సత్సంగ మండలిలో
సత్సంగ మండలి వారు నన్నూ, ఒక అమెరికన్ స్నేహితుడిని అంబాలాకు ఆహ్వానించారు. కంటోన్మెట్ ఉన్న ఒక సంపన్న నగరం అది. భాష సంస్కృతి అంతా పంజాబీయం. హిందీ మాట్లాడే ఉత్తర ప్రదేశ్ వారున్నారు. దేశవిభజన అనంతరం ఉత్తరాదిలోని పశ్చిమ ప్రాంత నగరాలన్నీ సిక్కులమయం అయిపోయినాయి. పంజాబీలు డబ్బు సంపాదిస్తారు. ఖర్చు పెడతారు. సుష్టుగా భోంచేస్తారు. పళ్ళరసం త్రాగుతారు. పంజాబీలోని ఆంబోతులు, ఆవులు చాలా పెద్దవి, పంజాబీ స్ర్తీలు చురుకుగా ఉంటారు. మంచి దుస్తులు వేసుకుని, విందంటే ఇష్టపడుతుంటారు. పంజాబీలకు ఆలోచన తక్కువ. సత్సంగ మండలిని ఒక సి.ఐ.డి. పోలీస్ స్థాపించాడు. విశాలమైన అతడి గృహాన్ని మందిరంగా మార్చివేశాడు. ప్రతిరోజూ ఉదయం జరిగే సమావేశాలకు జనం వస్తుంటారు. సంపన్న వర్తకులు ఎందరో చేరారు. సుప్రసిద్ధ సన్యాసులను, తదితరులను ఆహ్వానిస్తుంటారు.
స్టేషన్ లో మేళతాళాలతో స్వాగతం చెప్పారు. పూలదండలతో ముంచెత్తారు. పాదాలుతాకి అభివాదం చేశారు. టాపులేని గుర్రపు బగ్గీని ఎక్కించారు. ఊరేగింపుగా వీధులఅలో తీసుకెళ్ళారు.
సమావేశం ఏడు గంటలకు, ఈ లోగా మమ్మల్ని విశ్రాంతి తీసుకోమన్నారు. స్థానిక పండితులు, సన్యాసులు, ఉపన్యాసాలు ఇచ్చారు. తరువాత మేము వేదిక మీదికి వెళ్ళాము. మా గౌరవార్థం బాలికలు పంజాబీ పాటలను ఆలపించారు. తరువాత నన్ను పరిచయం చేశారు.
నేను మామూలు మాటలు చెపుదామనుకుని ఏకత్వాన్ని గురించి సాంకేతికంగా ఒక గంటసేపు ప్రసంగించాను. బ్రాహ్మణతత్వం విలువ తగ్గించకుండా జనంలోకి తీసుకెళ్లవచ్చని నా ఉద్దేశం.
వేదాంతంలోని తార్కిక లోపాలు నాకు తెలుసు. విశ్లేషణాత్మకంగా మత ప్రతిపాదనలను పరిశీలించడం కూడా అభినందనీయమే.
స్వామి హరిగిరితో
స్వామి హరిగిరి పంజాబి హిందూ సాధువు. కాంగ్రెసు పార్టీ సభ్యుడు. పంజాబులోని హిమాలయ పర్వత ప్రాంతంలో మఠాధిపతిగా ఉంటున్నాడు. స్వంతంగా తయారు చేసుకున్న కాషాయ టోపీని పెట్టుకుంటాడు.
ఉన్న సంస్కృతికి దక్షిణాది ప్రతీక. దక్షిణాది భాషలను నేను నేర్చుకోలేదు. ఉత్తరాది సంగీతాన్ని అధ్యయనం చేసినప్పటికి, నాకు దక్షిణాది సంగీతం ఇష్టం. దక్షిణాదిలో కొందరు భక్తి కవులు సంప్రదాయ మార్మికవాదంలో ఇంద్రియ ప్రేరణతో కూడిన భాషను వాడారు. దక్షిణాది సంగీతం విన్నప్పుడు, నా చికాకులన్నీ ప్రక్కకు పెట్టేవాడిని.
త్రివేండ్రంలో తిరువాన్ పూర్ మహారాజాను కలిశాను. దక్షిణ మలబార్లో పాల్ ఘాట్ వద్ద గాంధీ ఆశ్రమంలో కొన్ని వారాలపాటు గడిపాను.
కన్యాకుమారి వెళ్ళాను. నా వెంట అచ్చుతన్, అతని భార్య లక్ష్మి కుట్టియమ్మ వచ్చారు. కన్యాకుమారి విగ్రహం చాల అందంగా కనిపిస్తుంది. విగ్రహానికి సమీపంలో రాత్రింబవళ్ళు కూర్చుని క్రతువులన్నీ తిలకించాను. నంబూద్రి పురోహితుడొక్కడే ఆ దేవత దగ్గరకు రావచ్చు. మిగిలిన సన్యాసులు, బ్రాహ్మణులు బయటకూర్చుని చిన్నగేటు ద్వారా విగ్రహాన్ని తిలకిస్తారు. పురోహితుడు పాలు, రోజూనీరు, నెయ్యి, మరి కొన్ని విలువేన పదార్థాలతొ విగ్రహాన్ని నిమురుతూ స్నానం చేయిస్తారు. దీని వెనుకనున్న మనస్తత్వాన్ని అధ్యయనం చేయాలంటే ఫ్రాయిడ్ గాక, యాంగ్ పనికొస్తాడు. ప్రతి సంవత్సరం ఒక వారం పాటు నేను ఇక్కడికి వచ్చి గడిపేవాడిని.
కాలడి ఆశ్రమంలో
కాలడి ఒక చిన్న గ్రామం. శంకరాచార్యుడు అక్కడే పుట్టాడు. హిందూమతంలో అతను అత్యున్నత పండితుడు. కాలడికి వరుసగా రెండేళ్ళు వచ్చాను. ఈసారి రామకృష్ణ మిషన్ కేంద్రంలో స్వామీ ఆగమానంద అతిథిగా ఉన్నాను. స్వామి ఆగమానంద తాత్విక సంస్కృతంలో గట్టి పండితుడు. చక్కని ఇంగ్లీషు మాట్లాడుతాడు. ఆయనంటే చుట్టుపట్ల ఉన్న క్రైస్తవులకు భయం.
అతని దృష్టిలో రామకృష్ణ శంకరాచార్య ఒకే సంప్రదాయంలో ద్రష్టలు. శంకరాచార్య చెప్పినదాన్ని రామకృష్ణుడు అవతారంగా పరిపూర్తి చేశాడు. 1200 సంవత్సరాల ఎడంలో పుట్టినప్పటికి, శంకరాచార్య, రామకృష్ణ ఒకేరోజున పుట్టారు. వీరిద్దరి మధ్య మౌలికంగా తేడా లేదంటారు. ఆగమానంద దృష్టిలోని మౌలిక బోధనలన్నీ ఒకటే. శంకరాచార్యుడు కేవలం నిరీశ్వరవాది. అత్యున్నత గతితార్కి బోధకుడు. రామకృష్ణుడు భక్తిని ప్రచారం చేశాడు. మేధస్సుకు వ్యతిరేకి. బహు ప్రాచుర్యం సంపాదించినవాడు. ఇద్దరికీ చాలా తేడా వున్నది.
రామకృష్ణ శంకరాచార్యుల జన్మదినోత్సవ సందర్భంగా నేను బ్రహ్మచారిగా రామకృష్ణ ఆశ్రమంలో చేరినప్పటి స్వాములను కలుసుకొని ఆనందించాను. నేను బొంబాయికి తొలుత వచ్చినప్పుడు నాకు ఆతిధ్యం ఇచ్చిన స్వామి శంభూనంద కాలడి గౌరవ అతిథిగా వచ్చారు. అక్కడ తొలుత నేను ప్రసంగించాను. ఆగమానంద అడిగినట్లుగా శంకరాచార్య-రామకృష్ణను పోల్చాను. ఇరువురూ ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నులైనారని, శక్తివంతమైన వ్యక్తిగతం గలవారని, హందూ సంప్రదాయానికి విధేయులని అన్నాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment