Sunday, November 25, 2007

Agehananda 18

తాంత్రిక అనుభవాలు
ఇంద్రియాలను అణచివేయటం కాక, జీవితంలో ఉన్నత దశకు వాటిని మలచుకోవడం, తాంత్రిక విద్యలో సంప్రదాయం, తంత్రాలను గురించి హిందూ, బౌద్ధ సాహిత్యం చాల ఉన్నది.
ఇదొక ప్రత్యేకమైన యోగవిద్య, తాంత్రిక గ్రంథాలు వేదాలతో సమానమని చెప్పినందు వలన బ్రాహ్మణ పండితులు వాటిని అనుమానాస్పదంగా చూస్తారు.
ఇండియాలో గత వైభవాన్ని, సౌందర్యాన్ని దేవాలయాలలో, శిల్పాలలో చూడవచ్చు. క్రైస్తవ పాక్షిక దృష్టి లేకుండా వచ్చే విదేశీ యాత్రికులు, భారత కళా ప్రియుల ఈ సంప్రదాయాలను అభినందిస్తారు. ఇండియాలో దేవాలయాలపై కామ శిల్పాలు పుష్కలంగా ఉన్నవి.
1910 తరువాత నిర్మించిన దేవాలయాలలో కామరూపం కనిపించదు. న్యూఢిల్లీలో బిర్లా మందిరంలో శివలింగస్థానే శివుని విగ్రహాన్ని పెట్టారు. మత సంప్రదాయరీత్యా లింగరూపేణా తప్ప, అన్యథా శివుడిని పూజించడం నిషిద్ధం. లింగం అంటేనే శివుడు.
ఒక సమావేశంలో 35 ఏళ్ళ ప్రాయంగల కాషాయవస్ర్త ధారిణిని కలుసుకున్నాను. ఆవిడ పులిచర్మం కప్పుకున్నది. మెడలో రుద్రాక్షమాల ఉన్నది. శక్తి చిహ్నం ధరించింది. తొలుత ఎవరామె? అని అడిగాను. సిద్ధిమాత తెలియదా అని నా పక్కనున్నాయన ఆశ్చర్యపోతూ చూశాడు. సన్యాసినులలో ఆథ్యాత్మికంగా బాగా పేరు మోసిన విదుషీమణి సిద్ధిమాత. ఉత్తరాదిలో ఆమె సుపరిచితురాలు. మురాదాబాద్ కు ఉత్తరాన 60 మైళ్ళ దూరంలో జన్మించిన రాజేశ్వరి 7 సంవత్సరాలకే మార్మిక ధోరణి చేపట్టింది. ఉత్తర ప్రదేశ్ లో ఆమె తండ్రి రాజా కూతురిని చూచి గర్వించాడు. చింతించాడు 12 ఏళ్ళ వయస్సులోనే తండ్రి కొలువులో పండితులతో వివాదాలను ఆమె చర్చించిందంటారు. ఏమీ చదువకుండానే తాత్విక సిద్ధాంత సుక్ష్మాలను విడమరుస్తూ పూర్వజన్మను గుర్తు పెట్టుకోగల ఇలాంటి వారిని జాతిస్మరులు అంటారు. ఈమెను 13వ ఏట ఒక యువరాజును ఎంపిక చేశారు. పెళ్ళికుమారుడు దేహమంతా ఆభరణాలు ధరించి, పెళ్ళినాడు గుర్రంపై రాగా పెళ్ళి కుమార్తె అదృశ్యమైంది. పోలీసులతో సహా ఎవరెంత వెదికినా కనిపించలేదు.
12 సంవత్సరాల తరువాత నేపాల్ సరిహద్దులలో ఆల్మోరాలో ఒక అందమైన సన్యాసిని కనిపించింది. ఆమె ఎవరితోనూ మాట్లాడలేదు. పదేళ్ళ పాటు మౌనంగా ఉంటానని ప్రతిన పూనింది. అడవిలో పులులను ధిక్కరిస్తూ, కంద మూలాదులపై ఆధారపడి, చెట్లకింద నిద్రిస్తూ, చెట్టు బొరడును దుస్తులుగా ధరించి సంచరించినట్లు చూచినవారు చెబుతారు. కుంభమేళా సందర్భంగా హరిద్వార్ లో ఆమె మౌనాన్ని వదిలి బయటికి వచ్చింది. ఆమె పాండిత్యానికి ఆధ్యాత్మిక శక్తులకూ, అందానికి పేరు మోసినది.
సమావేశంలో నా తరువాత సిద్ధిమాత ప్రసంగించారు. ఆమె మృధువుగా మాట్లాడారు. సమావేశం చాలా నిశ్శబ్దంగా ఉంది.
సిద్ధిమాత ఉత్తరకాశీ, గంగోత్రి ప్రాంతాలలో ఏటా కొన్ని వారాలపాటు గడుపుతారు. పండిత సాధువులు, సన్యాసులు గౌరవిస్తారు. ఆమె వచ్చే వరకు వేచి వుంటారు. తరువాత ఆమెతోపాటు అందరూ భోజనం చేస్తారు. ఈ విధంగా వేదాంత సాధువులు తమ సంప్రదాయం కాని రీతులను గౌరవిస్తూన్నారు. ఆది శంకరాచార్యులు సహితం శక్తిని పూజించారు. ఆమెను శ్లాఘిస్తూ గానం చేశారు.

బౌద్ధం
నేను నలందాలో ఉండగా, ఇండియా ఎగుమతి చేసే ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి ఏర్పడింది. క్రైస్తవ మతం వలె బౌద్దం కూడా పుట్టిన దేశంలో బ్రతకలేక ఎగుమతి అయింది. మధ్య యుగాలలో 400 సంవత్సరాలపాటు సుప్రసిద్ధ బౌద్ధ అకాడమీగా నలందా పేరు మోసింది. టిబెట్, చైనా, మంగోలియా, మధ్య ఆసియాల నుండి సాధువులు, పండితులు నలందాకు వచ్చి సంస్కృతం, పాళిభాషలు నేర్చారు. బౌద్ధ సంప్రదాయం, తత్వం అధ్యయనం చేశారు. పవిత్ర సాహిత్యాన్ని తమ దేశానికి తీసుకెళ్ళారు. అప్పుడే టిబెట్, చైనా, కుచాన్, సోగ్ డియెన్ మొదలైన భాషల్లోకి పవిత్ర గ్రంథాలు అనువదించారు. నలందా నుండి ఆసియా అంటికి విజ్ఞాన ప్రసాదం జరిగింది. టిబెట్లో లామాలను, ఢిల్లీ, కలకత్తా, లండన్, న్యూయార్క్ గురించి వన్నావా అని అడిగితే తలియదంటారు. కాని నలందాను గురించి వారు విన్నారు. పాండిత్యానికి, పవిత్రతకు నలంతా వారికి పెట్టింది పేరు. నలందాలో తాంత్రిక విద్యను పాటించి ఉంటారు. 5 వేల మంది సన్యాసులను చంపేసిన ఖిల్జీ చాలా పుస్తకాలను తగులబెట్టించాడు. అంతకు ముందే నాలుగు శతాబ్దాల పాటు వందలాది గ్రంథాలు టిబెట్, చైనాలకు వెళ్ళాయి. అక్కడ ఆ భాషల్లోకి అనువాదం అయ్యాయి. టిబెట్ మఠాలలో సంస్కృత గ్రంథాలు కొన్నిటిని భద్రపరిచారు.
నన్ను నలందాకు ఆహ్వానించారు. నలందాను బీహార్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయంతో కొత్తగా నిర్మించింది. అక్కడ కొన్ని మాసాల పాటు నేను బోధించాను. టిబెటన్ అధ్యయనం ప్రారంభించాను. ప్రొఫెసర్ కాజియామా జపాన్ నుండి వచ్చిన పండితుడు. ఆయన జపాన్లో నాకు ఆతిథ్యం ఇచ్చాడు. బౌద్ధ భిక్కు కాశ్యప మహాతేర నన్ను నలందాకు ఆహ్వానించారు. అక్కడ నేను పాళీ సాహిత్యం చదివి బౌద్ధం అధ్యయనం చేశాను.
ఇండియాలో ఒక మతంగా బౌద్ధం ఎందుకు నిలువలేదనే దానికి అనేక కారణాలు చెబుతారు. కులాన్ని తృణీకరించడం ఒక కారణం కాగా, ఆకర్షణ లేని కఠిన నియమాలు అవలంభంచడం మరో కారణమంటారు. బుద్ధుడు చనిపోయిన అనంతరం 300 ఏళ్ళ పాటు బౌద్ధ మఠాలు బాగా వెలిశాయి. 200 సంవత్సరాల పాటు సంపన్నులు, పేదలు, రాజులు, వ్యాపారులు, పండితులు, పామరులు బౌద్ధ భిక్షులు కావడానికి ప్రయత్నించారు. అయితే బౌద్ధం ఏనాడూ హిందూ మతం నుండి పూర్తిగా విడిపోలేదు. హిందూ సంప్రదాయంలో విభిన్న దృక్పథలు వెల్లడి అవుతూనే వచ్చాయి. అందులో బౌద్ధం కూడా ఒకటయింది. బుద్ధుడిని హిందూ దేవుళ్ళలో కలిపేశారు. బుద్ధుడిని అవతారం చేశారు. బుద్ధుడు వేరే ఏదో బోధించాడని పునరుజ్జీవ హిందువు అంగీకరించడు.
బౌద్ధ బోధనలో మతేతర స్వభావం ఉన్నది బౌద్ధం క్షీణించడానికి అదొక కారణంగా వచ్చు. తరువాత వచ్చిన బౌద్ధం అద్వైత వేదాంతానికి సన్నిహితంగా ఉండే తత్వాన్ని చెప్పింది.
నేను నలందాలో చేరిన రెండు రోజులకే సయామ్ సాధువులు పరిచయమయ్యారు. వారిలో ప్రమహ మానస్ చిత్తదాసు పుంగ్ల మాచియాక్ అనే బౌద్ధ భిక్కు థాయ్ లాండ్ లో బౌద్ధ మఠాథిపతి అయ్యాడు. ఆయన ఎమ్.ఎ. చదివాడు. ఇంగ్లీషు బాగా మాట్లాడతాడు. సయామ్ యువ భిక్కులందరూ చాలా సరదాగా ఉండేవారు. స్ర్తీలను గురించి మాట్లాడినప్పుడు మీరు కలవరపడ్డారు. థాయ్ లాండ్లో స్ర్తీల అందాల పోటీలను గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. థాయ్ లాండ్ స్త్రీలు పాశ్చాత్య దుస్తులు ధరించడం మొదలుపెట్టారు.
కలకత్తా నుండి థాయ్ ఏర్ వేస్ ద్వారా ప్రయాణం సాగించాను. నన్ను చూడగానే నయామీస్ ఏర్ హో స్టెస్ పక్కకు తప్పుకున్నది. సన్యాసులకు దూరంగా ఉండటం వారి ఆచారం. స్ర్తీలకు, సన్యాసుల మధ్య మర్యాదలు కఠినంగా పాటిస్తారు. సన్యాసులకు టీ ఇవ్వదలచినప్పుడు వంగిగాని ఇవ్వరు.
బాంకాక్ చేరే సరికి పొద్దు గూకింది. నవ్వుతూ స్నేహ పాత్రులుగా ఉన్న ప్రజలు కనిపించారు. థాయ్-భారత్ సాంస్కృతిక వసతి గృహ డైరెక్టర్ పండిత రఘునాథ వర్మ నన్ను ఆహ్వానించారు. నేను వారి కేంద్రంలోనే బోధించవలసి ఉంది. అక్కడ పురుష సేవకులంతా హిందువులే. నాకు మాత్రం ఒక 40 ఏళ్ళ సయామీ స్ర్తీని వంటకు గాను అమర్చారు. నా కోసం ఆమె భారతీయ పదార్థాలు చేసినా కుదిరేవి కావు.
సయామ్ ప్రజలు మంచి బౌద్ధులు. బుద్ధుడిని మహోన్నతుని గానూ, అతని బోధనలు అత్యున్నతంగానూ భావిస్తారు. వారిలో సందేహవాదులు లేరు. బౌద్ధమే సందేహవాద మతం, సయామ్ తేరవాదదేశం. మహాయాన దేశాలలో వలె బుద్ధుణ్ని విగ్రహారాదన చేయరు. క్షణికవాదాన్ని వీరు గుర్తిస్తారు. బుద్ధుడి కరుణను మూలసూత్రంగా భావిస్తారు. ఒకసారి ఇద్దరు సయామీ భిక్కులు న్యూఢిల్లీలోని బిర్లామందిర్ లో లక్ష్మీనారాయణ విగ్రహాన్ని చూసి కాషాయ వస్త్రంతో నవ్వు ఆపుకున్నారు. దంపతులు చేరొక ఆనలుగు చేతులతో ఉండగా, గుంపులు గుంపులుగా జనం ఆ విగ్రహాన్ని పూజించడం వారికి వింతగా ఉంది. సయామ్ బౌద్ధంలో వ్యక్తిగత దేవుడుండదు. బుద్ధుడు మానవుడు. మానవుడిలోని ఉన్నత లక్షణాలన్నీ నెలకొన్న బుద్ధుడిని థాయ్ లాండ్ లో ఇళ్లల్లోనూ, గుళ్ళలోనూ పూజిస్తారు. ఈ విషయంలో హిందువులకంటే వీరు చక్కని సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
బాంకాక్ లో రెండు బౌద్ధ మఠాల విశ్వవిద్యాలయాలున్నవి. నలందాలో నేర్చిన వారు మహాచులలాంగ్ కార్స్ అకాడమీ వారు. మరొకటి మహా మాంగ్ కుట్ అనే రాజు స్థాపించిన అకాడమీ. ఇందులో మతాల పోలిక గురించి బోధించాను. నేను ఇంగ్లీషులో చెప్పేవాడిని. మౌలిక విషయాలు సయాం బౌద్ధ భిక్కులకు చెప్పేటప్పుడు ఒక చిక్కు ఎదురైంది. తాత్వికరీత్యా దైవం, ఉనికి, జడపూరిత విశ్వ గురించి వారికి అర్థమయ్యేటట్లు చెప్పటం కష్టమయ్యింది.
బౌద్ధ భిక్కులకు ఉనికి, దైవం గురించి అర్థమయ్యేటట్లు చెప్పగలిగాను. ఇదేదో రుగ్మతతో కూడిన భావన అని తొలిదశలో వారు అనుకునేవారు. బుద్ధుడు చెప్పినట్లుగానే క్షణికానికి వ్యతిరేకమైన విషయాలు సూచించి అంతవరకు వారిని లేని భావాలను విడమర్చి చెప్పాను. బుద్ధుడు తృణీకరించిన దానిని సూచన ప్రాయంగా కూడా అంగీకరించడానికి భౌద్ధ భిక్కులు ఒప్పుకోక పోవడం వలన నేర్చుకోవడంతో వారికి చిక్కులేర్పడినాయి. వారిని మార్చటానికి అలాంటి పద్ధతి తనకు నచ్చదని పదే పదే చెప్పవలసి వచ్చింది. క్రమేణా కొందరు బౌద్ధ భిక్కులు బుద్ధుడు దేవిని వ్యతిరేకిస్తున్నాడో గ్రహించారు. తేరవాద బౌద్ధానికి ఆనాత్మవాదం కీలకం, హిందువు దృష్టిలో అనాత్మ కంటే తాదాత్మ్యం చెందిన బ్రహ్మ అని అర్థం ఇది సయామీ దృష్టిలో వినని విషయం. అనాత్మవాదం అంటే ఆత్మ కానిదనే వారి దృష్టిలో ఇది చాలా సాధారణ విషయం. ఒకే పదజాలాన్ని హిందువులు, సయామీలు ఎలా అర్థం చేసుకుంటారో గ్రహించవచ్చు.
బాంకాక్ లో సింధీ వ్యాపారి వారానికోసారి సత్పంగ సమావేశం జరుపుతాడు. అక్కడ సహజధారి సిక్కులు చేరుతారు. వారు గురునానక్ ను అనుసరించి గురుగ్రంథ సాహెబ్ ను పాటిస్తారు. గడ్డాలు, తలపాగాలు ఉండవు. ఈ గృహాలు, కార్లు, పిల్లలు, సంపద, అంతా వృథా అని ప్రతిసారీ ఆ సంపన్న వ్యపారి చెబుతుంటే సమావేశమైన సంపన్నులు తలలూపుతుంటారు. దైవాన్ని స్మరించడం రాత్రింబగళ్లు ధ్యానం చేయడం, దైవ నామ స్మరణలో లీనంగావటం ఒక్కటే కాలాన్ని వృథా చేయకపోవటమని ఆ వ్యాపారి అన్నాడు.
సయాం ప్రజలు ఇందుకు భిన్నంగా ఉంటారు. వీరు మతాన్ని, నిత్య జీవితాన్ని వేరు చేసి చూస్తారు. పండగల్లోనూ, వారంతంలోనూ, దేవాలయానికి వెళ్తారు. బోధనలు వింటారు. బౌద్ధ ప్రతిమ ముందు సాష్టాంగపడతారు. క్షణికం గురించి తెలుసుకొని నిర్వాణాన్ని గ్రహిస్తారు. కాని దేవాలయం నుండి బయటికి వస్తే వారు హాయిగా కూలాసాగా గడుపుతారు. మతాన్ని వారు తీవ్ర విషయంగా స్వీకరించరు. థాయ్ ప్రజలు ప్రేమను, దయను, చూపుతారు. జీవితంలో ఆహ్లాదాన్ని ఇచ్చే విషయాలను థాయ్ ప్రజలు స్వీకరించారు.

No comments: