Saturday, July 5, 2008

పుస్తక సమీక్ష-వెంకటేశ్వర సుప్రభాతం

పచ్చి శృంగారం సంస్కృతంలో వుంటే ఫరవాలేదా!

రచన - వెనిగళ్ళ సుబ్బారావు
(శ్రీవెంకటేశ సుప్రభాత శృంగారం ప్రచురణ, కనమత వెంకట రామరెడ్డి, ప్రగడవరం, రేపల్లె మెయిన్ రోడ్, గుంటూరుజిల్లా).

వెంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలో వుంది. రోజూ రేడియోలలో, టి.వి.లలో మైకులు పెట్టి దేవాలయాలలో, ఇండ్లలో కేసట్లు వాడుతూ పారాయణం చేస్తున్నారు. సంస్కృతం తెలిసిన భక్తులు అతి స్వల్పం. కాని అలవాటుగా మిగిలిన భక్తులు అది విని తరించినట్లు భావిస్తున్నారు. వెంకటేశ్వర సుప్రభాత మహాత్మ్యంపై పత్రికలలో రాయించారు.
పిల్లల చేత కూడా యీ సుప్రభాతాన్ని పాడిస్తున్నారు. అర్థం లేని చదువు వ్యర్థం అంటారు గదా! పిల్లలకు అర్థం చెప్పకుండా వల్లే వేయించరాదు. కనుక అర్థం చెప్పాలి. అర్థం తెలిసిన తరువాత పిల్లలకు వెంకటేశ్వర సుప్రభాతం చెప్పవచ్చునా లేదా అనేది సృష్టపడుతుంది.

సుప్రభాతంలో 1వ శ్లోకం :
కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుని తాతుల నీలతనో
కమలాయతలోచన లోకపతే
విజయీ భవ వేంకట శైలపతే

దీని అర్థం తెలుగులో యిది : లక్ష్మీదేవి చనుమొనలయందున్న కుంకుమపూ రంగువల్ల అంతటా ఎర్రగా చేయబడ్డ సాటిలేని నల్లని శరీరం కలవాడా తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలవాడా జగన్నాయకుడా, వెంకటాచలపతీ, జయించే స్వభావం కలవాడవు కమ్ము.

సుప్రభాతంలో 3వ శ్లోకం :
మాతస్సమస్త జగతాం మధుకైటభారే
వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తి
శ్రీ స్వామిని శ్రితజనప్రియ దానశీలి
శ్రీ వెంకటేశదయితె తవ సుప్రభాతమ్

తెలుగులో అర్థం : అన్ని లోకాలకు తల్లివి. ఎప్పుడు విష్ణుమూర్తి రొమ్ములపై వుండేదానివి. మనోహరమైన ఆకారం గలదానవు. ఆశ్రయించినవారి కోర్కెలను తీర్చేదానవు. వేంకటేశ్వరుని ప్రియురాలివైన శ్రీ లక్ష్మీదేవి నీకు శుభోదయం అగుగాక.

13వ శ్లోకం :
శ్రీమన్నభీష్ట వరదాభిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైకసింధో
శ్రీ దేవతా వృషభుతాంతర దివ్యమూర్తి
శ్రీ వెంకటాచలపతీ తవసుప్రభాతమ్

తెలుగులో అర్థం : లక్ష్మీదేవితో కూడిన వాడా, కోరిన వరాలిచ్చేవాడా, సమస్త లోకాలకు బంధువైన వాడా, పూజ్యురాలైన లక్ష్మీదేవిని నివాసమైనవాడా. ప్రపంచానికంతటికీ ఒక్కడివే విశాలమైన దయగలవాడవు. లక్ష్మీదేవి రెండు చేతుల మధ్య గట్టిగా ఇరక్కున్నవాడా. మనస్సు హరించే అందమైన ఆకారం గలవాడా, వెంకటేశ్వరుడా, నీకు సుప్రభాతమగుగాక.

23వ శ్లోకం
కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తి
కాంతాకు చాంబురహ కుట్మలలోల దృష్టే
కళ్యాణ నిర్మలగుణాకర దివ్యకీర్తి
శ్రీ వెంకటాచలపతీ తవసుప్రభాతమ్
తెలుగులో అర్థం : మన్మధుడి గర్వాన్ని హరించగల అందమైన ఆకారం గలవాడా. ప్రియురాలి తామర మొగ్గుల వంటి చన్నుల మీద ఆసక్తితో చూపులు పెట్టినవాడా. శుభాన్ని కలిగించే మంచి గుణాలకు నిలయమైనవాడా. గొప్ప కీర్తి కలవాడా. వెంకటాచలపతీ నీకు సుప్రభాతముగుగాక.
ఇందులో శ్లోకాలకు తెలుగు అర్థాన్ని ఇంకో విధంగా భక్తులు రాస్తారేమో తెలియదు. ఇక్కడ చెప్పిన తెలుగు అర్థాన్ని కీ.శే. వెనిగళ్ల సుబ్బారావు రచన శ్రీ వెంకటేశ సుప్రభాత శృంగారం నుండి స్వీకరించాను.

నేను ఆమెరికాలో పై విషయాలను ఇంటర్నెట్ లో తెలుగు వారితో చర్చించినప్పుడు, కొందరు భక్తులు ఆగ్రహించారు. అదే వారి సమాధానం. మరికొందరు ఒస్! ఇంతే గదా! సంస్కృతంలో ఇలాంటి శృంగారం మాకు అలవాటే అన్నారు. ఇంకొందరు ఎంతో శృంగారం వుందనుకున్నాం, యీ మాత్రానికే దెప్పిపొడవాలా అన్నారు. చర్చ అలా సాగింది. భక్తుల నుండి అంతకు మించి ఆశించలేని నైతిక విప్లవం కావాలనే వారేమంటారో చూడాలి. ఏమైనా పిల్లల్ని వీటికి దూరంగా వుంచడం అవసరం.

13 comments:

Anonymous said...

నీ అసుంటి కుసంస్కారికి, హిందూ మత ద్వేషికి, మధుర కవుల భక్తి భావం అర్థంకాదు. దేహం మనస్సు ల పరిధి దాటి నీ బోడి హేతువాదం చూడలేదు.

durgeswara said...

మీ చదువంతా కుసంస్కారాన్ని పెంచడానికే పనికి వచ్చింది. భావన మన మనసును బట్టి వుంటుంది. వుదాహరణకు మీ రు అర్ధనగ్నమయిన యువతి చిత్రాన్ని చూస్తే కలవర పడతారు, అదే మనకూతురు చిన్న తనములో మనకంటికి ఏ వస్త్రాలు లేకుండా కనపడ్డా మనకెటువంటి వికారాలు కలుగవు. ఎవరన్నా యువతీ యువకులు ప్రణయకేళిలో వుండటము చూస్తే మనసు వేరే ఆలోచనకు వెళుతుంది అదే మనతల్లిదండ్రులను చూస్తే పవిత్రభావమేతప్ప మనకెటువంటి నీచ భావాలు రావు. మీచదువు మీకు అక్షరాలు మాత్రమే నేర్పి, మీమనసుకుకప్పినమాయ దానినే విజ్ఞానమని భ్రమింపజేస్తున్నది. గమనించుకోండి. మీరుచదివిన పుస్తకం నేనూ చిన్నతనములో చదివాను. ప్రామాణికులుకాని వారు చెప్పేవే నిజమని బ్రమించటము మహా ప్రమాదము. ఇవాన్నీ జరుగుతాయని ఇటువంటి ఆలోచనలు గలవాళ్ళు కలి ప్రభావమువలన పుట్టి ఎలా ధర్మ హాని కలిగించే ప్రచారాలు చేస్తారని ఏనాడో భవిశ్య పురాణములో హెచ్చరించారు. మీలాంటి మేధావులు ఇలా గాడితప్పటం విచారకరం. బుద్దికర్మానుసారణి అన్నారు పెద్దలు. ఏమిచేయగలము.రామ..రామ

Kathi Mahesh Kumar said...

అంటే మొత్తానికి మన తెలుగు సినిమా పాటలకీ ఈ పద్యాలకీ పెద్ద తేడా లేదన్నమాట. కానీ అవి సంస్కృతంలో ఉంటే అదో గౌరవం. మనకి అర్థం కావుగా!

ఏకాంతపు దిలీప్ said...

@ ఇన్నయ్య గారు

ఈ టపా ఆసక్తి ని కలిగించింది. ప్రశ్నించే దిశగా నన్ను నడిపించినడనడంలో సందేహం లేదు. మీకు నెనర్లు.

భక్తి పారవశ్యంతో సుప్రభాతాన్ని పఠించే వారు దీనికి అర్ధం ఏ విధంగా చెప్తారో కూడా ఈ టపాలో రాసి ఉంటే ఇరువురి దృక్పధాలు పోల్చుకోడానికి మాలాంటి యువతరానికి గ్రహించడానికి తేలికగా ఉండేది. అలా జరిగినప్పుడు ఈ టపాకి మరింత హేతుబద్ధత అద్దినట్టవుతుందని నమ్ముతున్నాను.

ఒక కవితలో భిన్నాంశాలని చూడగలమని ఒక భావుకుడిగా నేను నమ్ముతాను. ఒక కవిత సార్వత్రికత సంతరించుకున్నప్పుడు, ఆ భావుకుడు దేన్ని ఆలోచించి రాసాడో అనేది ప్రశ్నాతీతమైపోతుంది. దాని భావం అన్వయించుకునేవారి బట్టి ఉంటుంది.

ఏకాంతపు దిలీప్ said...

@ ఇన్నయ్య గారు

ఈ టపా ఆసక్తి ని కలిగించింది. ప్రశ్నించే దిశగా నన్ను నడిపించినడనడంలో సందేహం లేదు. మీకు నెనర్లు.

భక్తి పారవశ్యంతో సుప్రభాతాన్ని పఠించే వారు దీనికి అర్ధం ఏ విధంగా చెప్తారో కూడా ఈ టపాలో రాసి ఉంటే ఇరువురి దృక్పధాలు పోల్చుకోడానికి మాలాంటి యువతరానికి గ్రహించడానికి తేలికగా ఉండేది. అలా జరిగినప్పుడు ఈ టపాకి మరింత హేతుబద్ధత అద్దినట్టవుతుందని నమ్ముతున్నాను.

ఒక కవితలో భిన్నాంశాలని చూడగలమని ఒక భావుకుడిగా నేను నమ్ముతాను. ఒక కవిత సార్వత్రికత సంతరించుకున్నప్పుడు, ఆ భావుకుడు దేన్ని ఆలోచించి రాసాడో అనేది ప్రశ్నాతీతమైపోతుంది. దాని భావం అన్వయించుకునేవారి బట్టి ఉంటుంది.

Anonymous said...

Dear Sri Innayya Garu,

All along I was under the impression that you were radical. Last time, when some one attacked you in slang I felt bad and wished that guy received his due. Now, I realized how wrong I am.

Please give us a break and save your madness from a public forum. Stop criticizing holy scriptures and continue with some productive work. Do you have guts to discuss scriptures of other religions. I am sure you will reply off tangent.

You are older than me. I bow down and say Namsthe. Stop this pronto.

krishna rao jallipalli said...

పచ్చి శృంగారం ఏమి ఖర్మ... ఇంత కన్నా పచ్చి బూతులున్న సినిమాలను చొంగలు కార్చు కుంటూ వినడం లేదా?? చూడడం లేదా?? మనమందరమూనూ... ఎవడైనా కళ్లు మూసు కుంటున్నాడా.. చెవులు మూసు కుంటున్నాడా ... hall విడిచి బయటకు వెళ్తున్నాడా..
తప్పేమీ లేదు... సినీ రచయతలని అడగండి... భగవంతుడు అనే పదం లోనే బూతు ఉందట.. (ఒక గొప్ప నాటక సినీ రచయత ఆంధ్ర జ్యోతి లో స్వంత డబ్బులతో అప్పట్లో ఒక ప్రకటన కూడా ఇచ్చాడు).

innaiah said...

http://deeptidhaara.blogspot.com/2008/05/blog-post_29.html
Read Purana Pralapam for details in Vedas, Puranas, Gita, how sex is describted in the name of devotion.
similar sex things were there in Holy Bible, Holy koran which we have already put before the people openly.My telugu version of Why I am not a Muslim by Ibn Warrak and my essays on Bible were on record.We have equal treatment of all holy books and religions.

Kathi Mahesh Kumar said...

ఇన్నయ్య గారూ, ఇప్పుడే మీరిచ్చిన లంకెద్వారా "పురాణ ప్రలాపం" చదవడం మొదలు పెట్టాను. రామాయణం ముగించాను.

మంచి చర్చ. సూటైన తర్కం.ఘాటైన విమర్శ. దీనితో తార్కికంగా విభేధించలేనివారు, తమ మిడిమిడి జ్ఞానంతొ ధూషణకు మాత్రమే పాల్పడగలరు. పైన ఉన్న విమర్శలకు కారణాలు నాకిప్పుడు బాగా అర్థమవుతున్నాయి.

మీ ప్రయత్నం ముదావహం.ధన్యవాదాలు.

Anonymous said...

ఇంత ఆలస్యమైనదేం, ఈ టపాకి?

innaiah said...

http://www.centerforinquiry.net/india/local_resources/why_i_am_not_a_muslim/
this book gives about Muslims written by Muslim.

Anonymous said...

"We have equal treatment of all holy books and religions." - వివిధ మతాలకు మీరిచ్చే ట్రీట్‌మెంటు ఒకేరకంగా ఉంటుందో లేదో గానీ.. వాళ్ళు మీకిచ్చే ట్రీట్‌మెంటు మాత్రం ఒకేలా ఉండటంలేదు.

spandana said...

భక్తిభావంతో నెమరు వేస్తే ఇందులో తప్పేమీ కనపడదు గానీ పిల్లలకు అర్థం చెప్పాలంటే ఇబ్బందే. శ్రీలక్ష్మి చనుమొనల రంగు శ్రీనివాసుడికి ఎలా అంటుకుందీ అని ఏ గడుగ్గాయైనా ప్రశ్నిస్తే, ఆ రాసిన మహానుభావుడు ఎంత భక్తి పారవశ్యంలో రాసివున్నా పిల్లాడికి చెప్పడం కష్టమే.

ఇంతమాత్రానికే ఇన్నయ్యగారిమీద ఇంతలేసి మాటలతో విరగబడటమూ తప్పే. ఈ దేవుడి నమ్మకందార్లతో వచ్చిన తిప్పలేమిటంటే నమ్మనివాళ్ళని ఏమైనా అనే హక్కు మాకుంది గానీ మీరు మాత్రం మమ్మలనీ మా వేల ఏళ్ళ నమ్మకాన్నీ ఏమీ అనొద్దు అంటారు.

చదువరి వాఖ్య అదిరింది. మనం ఇచ్చే ట్రీట్‌మెంటు మీద మనకు అదుపు వుంటుంది గానీ అవతలి వాళ్ళ ట్రీట్‌మెంటు మీద కాదు గదా?

--ప్రసాద్
http://blog.charasala.com