Monday, July 7, 2008

మన శాస్ర్తజ్ఞులలోనూ ఇలాంటి నమ్మకాలున్నాయా

11 వందల మంది సైంటిస్టుల నమ్మకాలు, విశ్వాసాలపై శాస్త్రీయ పరిశీలనాకేంద్రం, అమెరికా సెక్యులర్ సంస్థ అధ్యయనం చేశాయి. భారత దేశంలో 120 సంస్థలలోని సైంటిస్టుల అభిప్రాయాలను సేకరించి, క్రోడీకరించాయి. మనరాష్ట్రంలోని విశ్వవిద్యాలయ, పరిశోధనాలయాలలో సహా నిపుణుల గాఢఛాందసాలు గమనించింది.
విశ్వవిద్యాలయాలలో జ్యోతిష్య బోధన తగదని 44 శాతం శాస్త్రజ్ఞులు గట్టిగా వ్యక్తపరిచారు.
శ్రీహరి కోటలో ప్రయోగించిన రాకెట్ ను, ముందుగా తిరుపతి వెంకటేశ్వరుడి విగ్రహం ముందు నమూనా వుంచి, దీవెనలు అందు కోవడాన్ని 46 శాతం శాస్త్రజ్ఞులు నిరసించారు. 41 శాతం ఆమోదించారు.
సెక్యూలరిజం అంటే మత సహనం అని అత్యధికులు, ప్రభుత్వం నుండి మతాన్ని వేరుగా వుంచాలని మరికొందరు అన్నారు. మతరహితం అన్న వారు 20 శాతమే.
పరిణామ సిద్ధాంతాన్ని 88 శాతం అంగీకరించగా, అతి స్వల్పంగానే దీనితో విభేదించారు.
చికిత్సలలో మార్గాంతర వైద్యాలపట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హోమియో పనిచేస్తుందని 50 శాతం నమ్మారు. ప్రార్థన అక్కరకొస్తుందని 49 శాతం భావించారు. స్వస్థత ప్రార్థన కూటాల చికిత్సకు 16 శాతం తలూపారు. వాస్తు, జ్యోతిష్యాలకు కేవలం 14 శాతం ఆమోదమే లభించడం గమనార్హం. అయస్కాంత చికిత్సను 13 శాతం ఔనంటున్నారు.
హస్తసాముద్రికాన్ని 10 శాతం, రేకీని, పంచాగాన్ని 8 శాతం, రత్నాల చికిత్సను, 7 శాతం, సంఖ్యా శాస్త్రాన్ని 6 శాతం, తాయెత్తులను 3 శాతం మాత్రమే ఆమోదముద్ర వేశారు.
రాజ్యాంగ మౌలిక విదులలో సైంటిఫిక్ ధోరణి ప్రచారం చేయాలనేది కొందరు నిశితంగా చూడగా, మరికొందరు నిరాదరించారు. కావాలన్నవారు స్వల్పం.
దేశంలో శాస్త్రీయ విద్య స్వల్పంగా వున్నట్లు అంగీకరించారు.
శాస్త్రీయంగా రుజువైన వాటికి మతం అడ్డొస్తే, విమర్శించడానికి 44 శాతం సైంటిస్టులు సంసిద్ధతచూపారు. 23 శాతం మతాన్ని విమర్శించ దలచలేదు.
సైంటిస్టులలో 14 శాతం తమ మతాన్ని చెప్ప నిరాకరించగా, 10 శాతం సెక్యులర్ అని స్పష్టం చేశారు. సర్వేచేసిన సైంటిస్టులలో 43 శాతం ఆరోగ్య రీత్యా, మత కారణాలుగా శాఖాహారులమన్నారు.
దేవుడిపట్ల నమ్మకం లేదని 12 శాతం చెప్పగా, గట్టిగా నమ్మకం గల దన్నవారు 26 శాతం వున్నారు. 4 శాతం సమాధానం చెప్పనిరాకరించారు. వ్యక్తిగత దైవంలో ఏమాత్రం నమ్మకం లేదన్నవారు 30 శాతం వున్నారు.
బాబాల మహత్తులను 24 శాతం నమ్మారు. అత్యధిక సంఖ్యాకులు కేవలం దేవుడు మాత్రమే మహత్తులు చేయగలడని, బాబాలు మాతలు కాదన్నారు.
కర్మను నమ్మినవారు 29 శాతం, మరణానంతర జీవనాన్ని 26 శాతం పునర్జన్మను 20 శాతం నమ్మారు. కులాన్ని నమ్మిన వారు 6 శాతం వుండడం పెద్ద విశేషం.
సైంటిస్టుకావడానికి వ్యక్తిగత ఆసక్తి కారణం అని 55 శాతం చెప్పగా, కేవలం ఉద్యోగ భృతి అన్నవారు స్వల్పమే.
సర్వే పూర్తిగావడానికి సంవత్సరం పట్టింది. శాస్త్రీయ పరిశీలనాకేంద్రం తలపెట్టిన యీ పథకానికి అమెరికా సెక్యులర్ సంస్థ పూర్తి సహకారం అందించింది.
తమ ప్రత్యేక శాఖలో శాస్త్రీయపద్ధతి పాటించిన సైంటిస్టులు, అన్ని రంగాలలో అదే వివేచనా పద్ధతి అనుసరిస్తే మూఢ విశ్వాసాలు తొలగిపోడానికి దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

9 comments:

కత్తి మహేష్ కుమార్ said...

మంచి సమాచారం నెనర్లు.

కొత్త పాళీ said...

So what is the point?
There is a huge difference between individual beliefs/practices and moodha visvasalu

innaiah said...

If scientist brings his personal superstition to the office it has great bad impact on the society. Scientist who follows scientific method in his special field fails to apply the same method in other walks of life. That is bad model to the future generations.

కొత్త పాళీ said...

Sir, with all due respect, that is a ridiculous conclusion. Given the history of our own Indian "scientific" organizations, at least two generations of scientists have served and retired, being replaced by new blood all the time. What adverse effect did their personal beliefs have on the future generations? Our super scientist and former president Kalam, I heard, is a firm believer in Bhagavad Gita and the power of the Almighty. To the extent I know, he only had a very positive impact on the youth of the country. Moreover, I personally know many scientists of varied standing whose personal beliefs did not interfere with their scientific work. The "belief" that such behavior is a bad model to the future generations seems more like a superstition to me than a scientific conclusion.

బొల్లోజు బాబా said...

ఇన్నయ్య గారికి
కొత్తపాళీగారి వాదన సహేతుకంగా ఉన్నట్లు నాకనిపిస్తుంది. ఎక్కడో చదివాను athiesm is also a kind of superstition అని. కొంతవరకూ నిజమే అనిపిస్తుంది.
మీ వివరణ వినాలని ఉంది.
బొల్లోజు బాబా

innaiah said...

I see your point. Mr Kalam set a bad example in visiting Satya Sai Baba and touching feet as President and not as personal belief.Similarly he visited matha amritanandamayi .Both set bad examples to the nation and youth. You may wonder how.The Babas and Mathas acted as though they are above constitution in several matters .Police could not register a case against Sai Baba when six murders took place in his presence and he is the head and godman of the ashram. It is because he has full support of highest office in the country.
Coming to the next point, we requested Kalam to ask his colleagues and technical scientists in Srihari Kota to stop religious practices for scientific inventions. They went with replica to Tirumala and claimed to have received the blessings before launching the rocket. That sets definitely bad precedent to the youth. Instead of depending the capacity of scientist they mortgaged their effort to superstition. Similar examples are numerous, of course.
Today youth including the high tech persons lost confidence in themselves on social matters and succumb to bling worship.
Coming to your point, so far I know, Atheism never said that there is no god. Instead they say the god claimed by religions, and faithful followers is denied by them. They say that the claim of god as written in holy books and holy people is false. The burden of proof of the existence of god is on the persons who emphatically say that there is god. Atheists never claimed such pretension. Please indicate if there is any such claim.

కొత్త పాళీ said...

Sir, you did not address anything I said. I am not interested in debating athiesm or existence of good.
Your statement was about such behavior by scientists setting a bad example for future generations. I am challenging that notion. I gave you what proofs I could.
In your response, you only reiterate your "opinion" that it is a bad example. There was no argument and there certainly wasn't any proof.
Anyway, thank you for the debate.
BTW, in your post, you said the study was sponsored (conducted?) by American Secular Institute or some such thing. Did they do a similar investigation of the religious beliefs of American scientists?

innaiah said...

It is colloboration of secular society in America and center for inquiry in india. They do research on scientists belief in america too.

Anonymous said...

"మార్గాంతర వైద్యాలు"గా మీరు పేర్కొన్న పద్ధతులు - ప్రార్థన, స్వస్థత ప్రార్థన కూటాల - సరసన హోమియోపతిని ఏ ప్రాతిపదికన చేర్చారో అర్థం కావడం లేదు. అది అల్లోపతీ, ఆయుర్వేదం లాగే ఒక వైద్యవిధానం. దానికీ, ఈ సర్వేకూ ఏమిటి సంబంధం? ఆయుర్వేదం, యోగా, నాచురోపతీ, యునానీ, సిద్ధ వైద్యం కూడా మూఢవిశ్వాసాలే, వైద్యం కాదు అంటారా?