Tuesday, July 29, 2008
ఇలాంటి పోలీస్ వుంటే
అబ్రహాం కోవూరు
అబ్రహాం కోవూరు సుడిగాలి పర్యటన చేస్తున్న రోజులవి. ఎమర్జన్సీ కాలమైనా, హేతువాద ప్రచారానికి అడ్డురాలేదు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, తెనాలి మొదలైనచోట్ల బహిరంగ ప్రదర్శన సభలు యువతని ఆకర్షించాయి. కోవూరు అప్పటికే బహుళ ప్రచారం పొందిన వృద్ధ హేతువాదమాంత్రికుడు.
కేరళలో చాలాకాలం వుండి, శ్రీలంకలో స్థిరపడి, పుస్తకాలు రాశారు. కోవూరు తన మంత్రజాల మహిమలతో బాబాల, మాతల గుట్టు రట్టు చేస్తూ పోయారు. అనేక మంది బాబాలను సవాల్ చేశారు. ఆయన థాటికి ఎవరూ నిలవలేకపోయారు. అమెరికా వెళ్ళి జేమ్స్ రాండితో కలసి పని చేశారు. ఆయన రచనలు విస్తృత ప్రచారం పొందాయి.
హేతువాద సంఘాల పక్షాన కోవూరును ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించాం. పర్యటన అంతా సఫలమైంది.
1976 నవంబరు 30న అనంతపురం లలిత కళా పరిషత్ హాలులో సాయంత్రం సభ ఏర్పాటు చేశారు అక్కడి హేతువాద మిత్రులు. కాని పోలీస్ ఆ సభకు అనుమతియివ్వలేదు. కారణం?
కోవూరు నాడు పుట్టపర్తి సాయిబాబాను ఛాలెంజ్ చేస్తూ పోయారు. బెంగుళూరు దగ్గర వైట్ హాలుకు వెళ్ళి ఎదుర్కొన్నారు. సాయిబాబా మహత్తుల బూటకాలను బయటపెడుతూ రచనలు చేశారు.
ఈ నేపధ్యంలో గొడవ అవుతుందనే దృష్ట్యా కోవూరు సభను పోలీస్ లు అనుమతించలేదు. పొలీస్ లలో కూడా సాయిబాబా భక్తులుండడం మరో కారణం.
ఆనాడు రాష్ట్ర పొలీస్ ప్రధానాధికారిగా కోన రామచంద్రారెడ్డి వున్నారు. అప్పట్లో ఇన్ స్పెక్టర్ జనరల్ అనేవారు. ఇంకా డి.జి.పి. అని రాలేదు. హైదరాబాద్ లో పొలీస్ క్లబ్ దగ్గర, మసాబ్ టాంక్ సమీపంలో రామచంద్రారెడ్డి నివాసం.
మిసిమి సంపాదకులు ఆలపాటి రవీంద్రనాథ్ (ఇంకా మిసిమి రాలేదు), హేతువాత సంఘం తరపున నేను, కోనరామచంద్రారెడ్డి యింటికి వెళ్ళాం. అనంతపురంలో కోవూరు సభను స్థానిక పోలీస్ లు అడ్డుకుంటున్న విషయం ఆయన దృష్టికి తెచ్చాం. ఐ.జి. నాస్తికుడేమీ కాదు. అయినా విషయం అంతా విని, భావ స్వాతంత్ర్యం వుండాల్సిందేనన్నాను. వెంటనే ఫోను తీసుకొని స్థానిక పోలీస్ పై ఆగ్రహించి, సభకు అనుమతించమన్నారు.
సాయిబాబాకు వ్యతిరేకంగా మాట్లాడితే, సభకు అనుమతించకపోవడం అవివేకం అన్నారు. ఆయన నిర్ణయాలకు సహకారానికి చాలా సంతోషించాం. వెంటనే అనంతపురంలో హేతువాద సంఘానికి విషయం తెలియపరిచాం. వారంతా సంతోషించారు. కోవూరు సభ జయప్రదంగా జరిగింది. సాయిబాబా పంచినట్లు విభూతి పంచడం, గాలిలో చేతులు తిప్పి వస్తువులు, ఉంగరాలు, తాయత్తులు శివలింగాలు తీసి యివ్వడం ఎలాగో కోవూరు చేసి చూపారు.
కేవలం ప్రదర్శించడమే గాక, దాని వెనుక వున్న హస్తలాఘవం, సైన్స్ విడమరచి చెప్పడం కోవూరు విశిష్టత.
కోనరామచంద్రారెడ్డి వంటి పోలీస్ అధికారులు నేడు అవసరం. పోలీస్ అధికారులు తమ వ్యక్తిగత విశ్వాసాల నుండి విధులకు వేరు చేసి చూడగల విచక్షణ కావాలి.
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
చేతబడి గురి౦చి ఎమన్నా website ఉ౦టే తెలుపగలరు
Dear Sir,
Abraham Kovur went into contesting the existence of God with Hamsaduta Svami and they exchanged series of letters in public which appeard in Srilankan Times. The svami proposed that "Life Comes only from Life" and not from any inert matter. The origin of life is therefore God. Dr Kovur contested this and stated that life can generate from inert substance too and he said he would demonstrate publicy on a stage. The svami accepted to witness the challenge. Dr Kovur died without justifying his point. Please read the chapter "The Challenge" from the book " Life Comes From Life" published by Iskcon. Good bye. Shiva
Scientists Alexander oparin from Russia, J Haldane independently experimented about the origin of life which proved by and large correct.At the origin, ultraviolet rays fell on shalow water areas with the presence of ammonia etc. There life emerged. These experiments were repeated throughout the world which proved correct. we have to rely on scientific experiments which are proved and repeatable. There is no individual authority in science.
There are several websites on Voodoo, sorcery, witchcraft which can be found in internet. Try this:
http://www.hedgewytchery.com/indexb.html
అప్పట్లో కోవూరు అబ్రహాం గారు చాల సార్లు పుట్టపర్తి సాయిబాబా గారి ఫై చాలెంజ్ విసిరారు. ఒక్కసారి కూడా సాయిబాబా ముందుకి రాలేదు. కోడలు దిద్దిన కాపురం సినిమాలో సత్యనారాయణ పాత్ర ద్వార NTR సాయిబాబా ని ఎండ కట్టాడు. కాని ఏమి లాబం. ఈ ప్రపంచం లో మూఢ విశ్వాసాలు రాజ్య మేలుతున్నంత కాలం మార్పు ఆశించడం అనవసరం. విచిత్రం ఏమిటంటే .. ఈ బాబాలకి, అమ్మలకి, మాతలకి, స్వాములకి AMERICA వాళ్లు మరియు అమెరికా దేశం భలే దొరికింది. వాళ్ళకి అంట తీరిక, ఓపిక ఎక్కడనుండి వస్తాయో అర్థం కాదు. కానివ్వండి... కొంతమంది అయిన బాగుపడుతున్నారు కదా..
తెనాలికి చెందిన కన్నెగంటి జగ్గయ్య,అప్పటి నాస్తిక ఉద్యమ కార్యకర్తగా,మూఢ విశ్వాసాలను ఎదిరించి పోరాడిన వ్యక్తి గా నాకు గుర్తు.ఈవిషయాలపై ఒక పుస్తకం కూడ ప్రచురించారు ఆయన.
వీలయితే ఆయన గురించి వ్రాయగలరు..కమలాకరం
మీ విశ్లేషన అద్బుతం
దన్యవాదాలు
కన్నెగంటి జగ్గయ్య రైతు అభిమాని.త్రిపురనేని రామస్వామి, ఆచార్య రంగా,ఆవుల గోపాలక్ర్ష్నమూర్తి శిష్యుడు.వారి పుస్తకాలు పట్టుకొని తిరుగుతుండేవారు. సిస్తుల విషయంలో పోరాడి అరెస్త్ అయ్యారు .భారీ కాయుడు.కో పిస్టి .ధా రా ళం గా చందాలు ఇచే వారు .ఆట్టే చదువు కో లే దు. 1960 ప్రాంతాల లో సంగతు లివి .
త్రిపురనేని రామస్వామి చౌదరి గారి గురించి రాస్తారని ఆశించవచ్చా! 'అభ్యుదయభారతి ' అనే సంస్థ వేసిన 'కవిరాజమార్గము ' అనే పుస్తకం (ఆయన రచనల సంకలనం) చదివి నపుడు చాలా ఉత్తేజపూరితమవుతాము. అబ్రహాం గురించి మా నాన్న గారు చెపుతూ ఉండేవారు.
నాకు సుపరిచితులైన వారికే పరిమిత మయ్యాను.రామస్వామి 1943 లొ పోయారు.
Post a Comment