
సూర్యదేవర రాజ్యలక్ష్మీ దేవి, వట్టి కొండ విశాలాక్షి, వాసిరెడ్డి సీతాదేవి కొర్నెపాటి శేషగిరి రావు, మారేమండ నాగేశ్వరరావు.
మా చేబ్రోలుకు చెందిన సాహితీ పరులలో బాగా పేరు తెచ్చుకున్న రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. అంతగా తెలియని కవి, టీచర్ కొర్నెపాటి శేషగిరి రావు.
సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి, కాంగ్రెస్ సేవాదళ నాయకురాలిగా, ఎన్.జి. రంగా శిష్యురాలుగా, గ్రామంలో మహిళా శిక్షణ కేంద్రాలు నిర్వహించారు. ఇది 1950 నాటి మాట. ఆ తరువాత ఆమె హైదరాబాద్ కు తరలి, స్థిరపడిపోయారు. తెలుగు దేశం అనే పత్రిక పెట్టి చాలా కాలం నడిపారు. అందులో రాజకీయ, సాంఘిక విషయాలు ప్రచురించారు. సాంఘిక, సేవకురాలిగా అనేక మంది యువతులకు ఉద్యోగాలు కల్పించడం ఆమె వృత్తిగా పెట్టుకున్నారు. హైదరాబాద్ లో వి.బి. రాజుతో కలసి రాజకీయాల్లో వున్నారు. మాకు కుటుంబ మిత్రురాలు.
వట్టికొండ విశాలాక్షి కథలు, నవలలు రాశారు. ఆమె భర్త వట్టికొండ రంగయ్య గుంటూరు నుండి నడిపిన ప్రజా వాజావాణి వారపత్రికలో ఆమె రచనలు ప్రచురితంకాగా, పుస్తక రూపం దాల్చాయి.
కొర్నెపాటి శేషగిరిరావు చేబ్రోలు ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా వుంటూ, కవితలు రాశారు. 1945 నుండీ కుటుంబం అంతా నాకు తెలుసు, నాకు టీచర్ కూడా, మా అన్న విజయ రాజకుమార్ కు కవిత్వం, రచన, ఛందస్సు, చెప్పేవాడు. పుస్తకాలు స్వయంగా అచ్చు వేయించుకొని, సంచిలో పెట్టుకుని తిరిగి అమ్ముకునే వారు.
మారేమండ నాగేశ్వరరావు నాకు ఎ.సి. కాలేజీలో తెలుగు టీచర్ 1954-58లో. ఆయన బోధన అంత ఆసక్తికరం కాదు. మిత్రులుగా సహృదయులు. కవితలు రాశారు. మారేమండ Made difficult అనిపించుకున్నారు, కత్తి అంటే ఛురక అంటూ పాఠాలు చెప్పేవారు.
వాసిరెడ్డి సీతాదేవి (1933-2007) చేబ్రోలులో నాకు పరిచయం లేదు. హైదరాబాద్ లో స్థిరపడిన తరువాత తెలుసు. బాగా సన్నిహితులమయ్యాం. ఆమెకు నవలా రచయిత్రిగా ఖ్యాతి లభించింది. చాలా మంది అనుకున్నట్లు ఆమె కమ్యూనిస్టు కాదు. కాని ఆమెకుటుంబంలో, సోదరుడు నారాయణరావు కమ్యూనిస్టు.
సీతాదేవి అవివాహిత. ప్రభుత్వ ఉద్యోగిని. తెలుగులో రచనలు చాలా చేయగా ఇంగ్లీషులో పరిమితంగా రాశారు. ఆమె రచనల ఆధారంగా సినిమాలు వచ్చాయి. కొన్ని రచనలు వివాదాలకు దారి తీశాయి. మరీచిక నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించగా కోర్టుకు వెళ్ళి అది తొలగింపజేసుకోగలిగింది. అనేక అవార్డులు, సత్కారాలు, సన్మానాలు పొందారు.
రచనలు : మట్టి మనిషి, కీర్తి నార్జించిన నవల. నవలలు-40, కథలు-9, వ్యాసాలు-3, పిల్లల పుస్తకాలు-5, మరీచిక (నవల-నిషేధానికి గురైంది)
ఎడిటర్ : వనితా జ్యోతి. హిందీ, ఇంగ్లీషు నుండి అనువాదాలు చేశారు.
సినిమాలుగా వచ్చిన నవలలు : సమత, ప్రతీకారం, ఆమెకథ, మృగతృష్ణ, మానని మనస్సు.
4 comments:
వాసిరెడ్డి సీతాదేవి చేబ్రోలునివాసి అని తెలుసుగానీ మిగిలిన వారి గురించి ఇప్పుడే తెలుసుకున్నా.ఇలా అందరూ వారివారి ఊళ్ళలోని సాహితీపరులను గురించి పరిచయం చేస్తే బ్లాగుల్లో బోలెడంత సమాచారం పెరుగుతుంది.యూనికొడ్ లో ఉండటంవల్ల సెర్చ్ ఇంజన్లవల్ల కూడా వెతికేవారికి దొరికే సౌలభ్యత ఉంది.
మా పొన్నూరు-నిడుబ్రోలు సాహితీవేత్తలు,కళాకారులు,క్రీడాకారులగురించి మరిన్ని విషయాలు ఎవరన్నా తెలిపితే వారి గూర్చి వివరంగా రాయడానికి నేను సిద్ధం.
కొల్ల క్రిష్నా రావు,కొసరజు అమ్మయ్య,కొత్త సత్యనారాయణ,కొండవీటి వెంకటకవి,పొన్నూరు నిడుబ్రొలు కు ప్రసిద్దులు.
అచార్య రంగ కూడ నవల,రాసారు
అవును, నిజమే! మా వూర్లోనూ బోలెడంత మంది ప్రముఖులు (రచయితలు, కళాకారులు) పుట్టారు.(పోయారు కూడా)ప్రముఖ శకుని(పాత్ర ధారి) సీయెస్సార్,నయాగరా కవుల్లో ఒకరు యేల్చూరి సుబ్రహ్మణయం, సాహితీ విమర్శకులు అక్కిరాజు రమాపతి రావు, నాయని సుబ్బారావు , వారి కుమార్తె నాయని కృష్ణ కుమారి, స్వాతంత్ర్య సమర యోధుడు, త్రివేణీ పత్రిక సమాపదకుడు కోలవెన్ను రామకోటేశ్వ్ర రావు, రాస్తుంటేనే లిస్టు వచ్చేస్తోంది. .వాళ్ల గురించి వూర్నించి వచ్చాక రాస్తాను నేను కూడా!
Innaiah,
Deepti dara Blog lo "anni tapalu oka chota choodandi" ani oka option vundi. Meeru kooda alanti option naa prapamcham lo petandi.
Thanks
Post a Comment