Saturday, November 3, 2007

Agehananda-9 సన్యాసి సత్యం పలికితే


గీతకు అటూ ఇటూ
రామకృష్ణ మఠాలలో ప్రాతఃకాల సమావేశాలలో భగవద్గీత నుండి కొన్ని భాగాలను చదివి వినిపిస్తారు. గీతను అనువదించి బహుళ ప్రచారం తెచ్చి పెట్టారు. అందువలన గీత వ్యాఖ్య చిలవలు పలవలైంది. అసలు గీత కలగాపులగం. పైగా పరస్పర విరుద్ధ విషయాలు అనేకం వుండటం వలన దీనికి అంతటి ఖ్యాతి వచ్చింది. ఒకవైపు హింసావాదాన్ని, మరొకవైపు సన్యసత్వాన్ని గీత బోదిస్తుంది. ఏకేశ్వరోపాసనను బోధిస్తూనే మరోవైపు అద్వైతాన్ని ఉపదేశిస్తుంది. గీతలోని ఈ ద్వంద్వ వైఖరిని వివరించడానికి శంకరాచార్యుడు ప్రయత్నించాడు. కాని సఫలం కాలేదు. గీతాచార్యుడు ఈ విషయాన్ని వివరించడంలో ముందు సాధారణంగా ప్రారంభించి క్రమేణా ఉన్నత విషయాలు ప్రస్తావించాడు. నీవు యుద్ధరంగంలో చనిపోతే వీర స్వర్గాన్ని అలంకరిస్తావు. బ్రతికితే ప్రపంచాన్ని పరిపాలిస్తావు. కనుక పోరాడు అని గీతలో వున్న మాటలను సామాన్యుడికి ఉద్దేశించినవైతే, అనుకూలమయినప్పుడల్లా అవే పవిత్ర ప్రవచనాలుగా ఎందుకు బోధిస్తారో అర్థం కాదు. వాస్తవానికి భగవద్గీత ప్రమాణ గ్రంథం కాదు. హిందూ పునరుజ్జీవనంలో ఇది ప్రాముఖ్యతను సంతరించుకున్నది. రాజకీయ వాదులు, ఋషులు, తత్వవేత్తలు, సెక్యులర్ బోధకులు గీతను అనువదిస్తూ భాష్యం చెబుతూ తమ ఇష్టం వచ్చిన రీతిలో అన్వయించుకుంటూ పోయారు. నేటి రాజకీయవాదులు గీతలోని కర్మయోగాన్ని స్వీకరించి, మిగిలిన వాటిని త్రోసివేస్తారు. కొందరు యోగ విషయాలకు ప్రాధాన్యతనిస్తారు. ఇంకొందరు భక్తికి ప్రాధాన్యత ఇస్తారు. ఏమైనా భగవద్గీత సాహిత్య దృష్టిలో ఒక గొప్ప గ్రంథం చక్కని శ్లోకాలలో మహా భారతంలో ఒక భాగంగా గీతరచన సాగింది.

నా కాశీ ప్రయాణం
రామకృష్ణ మిషను నుండి బయటపడి పంజాబ్ మెయిల్లో 7 గంటలు ప్రయాణం చేసి కాశీ చేరుకున్నాను. నేను ఇప్పుడు స్వేచ్ఛాజీవిని. నాకు రామకృష్ణ మఠాలు తప్ప బయటి ప్రపంచంతో పరియచం లేదు. కాశీలో అస్పిఘాట్ వద్ద ఒక ధర్మశాలలో నా మూట పెట్టి నదిలో స్నానం చేశాను. ఈలోగా విశ్వనాధుడికి పూజచేసి, ఆర్ఘ్యపాద్యాలు అర్పించడానికి కమండలం కొందామనుకుంటుండగా ఒక 50 సంవత్సరాల పొడవుపాటి వ్యక్తి వచ్చి మహారాజ్ మీ కమండలం ఇదిగో అని ఇచ్చాడు. చాలా అందంగా ఉంది. దాన్ని చూస్తూ ఆ వ్యక్తికి ధన్యవాదాలు చెబుదామను కుంటుండగా అతడు వెళ్ళిపోయాడు. విశ్వనాథుడి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళాను.
నాకు ఇప్పుడు సన్యసత్వానిచ్చే ఒక సన్యాసి కావాలి. చౌపత్తి దేవాలయం వద్ద దశవామిలో కాషాయ వస్ర్తాలతో సాధువులు కనిపించగా ప్రణాయం చేసి వారిని సమీపించాను. సాదరంగా నన్ను కూర్చోమన్నారు. నా కథ వినిపించాను. మౌనంగా విన్నారు. వారిలో ఒక వృద్ధుడు నెమ్మదిగా ఇలా అన్నాడు. నీ కృషి శ్లాఘనీయమైనది. మా జీవితంలో ఇలాంటి సన్నివేశం చూడలేదు. నెలలో ఐదు వందలు సంపాదిస్తూ జర్మనీలో చక్కని కుటుంబంతో కారులో, షికారులో పయనిస్తూ వుండాల్సింది. అయినా సాధు జీవితాన్ని కోరుకున్నావు. కాని సన్యాసిని కావడానికి వీలులేదు. బ్రాహ్మణులు మాత్రమే అందుకు అర్హులని నీకు తెలుసనుకుంటాను అన్నారు స్వామి సుమేధానంద. అయితే, శూద్రుడైన వివేకానందుడు సన్యాసి కాలేదా? అని అడిగాను.
నిజమే కాని సంస్కారాలున్న వ్యక్తికి సన్యాసం సులభం. కాని నీవు విదేశాల నుండి వచ్చావు. దశవామిలో ఎవరూ నీకు సన్యాసం ఇవ్వరు. ఇచ్చినా మేము నిన్ను సన్యాసిగా అంగీకరించం అన్నారు సుమేధానంద. వారికి నమస్కరించి వెళ్ళిపోయాను.
తరువాత రెండు రోజుల పాటు మూడు డజన్ల మఠాలలో వందకు పైగా సాధువులను కలుసుకున్నాను. పుట్టుక దోషం వలన నేను సన్యాసిని కావడానికి వీలులేదని, సనాతన బ్రాహ్మణులు చెప్పారు. నీకు ఎక్కడి నుండి వచ్చినా సరే విష్ణువు దేవాది దేవుడని వేదాల సారాంశాన్ని కబీరు చెప్పాడని నీవు అతన్ని గురువుగా స్వీకరిస్తే, తమలో చేర్చుకుంటామని అన్నారు. ఇలాంటి వారితో నాకు మాయావటిలో రెండేళ్ళ అనుభవం వుంది. మరికొందరు నన్ను వేచి వుండమని తమ పద్ధతులను చూచి తట్టుకోగలవసుకుంటే కాలక్రమేణా చేర్చుకుంటా మన్నారు. అవన్నీ నాకిష్టం లేకపోయాయి. ఊరికే ఉండదలచ లేదు. హరిద్వార్, ఋషీకేష్ లో లాంఛన ప్రాయంగా కొంత డబ్బిస్తే సన్యాసిగా దీక్ష ఇస్తారని తెలిసింది. వేలాది మంది ఈ విధంగా సన్యాసం పుచ్చుకొని కాషాయ వస్ర్తాలు వేసుకున్నారు. మరి కొందరు స్వతంత్ర సాధువులు స్వయంగా కాషాయ వస్త్రాలు వేసుకొని ఏదో పేరు పెట్టుకొని స్థిరపడటమో లేక సంచారమో చేశారు. సన్యాసి కాక పూర్వం ఏమిటో సాధారణంగా అడగరు. సాధువులలో వందలాది మంది పండితులున్నారు. వేలాది మంది పామరులూ వున్నారు. సన్యాసులకు గుర్తింపు పత్రం ఏదీ లేదు.
ధర్మశాలలో నిద్రపోవాలని ప్రయత్నించాను. అంతలో హరిశ్చంద్ర ఘాట్ వద్ద కొందరు జనం గుమిగూడి ఒక స్వామీజీ ప్రసంగాన్ని వింటున్నారు. అతడు మాయను గురించి ఉపన్యసిస్తున్నాడు, నేనూ వెళ్ళాను. అది వెన్నెల రాత్రి, అందరూ వెళ్ళిన తరువాత ఆయన నన్ను చూచి అయితే ఈ జనంతో పాటు నువ్వూ చేరావన్న మాట అన్నారు. గత రెండు రోజులుగా నా అనుభవాలు చెప్పాను. ఆసక్తికరంగా విన్నాడు. నేను హరిద్వార్ వెళ్ళి సన్యాసం పుచ్చుకుందామనుకుంటున్నాను అన్నాను. ఆయన రుద్రాక్షమాల త్రిప్పుతూ మౌనంగా వుండమని నాకు సంజ్ఞ చేసి, చాలా సేపు అలాగే ఉండిపోయారు. తరువాత ఆయన అన్నారు. ఒకవ్యక్తి త్యజిస్తే, అతడు విముక్తి పొందాలి అని ఉపనిషత్తులో ఉన్నది. ఇది బ్రాహ్మణులకే పరిమితం కాదు. కనుక నీకు దీక్ష ఇస్తాను అలాంటి వాక్యాలను మాయావటిలోని సన్యాసులు కూడా తరచు ఉదహరిస్తుండే వారు. ఆశ్రమాలు సన్యాసానికి రావాలని వీరు సనాతనులకు సమాధానం చెప్పేవారు. ఏమైనా నేను అమితానందం చెందాను వినయంగా కృతజ్ఞతలు చెప్పాను. ముకుళిత హస్తాలతో కూర్చున్నాను. ఫాడ్యమినాడు నీకు సన్యాసం ఇస్తాను. ఇంకొక వారం రోజులు నీవు వేచి వుండాలి. రేపు భిక్ష ఇస్తాను. దక్షిణ తీసుకురా. నా పేరు విశ్వానంద భారతి. హనుమాన్ ఘాట్ దగ్గర మద్రాసు స్వామీజీ అని అడిగితే చాలు అన్నారాయన.
ఒకడజను అరటి పళ్ళు, కొబ్బరికాయ, కొన్ని బత్తాయిపండ్లు సేకరించాను. ధ్యానం చేసి విశ్వనాథ దేవాలయంలో పూజచేసి మరునాడు ఉదయం ఉపవాసం వున్నాను. ఘాట్ వద్దకు రాగానే మద్రాసు సాధువు కొరకా అంటూ ఒకతను నా దగ్గరకు వచ్చాడు. అవునన్నాను. స్వామిని అతిథిగా ఆహ్వానించిన కాశీ కుటుంబవాసి కుమారుడతను. వారు 300 ఏళ్ళనాడు పశ్చిమ భారతం నుండి వచ్చి స్థిరపడ్డారు. స్వామి విశ్వానంద దక్షిణాది నుండి వచ్చారు. ఆయన ఇంకొక వారానికి పెళ్ళి కానుండగా 18 ఏళ్ళపుడు సన్యాసం స్వీకరించాడు, దశమి ఆశ్రమంలో అధ్యయనం చేసి 7 సంవత్సరాలు గంగోత్రిలో ధ్యానం చేశాడు. నాలుగు పూర్ణ కుంభాలలో ఆయన స్నానం చేశాడు. అనేక పర్యాయాలు భారతదేశం పర్యటించాడు. హిందీ, కన్నడం, తమిళం, సంస్కృతం అయనకు కొట్టినపిండి. తమిళ, సంస్కృతంలో చక్కని సిద్ధాంత చర్చలు, భక్తిగీతాలు వ్రాశాడు. ఇంగ్లీషు చదవగలరు. కాని మట్లాడలేదు. నేను హనుమాన్ ఘాట్లో ఆయన గదిలో ప్రవేశించి సాష్టాంగ ప్రమాణం చేశాను. ఆయన చదువుతున్న పత్రిక పక్కనబెట్టి, కళ్ళజోడు తీసి తన ప్రక్కన కూర్చోమన్నాడు. దక్షిణ తెచ్చావా అని అడిగాడు. చీకటిపడే సమయాన దీక్ష ఇస్తాను. తరువాత విశ్రాంతి తీసుకో. రాత్రి 12 గంటలకు మణికర్ణికలో సన్యాసం స్వీకరించు.

సన్యాసం అంటే...

No comments: