తాళ్ళూరి నాగేశ్వరరావు
(1934-1986)
నవలలు, కథలు విపరీతంగా ఉత్పత్తి చేసిన తాళ్ళూరి నాగేశ్వరరావు మంచి మిత్రులు తెనాలి వద్ద కొలకలూరుకు చెందిన వారు. తెనాలిలో, సాగర్ లో చదివి, తెలుగు అకాడమీలో ఉద్యోగం చేశారు. యువ మాసపత్రిక హైదరాబాద్ నుండి వెలువడుతున్నప్పుడు, నిర్వహణ బాధ్యతలు చేబట్టారు. పేరు వుండేది కాదు.
వ్యక్తిగతంగా నాకు సన్నిహితుడు, స్నేహపాత్రుడు. తిరుపతి వెంకన్న భక్తుడు. సిగరెట్లు, విస్కీ బాగా అలవాటు. హైదరాబాద్ బోట్స్ క్లబ్ లో నేనూ, బూదరాజు రాధాకృష్ణ, ఆయనతో కాలక్షేపం చేసిన రోజులు చాలా వున్నాయి. (1980 ప్రాంతాల్లో) తెలుగు అకాడమీలో బండచాకిరీ చేసేవాడు. రచనలపై కొంత ఆర్జించారు.
ఆరోగ్యం దెబ్బతినడంతో త్వరగా చనిపోయారు. తెలుగు స్వతంత్రలో రచనలు 1948లోనే మెదలెట్టారు. ఆనందవాణి, భారతి, యువ పత్రికలలో చాలా రచనలు చేశారు.
రచనలు : కథకుని కర్మ సిద్ధాంతం, కొత్త యిల్లు, శ్రీవల్లి సంధ్య, రేడియో నాటికలు, కథానికలు, నవలలు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment