించారు. స్వామీజీ రెండు చేతుల్నీ పైకి ఎత్తిన ప్రేమానంద్, చూస్తుండగానే, స్వామీజీ రెండు చంకల నుండి రెండు నిమ్మకాయలు కిందపడడం భక్తులు చూచారు. చంకలో నిమ్మకాయలు గాని చేతి రుమాలు వుండగా చుట్టిగాని పెట్టి గట్టిగా నొక్కితే రక్తప్రవాహం ఆగి నాడి ఆగినట్లు అవుతుంది. హేతువాది వలన స్వామీజీ గుట్టు బయటపడింది గాని లేకుంటే గిట్టుబాటు వ్యాపారమే.

5 comments:

Anonymous said...

హేతువాది ప్రేమానంద గారికి జయ హో!
ఆయనకి 'మీ లాంటీ పెద్దలంతా కల్సి గుడి కట్టించడానికి మా ఎన్నారైలందరూ కోట్ల రూపాయల్తో రడీ గా ఉన్నాము. వెంటనే ఈ డబ్బులు మీకు పంపిస్తాము. బేంక్ అక్కౌంటూ అవి చెప్పండి.

పనిలో పనిగా షిర్డి సాయి నీళ్ళతో దీపాలు ఎలాగ పెట్టారో కౄష్ణుడు ఒకేరాత్రి పదహారువేలమంది గోపికలతో గడిపాడో కాస్త ప్రేమానందంగారు వివరిస్తారా? అప్పట్లో వయాగ్రా ఉండేదా? ఉన్నా ఒకే రాత్రి పదహారువేల టాబ్లెట్లు మింగి కౄష్ణుడు ఎలా నిభాయించుకున్నాడో మీ ప్రేమానందంగారికి బాగా తెల్సి ఉండొచ్చు.

ఎవరర్రా అక్కడా, చెప్పండి అందరూ కల్సి... జయ హో, జయ హో, జయ జయ జయహో ప్రేమానందంగారూ..

Brahmi said...

దొంగ స్వాముల గారడిలు బట్టబయలు చెసి.
జనాల్ని అఙ్ఞాతం నుండి బయటకి లాగుతున్నందుకు ధన్యవాదాలు.

innaiah said...

V R Narla in his critique The Truth about the Gita explained to clarify your doubt about Krishna` s role. Please read it in Telugu in this blog.

innaiah said...

V R Narla in his critique The Truth about the Gita explained to clarify your doubt about Krishna` s role. Please read it in Telugu in this blog.

చిన్నమయ్య said...

ఇన్నయ్య గారూ, ఎవరండీ ఈ ప్రేమానందం, కొమ్మూరి యుగంధరా? ఎక్కడో చదివేను - ఆస్తికులు దేవుణ్ణి నమ్ముకుని బతికితే, నాస్తికులందరూ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బతుకుతుంటారు. ఆస్తికులందరూ, తమ అస్తిత్వ భావనని వెల్లడి చేయరు. కానీ, నాస్తిక మత తీర్థం పుచ్చుకున్న వారందరికీ వెంటనే ఎందుకీ శివాలు?

దొంగ భక్తులూ, నకిలీ సాములోర్లు వున్నట్టే, నకిలీ హేతువాదులూ వుంటారన్నది నిజదూరమేమీ కాదు కదా! వాళ్లగురించీ రాస్తే, మీ బ్లాగులో సమ తూకం వుంటుంది. మీ బోటి పెద్దలు, అటువంటి వారందరూ ఆస్తికులే నని కప్పదాటు వేస్తారు. అదే మాట, ఇటువంటి నకిలీల విషయంలో ఆస్తికులనబోతే మీరొప్పుకుంటారా?

మీరప్పుడప్పుడూ గురిపెట్టే నకిలీ భక్తులూ, సాములోర్లు దైవ తత్త్వం తెలియని వారూ, ఆస్తిక జనం లో దిగువ మెట్టులో వారు. స్వామీ చిన్మయానందగారన్నట్టు, నాస్తికులంటూ ఎవరూ వుండరు. "లేడు" అని మొదలుబెట్టీ, క్రమ క్రమంగా "అస్తి" అని తెలుసుకోగలుగుతారు. గణిత శాస్త్రంలోనూ ఇది ఒక ఆమోదయోగ్యమైన నిరూపణా విధానమే! ఒక సూత్రాన్ని "తప్పు" అని మొదలుబెట్టీ, చివరికి ఒప్పని తేల్చడం.

"లేడ్లేడు" అనడంలో, లెర్నింగు కర్వు (విద్యా రేఖ అనొచ్చా!) క్షితిజ సమాంతరంగానో, అధో ముఖంగానో వున్నట్టనిపిస్తుందే గానీ, ఎదుగుదల కానరాదు. సినిమాకి టిక్కెట్టు కొనుక్కుని, ఆటయిపోయేవరకూ బయటే తిరుగాడిన తంతులాంటిది ఇది.

ఎందుకీ, అస్తి, నాస్తుల గొడవ? నాస్తిలోనూ అస్తే గదా వుంది.