Tuesday, July 22, 2008

జస్టిస్ ఆమంచర్ల గంగాథరరావు


జస్టిస్ గంగాధర రావు పుస్తకం విడుదల చేస్తూ















కొందరు న్యాయ మూర్తులతో సన్నిహిత పరిచయం వుండడం గొప్ప అనుభవం.కేవలం కోర్తులకు పరిమితం గాక మానవ విలువలు పాటించే వారి పాత్ర విశేష మైనది.గంగాధర రావు ఆ కో వకు చెందుతారు .
జస్టిస్ గంగాథరరావుకు 87 సంవత్సరాలు, వాకర్ పట్టుకొని ఇంట్లోనే నడుస్తున్నారు. చూపు, జ్ఞాపకశక్తి బాగా వున్నాయి. సమకాలీన విషయాలు చదువుతారు.
జడ్జిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి రిటైర్ అయిన తరువాత కొన్ని కమీషన్ లకు అధ్యక్షత వహించారు. దుర్గాబాయ్ దేశ్ ముఖ్ సoస్థలకు ఆధిపత్యం వహించారు. అనేక మానవవాద హేతువాద సభలలో పాల్గొని ప్రసంగించారు.
1921లో నెల్లూరులో పుట్టిన గంగాథరరావు ఉన్నత విద్యను మదరాసులో పూర్తి చేసుకొని లాయర్ గా బొంబాయిలో హైదరాబాద్ లో ప్రాక్టీసు చేశారు. జడ్జి కాకముందు పబ్లిక్ ప్లాసిక్యూటర్ గా పనిచేశారు. జడ్జి కావడానికి అర్హత జాబితాలోకి వచ్చినా, పదవి రావటానికి 10 సంవత్సరాలు పట్టింది. అందుకు కారణం ఆయన విద్యార్థి దశలో కమ్యూనిస్టు ఉద్యమాలలో పాల్గొనటమే.
1940లోనే గంగాథరరావు విద్యార్థి ఉద్యమాలలో చురుకుగా పాల్గొని చక్కని ఉపన్యాసాలు చేసేవారు. ఆయన ఉపన్యాసాలు ఎంతగా ఆకట్టుకున్నాయంటే, ఏకగ్రీవంగా స్టూడెంట్ ఫెడరేషన్ కు రాష్ట్ర నాయకుడుగా ఎన్నుకున్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో జైలుకు వెళ్ళి 1942లో ఏడాదిపాటు వెల్లూరు కారాకారంలో అనుభవించారు. అప్పటికే ఆయనకు పెళ్ళి అయింది. జైలుకు పోయేముందు ఆయన భార్య గర్భిణి. ఆయన జైలులో ఉండగా తొలి కుమార్తె ఝాన్సీ పుట్టింది. కాని ఏడాది వరకు తన కుమార్తెను చూసుకొనే అవకాశం ఆయనకు లేకపోయింది. 1940 ప్రాంతాలలో గుంటూరు సభలలో హీరేన్ ముఖర్జి, జ్యోతిబసు వంటి వారు, ఆయన ఉపన్యాసాలు విని మెచ్చుకున్నారు.
వెల్లూరులో ఆయనతో పాటు పుచ్చలపల్లి రామచంద్రా రెడ్డి, పిల్లల మర్రి వెంకటేశ్వర్లు, కామరాజు నాడార్ మొదలైన వారు ఎందరో సహచరులు.
గంగాథరరావును అభిమానులు గన్ అని పిలిచేవారు. చాలా చురుకైన, పదునైన ఉపన్యాసాలు చేయటమే అందుకు కారణం. గంగాధరరావుగారితో నాకు చిరకాలంగా సన్నిహిత మిత్రత్వం ఉన్నది. అబద్ధాల వేట, అనే నా పుస్తకాన్ని ఆయన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరిస్తూ, విమర్శనాత్మక ప్రసంగం చేశారు.
అమెరికా ఒకసారి ఆయన పర్యటించినప్పుడు అక్కడ కూడా కలుసుకుని కాలక్షేపం చేశాం. న్యాయ సలహాలు ఇవ్వటంలో దిట్ట. ప్రొఫెసర్ శేషాద్రి, ఆలపాటి రవీంద్రనాథ్, నేను, గంగాథరరావు కలసి, ఎన్నో సందర్భాలలో చర్చలు జరిపాము. ఆయనతో సన్నిహితత్వం చక్కని అనుభవం.

No comments: